Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్సీ ఫలితాల వేళ .. ఏపీలో ఓ ఆసక్తికర చర్చ !!!

ఎమ్మెల్సీ ఫలితాల వేళ .. ఏపీలో ఓ ఆసక్తికర చర్చ !!!

విశాఖలో టీడీపీ గెలుపుతో .. వైసీపీ పట్టు బిగించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అందుకు గంటా రాజీనామాను అస్త్రంగా మార్చుకోనుందని సమాచారం. ఏపీలో మరో ఉప ఎన్నిక తప్పదా.. విశాఖలో పట్టు నిరూపించుకొనేందుకు వైసీపీ సిద్దం అవుతోందా.. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది. పీడీఎఫ్ తో ఒప్పందం…రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టీడీపీ విజయం సాధించింది. దీంతో, విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తమని వైసీపీ చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించటం లేదని ప్రచారం మొదలు పెట్టింది. దీనిని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విశాఖ కేంద్రంగానే తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమచారారం.

ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఉప ఎన్నికలు..స్థానిక సంస్థల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపొందింది. కానీ, గ్రాడ్యుయేట్స్ నియెజకవర్గాలు మూడు స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ విజయాన్ని టీడీపీ భారీగా ప్రచారం చేసుకుంటుంది. రాజధానుల అంశానికి ముడి పెడుతోంది. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని చంద్రబాబు.. పవన్ చెప్పుకొచ్చారు. దీంతో..ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం.

విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ..రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోనే మరో ఎన్నిక ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. విశాఖతో పాటుగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, విశాఖ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారుతోంది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన రాజీనామా లేఖ ఇచ్చి ఉన్నారు. 2021, ఫిబ్రవరి 12న గంటా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ అందించారు. ఈ లేఖపై స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగినా..ఇప్పుడు విశాఖ టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అదే టార్గెట్ గా వైసీపీపావులుకదుపుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యూహం వైసీపీకి ఏమేరకు కలిసివస్తుందన్న చర్చలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదించటం ద్వారా అక్కడ ఉప ఎన్నిక ఎదుర్కోవాలనేది వైసీపీ నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదిస్తే అటు టీడీపీకి ఎమ్మెల్యే తగ్గటంతో పాటుగా విశాఖలో ఉప ఎన్నికలో గెలిచి..తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. వైసీపీ నాయకత్వం ఎన్నికకు వెళ్లాలని నిర్ణయిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా ఉప ఎన్నిక జరగాలంటే అసెంబ్లీ కార్యాలయం ఖాళీ నోటిఫై చేసిన తరువాత ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది.

ఎన్నికలు నిర్వహించినా మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక.. ఈ ఎన్నిక ద్వారా టీడీపీ -జనసేన పొత్తు పైన స్పష్టత రానుంది. అదే సమయంలో విశాఖలో ఖచ్చితంగా గెలిచి తమ బలం చాటాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి.. అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్లుగా గంటా రాజీనామాను ఆమోదిస్తారా.. ఉప ఎన్నిక జరుగుతుందా అనేది ఈ రోజు లేదాఅనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసిపి తన సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతోంది.

ఉత్తరాంధ్ర పట్టబద్రుల స్థానాన్ని కోల్పోయిన చోట వైసీపీ పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మరో ఉప ఎన్నిక తప్పదా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పిడిఎఫ్తో ఒప్పందం ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టిడిపి విజయం సాధించింది. దీంతో విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని వైసిపి చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదని ప్రచారం మొదలైంది. ఇందుకోసం కేలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సంబంధించిన నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది. పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఏపీ అధికార వైసీపీ విశాఖలో తమకు గట్టిపట్టు ఉందని, రాజధాని నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారని రుజువు చేసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే గంటా రాజీనామా దిశగా పావులు కదుపుతోందని టాక్ వినిపిస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా అందరికంటే ముందే ఉద్యమంలోకి దూకి రాజీనామా చేసేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అధికార వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీని ఇరుకునపెట్టారు. అయితే గంటా ఎత్తుకు పైఎత్తు వేసే దిశగా అధికార వైసీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ సర్కార్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసి రాజకీయాల్లో హీట్ పెంచారు. మొదటిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమని రాజీనామా చేయగా.. అది ఒట్టి ఫేక్ రాజీనామా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఆ తర్వాత స్పీకర్ ఫార్మాట్ లో రెండోసారి రాజీనామా పంపించారు. ప్రస్తుతం ఆ రాజీనామా పత్రం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి వద్ద పరిశీలనలో ఉందట.. స్పీకర్ తమ్మినేని సీతారం ఫోన్ లో గంటాతో మాట్లాడి ఆయన రాజీనామాను ఖాయం చేసుకున్నారట..

దీంతో గంటా రాజీనామా విసయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదిస్తే వచ్చే ఆరునెలల్లోనే వివాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయం. దీంతో వైసీపీ ముందస్తుగా ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు విశాఖ నార్త్ లో వైసీపీ నేతల సందడి ఎక్కువైంది. ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి ఇతర పెద్దలు ఇప్పుడు విశాఖ నార్త్ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారట.. వైసీపీ ఈ సీటును కైవసం చేసుకొని గంటాకు షాకివ్వాలని యోచిస్తోందట.ఉప ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావును ఓడించడం ద్వారా, పోయిన పరువు నిలబెట్టుకుని టిడిపికి జనాదరణ లేదనే విషయాన్ని నిరూపించాలని జగన్ భావిస్తున్నారట.

అయితే గంటా శ్రీనివాసరావును విశాఖలో ఓడించడం ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. 1999లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంటా 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఒకపక్క సామాజికంగా , ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న గంటాతో ఇప్పుడు పోటీకి దిగడం కరెక్ట్ కాదని విశ్లేషకులు అంటున్నారు. అదేసమయంలో గంటా యాక్టీవ్ కావడంతో, టీడీపీ మద్ధతు సైతం దక్కనుందని అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గంటాకు జనసేన సైతం మద్ధతు పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో బైపోల్ .. అసెంబ్లీ పోరుకు మరీ ముఖ్యంగా ముందస్తు కు సెమీ ఫైనల్ కానుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img