Homeసినిమాపాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో యశ్..

పాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో యశ్..

కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో యశ్…కేజిఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమా పై ఇటివల హింట్ ఇచ్చాడు.

KGF చాప్టర్ 1, 2తో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటిన కన్నడ హీరో యశ్ ఆ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. KGF తో నేషనల్ వైడ్ గా తన ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న యశ్ తన నెక్స్ట్ సినిమా కోసం వారిలో ఉన్న ఎగ్జైట్ మెంట్ ని కొనసాగిస్తున్నాడు.

యశ్ తర్వాత సినిమా ప్రొడక్షన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. లేటెస్ట్ గా యశ్ బర్త్ డే నాడు కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అధినేత లోహిత్ యశ్ ని కలిసి విష్ చేశారు. అయితే ఈ ఫోటో దాదాపు యశ్ సినిమాను కన్ ఫర్మ్ చేసినట్టే అంటున్నారు.

యశ్ 19వ సినిమా గురించి కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. యశ్ తన నెక్స్ట్ సినిమా కె.వి.ఎన్ ప్రొడక్షన్ లోనే చేస్తాడని ఆల్రెడీ హింట్ వచ్చింది. అయితే ఈ ఫోటోతో అది అఫీషియల్ అయ్యింది. అయితే నిర్మాత హీరో కలిసి అందుకేనా.. నిర్మాత లోహిత్ యశ్ తో సినిమా కన్ఫర్మ్ చేసేందుకే ఈ ఫోటో షేర్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ KVN ప్రొడక్షన్ లో యశ్ చేస్తున్న సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది.

టీవీ ఆర్టిస్ట్ గా మొదలైన యశ్ హీరోగా మొదటి సినిమా నుంచి తన దూకుడు చూపించాడు. ప్రశాంత్ నీల్ తో తీసిన కె.జి.ఎఫ్ ఫ్రాంచైజ్ లు అతన్ని నేషనల్ వైడ్ గా స్టార్ డం తెచ్చుకునేలా చేశాయి. అంతకుముందే కన్నడలో స్టార్ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న యశ్ కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాడు. అందుకే ప్రతి సినిమా విషయంలో అతని కష్టం కనబడుతుంది. స్టార్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు యశ్.

కె.జి.ఎఫ్ 1,2 తర్వాత తన ఫ్యాన్స్ అంచనాలకు తగిన కథతోనే రావాలని కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు యశ్. అయితే కె.వి.ఎన్ ప్రొడక్షన్ లో సినిమా ఫిక్స్ చేయగా ఆ సినిమాకు సంబంధించిన పూర్తి డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. అయితే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో తీస్తారు కాబట్టి బడ్జెట్ కూడా భారీగానే ఉండే ఛాన్స్ ఉంది.

Must Read

spot_img