హీరో తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క డైరెక్టర్ తో కాంబినేషన్ కి మాత్రం ఉండే క్రేజే వేరు. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లొచ్చినా ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే అటు హీరోలు, ఇటు డైరెక్టర్లతో పాటు ఆడియన్స్ కూడా మళ్లీ ఎప్పుడెప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ లో ఈ మధ్య కొన్ని కాంబినేషన్స్ అందర్నీ షాక్ గురిచేశాయి. అలాంటి కాంబినేషన్స్ పై హవే లుక్.
టాలీవుడ్ లో దర్శకులకు గండం వెంటాడుతూనే ఉంది. శాయాశక్తులా కష్టపడి.. తమ టాలెంట్ అంతా జోడించి తొలి సినిమాతో హిట్ కొట్టేస్తున్నారు. అదే ఊపుతో రెండే సినిమా తీస్తే మాత్రం ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు.
కానీ టాలీవుడ్ లో కొందరు యంగ్ డైరెక్టర్స్ మాత్రం….పాత సినిమా సంబంధం లేకుండా జాక్ పాట్ కొట్టేశారు. ఇటీవల డైరెక్టర్స్, హీరోస్ ఎవ్వరూ ఊహించని కొత్త కొత్త కాంబినేషన్స్ వస్తున్నాయి.
RRR నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ప్రభాస్ తో సాహో లాంటి హాలీవుడ్ మేకింగ్ సినిమా తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ తో అందరూ ఆశ్చర్యపోయారు. అస్సలు ఎవ్వరూ ఊహించని, కనీసం గాసిప్స్ కూడా వినపడని కాంబినేషని ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16 పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనుంది. కథ, దర్శకత్వం బుచ్చిబాబు సానాగా స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామ్యం కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ్యాపారవేత్త, నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 2023లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ కాంబినేష్ పై సోషల్ మీడియాలో చర్చ జరిగిన…ఎవరు పట్టించుకోలేదు. కానీ అఫీషియల్ అనౌన్స్ వచ్చాక అందరూ షాక్ అయ్యారు.
ఆచార్య సినిమాతో ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. కానీ గాడ్ ఫాదర్ తో ఆ లోను పుడ్చేశాడు చిరంజీవి. ప్రస్తుతం బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా బిజీగా ఉన్న చిరు.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా ఛాన్స్ ఇచ్చేశాడు అన్ స్టాపబుల్ షో యాడ్స్ తో బాలయ్యని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో సినిమా చేయాలి అన్నాడు. కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా బాలయ్యతో ఎప్పటికైనా సినిమా చేస్తానని అన్నాడు. ఇప్పుడు యువ డైరెక్టర్ల బాలయ్య వెంటపడుతున్నారు.