నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు ముస్తాబవుతుండగా.. మరో మూడు సినిమాలు సెట్స్ ఎక్కేశాయి. తాజాగా ప్రభాస్ షూటింగ్ సెట్ లో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ వరుస ప్రాజెక్ట్లు లైన్ లో పెడ్డారు. సాహో , రాధేశ్యామ్ వంటి సినిమాలు నిరాశపరిచినా.. ఏమాత్రం తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అంతే కాదు ఈరెండు ప్లాప్ లతో ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే సలార్, ఆదిపురుష్ ప్రొస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండగా.. మరో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ కూడా ఒకటి. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ పోతుంది ఈసినిమా. మరుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా అప్పుడే సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా జరుగుతుది ఈ షూటింగ్. అసలు స్టార్ట్ చేసిన సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. ఈక్రమంలో ఈమూవీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ తో పాటు షూటింగ్ కు సబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక షూటింగ్ సెట్ లె ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించగా.. ఈఫోటోలో ప్రభాస్ , మారుతి పక్క పక్కనే కూర్చుని కనిపించారు. ఈపిక్ చూసిన డార్లింగ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. వైరల్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. ఇక రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.