Homeఅంతర్జాతీయందేశంలో యూట్యూబ్ హవా .. ఓ రేంజ్ లో సాగుతుంది....

దేశంలో యూట్యూబ్ హవా .. ఓ రేంజ్ లో సాగుతుంది….

యూట్యూబ్ .. వీడియోలు .. చూసేవారికి ఆనందం.. పోస్ట్ చేసిన వారికి ఆదాయం కలిగిస్తోంది. తాజాగా ఈ ఆదాయం .. జీవన స్థితిగతుల్ని సైతం నిర్ణయిస్తున్నాయని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.

దేశంలో ప్రస్తుతం యూట్యూబ్ హవా కొనసాగుతోంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్న చందంగా తెలివి ఉన్న వాడు ఊరుకే కూర్చోడు. తనకు కావాల్సిన దాన్ని సంపాదించుకుని తీరుతాడు. ప్రస్తుతం యూ ట్యూబ్ కూడా అదే దారిలో నడుస్తోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. కంటెంట్ రైటర్లు, వీడియో అప్ లోడర్స్, షాట్ ఫిలిమ్స్ ఒకటేమిటి ప్రతి విభాగంలో డబ్బులు రావడంతో అందరు యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ వ్యక్తి ఏకంగా ఏటా రూ.312 కోట్లు సంపాదించడం గమనార్హం. ఇలా యూ ట్యూబ్ కు డిమాండ్ పెరుగుతోంది.

ఆ మధ్య చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఓ ఊరిలో దాదాపు అందరు యూట్యూబ్ అప్ లోడర్లే ఉండటం కూడా విచిత్రమే. యూట్యూబ్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకుల ఆరదణ పొందుతున్నారు. డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఇంకా ఇటీవల యూట్యూబ్ మధ్యలో ప్రకటనలు కూడా వేస్తుండటంతో వాటికి కూడా
డబ్బు వస్తోంది. ఇలా రెవెన్యూ రావడంతో అందరు యూ ట్యూబ్ పై ఆధారపడి జీవిస్తున్నారు. ఓవైపు బతుకు దెరువు, మరోవైపు వినోదం రెండు కలిసి వస్తున్నాయి. దీంతో వారి భవిష్యత్ కు ఢోకా లేకుండా పోతోంది. దేశంలో ప్రస్తుతం ఏడు లక్షల మంది యూట్యూబ్ ను నమ్ముకుని బతుకుతున్నారంటే అది ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుంటోందో తెలుస్తోంది.

దేశంలోని అన్ని భాషల్లో వీడియోలు చేస్తుండటంతో వారికి ఆదాయం కూడా భారీగానే ముడుతోంది. కంటెంట్ క్రియేటర్లు, యూజర్లకు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ఇస్తోంది. కంటెంట్ ప్రొవైడర్లకు మంచి స్థానం ఉండటంతో కొత్తవారు వస్తున్నారు. దీంతో దేశ ప్రజలకు యూ ట్యూబ్ ఓ వరంలా మారుతోంది. వస్తున్న ఆదాయంతో వారి జీవన స్థితిగతులు కూడా మెరుగవుతున్నాయి.యావ‌త్ ప్ర‌పంచ ప్ర‌జ‌ల మ‌న‌స్సులు చూర‌గొన్న యూట్యూబ్ 2021లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థకు.. దేశ జీడీపీలో రూ.10 వేల కోట్ల నిధులు స‌మ‌కూర్చి పెట్టింది. ఆక్స్‌ఫ‌ర్డ్‌ ఎక‌న‌మిక్స్ నిర్వ‌హించిన ఈ సంగ‌తి తేలింది.

ఈ సర్వేలో 7.50 లక్ష‌లకి పైగా స‌మాన‌మైన పూర్తిస్థాయి ఉద్యోగాలు ల‌భించాయ‌ని నిర్ధారించారు. అంత‌కుముందు 2020లో గూగుల్ సార‌ధ్యంలోని యూట్యూబ్ వ‌ల్ల భార‌త్ జీడీపీలో రూ.6,800 కోట్ల నిధులు స‌మ‌కూరితే, 6,83,900 పూర్తికాల ఉద్యోగాలు ల‌భించాయని తేలింది. గూగుల్ ఫ‌ర్ ఇండియా ఈవెంట్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ ఎక‌న‌మిక్స్ స‌ర్వే నివేదిక‌ను ప్ర‌వేశ పెట్టారు. వివిధ రంగాల్లో 5633 మంది యూట్యూబ్ క్రియేట‌ర్ల‌ను ఆక్స్‌ఫ‌ర్డ్ ఎక‌న‌మిక్స్ స‌ర్వేక్ష‌కులు సంప్ర‌దించారు. 4021 మంది యూజ‌ర్లు, 523 మంది వ్యాపారవేత్త‌ల‌ను సంప్ర‌దించారు. భార‌త్‌లో ఎకాన‌మీ సృష్టిక‌ర్త‌గా యూట్యూబ్ నిలిచినందుకు మేం సంతోషిస్తున్నాం.

దేశ‌వ్యాప్తంగా కొత్త కొలువులు, అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ది యూట్యూబ్‌` అని సంస్థ పేర్కొంది. త‌మ ప్లాట్‌ఫామ్‌పై హెల్త్‌కేర్ కంటెంట్‌, లెర్నింగ్ కంటెంట్
విస్త‌ర‌ణ‌కు 2 కొత్త ఫీచ‌ర్లు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు యూట్యూబ్ తెలిపింది. నారాయ‌ణ‌, మ‌ణిపాల్‌, వేదాంత వంటి ప‌లు హెల్త్‌కేర్ సంస్థ‌లు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన కంటెంట్ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాయి. హిందీ, మ‌రాఠీ, త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, గుజ‌రాతీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాష‌ల్లో కంటెంట్
అందుబాటులో్కి వ‌స్తోంది. ప్ర‌పంచ‌దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో ప్ర‌తి నెలా గూగుల్ లెన్స్‌ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. అంత‌ర్జాతీయ యూజ‌ర్ల‌తో పోలిస్తే రోజువారీగా వాయిస్.. భార‌తీయులు రెట్టింపు ఎంక్వైరీ చేస్తున్నార‌ని తేలింది. వారిలో మెజారిటీ యూజ‌ర్లు ఒక‌టి కంటే ఎక్కువ భాష‌ల్లో కంటెంట్ తెలుసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

యూ ట్యూబ్ క్రియేటర్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. క్రియేటర్లకు యూట్యూబ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సొంతంగా బిజినెస్ చేసుకునేందుకు పరోక్షంగా సాయం చేస్తోంది. యూట్యూబ్ ప్లాట్ఫాంపై అన్నిరకాల వ్యాపారాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న బిజినెస్ ప్లాట్ఫాంలో యాడ్స్ ద్వారా యూట్యూబ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తోంది. దాదాపుగా దేశంలో మాట్లాడే అన్ని భాషల్లో యూట్యూబ్ సేవలు అందుతున్నాయి. కంటెంట్ క్రియేటర్లతో పాటు యూజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.
ఒక్క కంటెంట్ క్రియేటర్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తాడని, అందుకే ప్రభుత్వం ఈ ప్లాట్ఫాంపై ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం
సహజమని నిపుణులు సైతం అంటున్నారు.

అదేసమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంటెంట్ క్రియేటర్లు, ప్రభుత్వాలతో పాటు యూట్యూబర్లకు కూడా ఉంటుంది. తమ అభిప్రాయాలను షేర్ చేసుకునేందుకు యూట్యూబ్ ఓ వేదిక గా నిలుస్తోంది. ఫేక్ న్యూస్ వ్యాప్తి, హింసను నిరోధించడంలో తమ విధానం స్పష్టంగా ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు. 2023 నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ వివరించింది. 2023 నుంచి కొత్త బీటా వెర్షన్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. దీని వల్ల క్రియేటర్లకు కొత్తగా ఆదాయ మార్గాలు అందుతాయని చెప్పింది. ఒక కంటెంట్‌ను అనేక ఇతర భాషల్లోనూ రూపొందించేలా క్రియేటర్లకు అవసరమైన సహకారం కూడా అందించనున్నట్టు వెల్లడించింది. 2023 యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆనందదాయకంగా ఉండేలా చూస్తామని యూట్యూబ్‌ హామీ ఇచ్చింది.

అన్ని రంగాల్లో యూ ట్యూబ్ లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. వినోదం, ఫుడ్స్, ఆటో మొబైల్, సారీస్, హౌస్ డెకరేషన్స్, ట్రావెల్ తో పాటు అన్ని రంగాల్లో వీడియోలు తయారు చేసి యూ ట్యూబ్ లో పోస్టు చేస్తున్నారు. దీంతో వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా మనకు డబ్బులు చెల్లిస్తున్నారు. భారత్ లో యూట్యూబ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. YouTube ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లాగానే కాకుండా, యూజర్లు తమ క్రియేటివ్ స్కిల్స్ తో ఉపాధి పొందే మార్గంగా కూడా ఉపయోగపడుతోంది. భారత్ లో చవకైన డేటా, అఫర్డబుల్ ధరల్లో స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు అందుబాటులోకి రావడంతో కొత్త తరం ఔత్సాహిక అంట్రాప్రెన్యూర్స్ ను తయారు చేశాయి.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వేదికగా ఆదాయ మార్గాలను వెతుక్కోవడమే కాకుండా, విజయవంతమైన బిజినెస్ మెన్ గా చాలామందిని మార్చాయి. యూట్యూబ్ స్థానిక క్రియేటర్లు భారత ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న సహకారాన్ని తక్కువగా అంచనా వేయకూడదని సంస్థ పేర్కొంది. భారత్ లో ఉంటూ, యూట్యూబ్ కంటెంట్ ను క్రియేటివ్ గా ప్రొడ్యూస్ చేస్తూ, యాడ్ ఇన్ కమ్ ను జనరేట్ చేసుకుని దేశ ఎకానమీకి సహకరిస్తున్నారు. యూట్యూబ్ ఆడియెన్స్ ను సంపాదించి పెట్టే ప్లాట్ ఫామ్ లానే కాకుండా, క్రియేటర్లు సొంత బిజినెస్ లను విజయవంతం చేసుకోవడానికిక సహకరిస్తోంది.

చిన్న తరహా వ్యాపారాలకు యూట్యూబ్ మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. ఇది ప్రకటనల ఆధారంగా పని చేసే ప్లాట్ ఫామ్ కావడంతో ఇక్కడ ‘విన్ – విన్’పరిస్థితి ఉంటుంది. దీంతో చిన్నాపెద్దా అందరూ యూట్యూబ్ క్రియేటర్లు గా మారి, ఆదాయాన్ని పొందుతున్నారు.అన్ని రంగాల్లోనూ యూట్యూబ్ సందడి చేస్తోంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం గానే కాక .. ఆదాయ వనరుగా కూడా మారుతోంది. దీంతో దేశ ఎకానమీకి కూడా మద్ధతు పలుకుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..


Must Read

spot_img