Homeఅంతర్జాతీయంయూరప్ దేశాలలో వేసవి తాపం... అమెరికాలో హిమపాతం..యూరప్ దేశాలలో వేసవి తాపం...

యూరప్ దేశాలలో వేసవి తాపం… అమెరికాలో హిమపాతం..యూరప్ దేశాలలో వేసవి తాపం…

రాను రాను వాతావరణం ఎటూ అర్థం కాకుండా పోతోంది. ఓవైపు అమెరికాలో హిమపాతం అనూహ్యమైన రీతిలో కప్పేస్తున్న సమయంలో ఆ పక్కనే ఉండే యూరప్ దేశాలలో వేసవి తాపం పొగల గక్కింది. ఇదేం శీతాకాలమో ఎవరికీ అర్థం కాలేదు. ఒవైపు భరించలేని మైనస్ డిగ్రీల చలి వణికిస్తుంటే మరోవైపు ఉక్కబోతలతో వేడెక్కించే సూర్యతాపాన్ని అనుభవిస్తున్నారు జనం..విచిత్రమైన ఈ వాతావరణ వైపరీత్యం.

అమెరికాలో హిమపాతం.. ఐరోపాలో వేసవి తాపం..మొత్తానికి భిన్నమైన శీతాకాలాన్ని చూస్తున్నారు ఆయా దేశాల ప్రజలు. ఈ అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు దారుణంగా కప్పేయటం చూశాం. అసాధారణ హిమపాతంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు, జనజీవనం అల్లాడారు. వంద మంది మరణించారని సమాచారం. కార్లలో తుఫాన్ తగ్గాక వెళదాం అనుకున్నవారు చలికి గడ్డకట్టుకుని శవాలుగా మారిపోయారు. ఓ వారం రోజుల్లోనే ఐరోపా వేదికగా మరో అసాధారణ ప్రకృతి పరిణామం ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. గడ్డ కట్టాల్సిన చోట, మంచు పేరుకుపోవాల్సిన చోట ఈ సారి ఆ ఊసేలేదు.. వాతావరణం ఎండాకాలంలా వేడిని తలపిస్తోంది.

జనవరి 1 వచ్చిందంటే.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు ఆల్ప్స్‌ పర్వతశ్రేణులకు చేరుకుంటారు. పర్వతాలపై పేరుకుపోయిన మంచులో స్కీయింగ్‌ చేయటానికని అంతా వస్తారు. ఈ సారీ అలాగే ఆశగా వచ్చారు. తీరా చూస్తే ఆ పర్వత శ్రేణుల్లో మంచు లేకుండా పోయింది. చివరకు స్కీయింగ్‌ నిర్వాహకులు కృత్రిమంగా మంచు పరచి అరకొర వినోదంతో సర్దుకుపొమ్మన్నారు. మామూలుగానైతే ఈ సమయానికి ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల దరిదాపుల్లోకి వచ్చేస్తాయి. అంతకంటే తక్కువకు కూడా కొన్నిచోట్ల చేరుకుంటాయి. అనేక దేశాలపై మంచు దుప్పటి కప్పేస్తుంది. అలాంటిది ఐరోపాలోని అనేక దేశాల్లో ఈసారి వందేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ ఉష్ణోగ్రతలను చూసి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటివారం పోలండ్‌లో 18.9, స్పెయిన్‌లో 25.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రత మామూలుగా వేసవిలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మనకు ఈ ఉష్ణోగ్రతలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేనివి. కానీ తెల్లవారికి బ్రహ్మప్రళయంగా ఉంటుంది. నెదర్లాండ్స్‌, లిథువేనియా, లాత్వియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, బెలారస్‌ల్లోనూ ఉష్ణోగ్రత వందేళ్లలో ఎన్నడూ ఈ సమయంలో ఇంత ఎక్కువగా నమోదు కాలేదంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌, ఉక్రెయిన్‌లలోనూ ఇదే పరిస్థితి. అదే ఇప్పుడు అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు.

మళ్లీ ఓ కొత్త పేరు వింటున్నట్టుగా లేదూ.. ఇంతకీ ఏమిటీ హీట్‌డోమ్‌?

పోలండ్‌లోని వార్సాలో గత నెల కంటే 4 డిగ్రీలు ఎక్కువ నమోదు కాగా, స్పెయిన్‌లో ఎండాకాలాన్ని తలపిస్తోంది. స్కీయింగ్‌ పండగకు నెలవైన స్విట్జర్లాండ్‌లో 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పర్యాటకులకు నిరుత్సాహం కలిగిస్తోంది. 2023లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండబోతాయనటానికి ఇది పక్కా నిదర్శనమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగని ఐరోపా అంతటా ఇలాంటి పరిస్థితి లేదు. రష్యా వైపు మాత్రం ఈ వారాంతంలో మైనస్‌కు చేరే అవకాశం ఉంది. హీట్‌డోమ్‌ కారణంగానే ఈ అసాధారణ మార్పులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే..గిన్నె మూతపై వేడి ఆవిరి పేరుకున్నట్లుగా.. ఏదైనా ప్రాంత వాతావరణ ఉపరితలంలో అధిక పీడనం వల్ల వేడిగాలి పేరుకుపోవటాన్నే హీట్‌డోమ్‌ అని అంటారు.

రెండేళ్ల క్రితం అంటే..2021లో కెనడా, అమెరికాల్లో ఈ హీట్‌డోమ్‌ కారణంగా విపరీతమైన వేడిగాలులు వీచి.. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకొని చాలామంది మరణించారు. నిజానికి యూరప వాసులు అనేక విషయాలలో బలహీనులేనని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు కాస్త ఎక్కువ వేడిని భరించలేరు..వైరస్ వేరియంట్లను కూడా ఎదుర్కోలేని ఇమ్యూనిటీ పవర్ ని కలగి ఉంటారు. వారంతా కోళ్ల ఫారమ్ లో పెరిగే బ్రాయిలర్ కోళ్ల లాంటి వారని చెబుతున్నారు విశ్లేషకులు. ఏ మాత్రం కాస్త అసహజత్వాన్ని వారు భరించలేరు. ఆసియా ఆఫ్రికా లాంటి ప్రాంతాల ప్రజలలో ఇది కనిపించకపోవడం విచిత్రం. అక్కడ అన్నింటినీ తట్టుకునే శారీరిక బలాన్ని కలిగి ఉంటారు. సూపర్ ఇమ్యూనిటీ కలిగి ఉంటారు.

Must Read

spot_img