Homeఅంతర్జాతీయంత్వరలో సౌదీ అరేబియా యూనివర్శిటీలలో యోగా..

త్వరలో సౌదీ అరేబియా యూనివర్శిటీలలో యోగా..

అచ్చంగా ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో యోగాకు అత్యంత ప్రాధాన్యత గౌరవం దక్కింది. సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ ‘SYC’ అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ చెప్పిన దాని ప్రకారం యోగాకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు జరగనున్నాయి.

సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ ప్రకటన మేరకు యోగాకు మద్దతు ఇవ్వడానికి తగిన విధంగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు జరగనున్నాయి. SYC అంటే సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ, క్రీడా మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఓ విభాగం. రాజధాని నగరం రియాద్‌లో నిర్వహించబడే ‘ది కింగ్డమ్ స్పోర్ట్స్ ఇన్ ది కింగ్‌డమ్ విజన్ ఇన్ స్పోర్ట్స్’ అనే ఫోరమ్‌లో ఈ నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ అనేక మంది నిపుణులు అంతర్జాతీయ నాయకులు పాల్గొనబోతున్నారని అరబ్ న్యూస్ తెలిపింది. యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ, విజన్ 2030 సాధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SYC చీఫ్ అల్-మర్వాయ్ చెప్పారు. యోగాభ్యాసం చేసేవాళ్లకు శారీరక మానసికంగా బలం చేకూరుతుంది.

పైగా యోగా క్రమం తప్పుకుండా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సౌదీ అరేబియా గుర్తించింది. సౌదీ అరేబియా తలపెట్టిన విజన్ 2030 ను సాధించడం ఆ దేశానికి ఉన్న చాలా ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అందులో భాగంగా క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం, క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచడం స్థానికంగా, ఖండంగా, అంతర్జాతీయంగా క్రీడా నైపుణ్యాన్ని సాధించడం అని అరబ్ న్యూస్ తెలిపింది. దేశంలో యోగా ప్రతిభను కనుగొనడం, వారు “స్థానిక అంతర్జాతీయ టోర్నమెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారనే ఆశతో వారి నైపుణ్యాలను మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకుంది కమిటీ. జనవరిలోసౌదీ అరేబియా మొట్టమొదటి యోగా ఫెస్టివల్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జెడ్డా నగరంలోని కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీలోని జుమాన్ పార్క్ వద్ద జరిగింది.

మార్వా ఖైరుడిన్ , లానా నాజర్‌తో సహా అనేక మంది అగ్రశ్రేణి సౌదీ యోగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సౌదీ అరేబియా, 2022 లో, దేశంలో యోగా ప్రోత్సాహం కోసం అధికారిక “యోగా ప్రోటోకాల్ స్థాపించడానికి భారతదేశంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. యోగాపై భారతదేశం సౌదీ అరేబియా మధ్య కుదిరిన ద్వైపాక్షిక సహకారం ఇదే అంటున్నారు నిపుణులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి యోగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా చర్యలు తీసుకున్నారు. మోదీ జూన్ 21 ను ఐక్యరాజ్యసమితిలో యోగా డేగా ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు సభ్య దేశాల నుండి అత్యధికంగా మద్దతు పొందారు అప్పటి నుండి, జూన్ 21 ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే గా గుర్తించారు. యోగా హిందూ మతానికి సంబంధించినదని కొన్ని దేశాలు ఇప్పటికీ భావిస్తున్నాయి.

అయితే ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా యోగా గొప్ప తనాన్ని అంగీకరించి దాన్ని యూనివర్శిటీల్లో ప్రవేశపెట్టాలని భావించడం విశేషం అంటున్నారు విశ్లేషకులు. అరబ్ ప్రపంచం ఒక కోటి మూడు లక్షల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది పశ్చిమాన మొరాకో నుంచి ఉత్తరాన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి ఉంది. అయితే, వీటిలోని చాలా ప్రాంతాలలో ప్రజలు అరబ్ మూలాలకు చెందినవారు కారు. అరబిక్ ధారాళంగా మాట్లాడలేని వారు కూడా ఉన్నారు. కానీ, అరబ్ సంస్కృతి ప్రభావం వలన వారందరినీ కూడా అరబ్ ప్రపంచంలో భాగంగానే చూస్తారు. అరబ్ ప్రపంచంలోని ప్రజలను మూడు గ్రూపులుగా చూస్తారు. ఉత్తర ఆఫ్రికా, లెవాంటైన్ అరబ్, గల్ఫ్ అరబ్.నిజానికి 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఈ ఘటన తరువాత మోదీకి ముస్లిం వ్యతిరేకిగా పేరొచ్చింది. ఈ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. 2005లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యూఎస్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం యాక్ట్ 1998 కింద అమెరికా ఆయన వీసాను నిషేధించింది. అమెరికా సంస్థ అయిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం సిఫార్సుపై ఈ నిషేధాన్ని విధించింది. 2002 అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రను ఈ కమిషన్ విమర్శించింది. 2014లో మోదీ భారత ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. సౌదీలోని హిందు దేవాలయాలకు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఇక్కడి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తోంది సౌదీ అరేబియా

Must Read

spot_img