Homeఅంతర్జాతీయంప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం

ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం

ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణం మొదలైంది.. ద స్క్వేర్కిలోమీటర్ అర్రే అని పిలిచే ఈ రేడియో టెలిస్కోప్ 2028 నాటికి పూర్తవుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అయిన ద స్క్వేర్ కిలోమీటర్ అర్రే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది..? ఖగోళశాస్త్రం ఇప్పటి వరకు విప్పలేని అంతరిక్ష రహస్యాలను దీని ద్వారా కనుగొనడం సాధ్యమేనా…? ఇతర గ్రహాల మీద జీవం గురించి అన్వేషించగలమా..?

ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ నిర్మాణం మొదలైంది.ద స్క్వేర్ కిలోమీటర్ అర్రే అని పిలిచే ఈ రేడియో టెలిస్కోప్ 2028 నాటికి పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు సుమారు రూ.17వేల కోట్లు అవుతుందని అంచనా.

బ్రిటన్ ప్రధాన కార్యాలయంగా ఉండే ఈ టెలిస్కోప్ దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉంటుంది. ఖగోళశాస్త్రం ఇప్పటి వరకు విప్పలేని అంతరిక్ష రహస్యాలను దీని ద్వారా కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను పరీక్షించడంతో పాటు ఇతర గ్రహాల మీద జీవం గురించి కూడా దీని ద్వారా అన్వేషించనున్నారు. ఇతర గ్రహాల మీద జీవాలు ఉండి, అవి సంకేతాలను పంపితే వాటిని కూడా ఇది గుర్తించే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో జరిగిన ద స్క్వేర్ కిలోమీటర్ అర్రే టెలిస్కోప్ ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమాల్లో ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ఇది 30ఏళ్ల ప్రయాణం. భిన్న ఆలోచనల మీద చర్చించి ఒక కాన్సెప్ట్ తయారు చేయడానికి తొలి 10ఏళ్లు పట్టింది. దానికి కావాల్సిన టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు మరొక 10ఏళ్లు తీసుకుంది. ఇక చివరి 10ఏళ్లలో డిజైన్స్ తయారు చేయడం, ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రదేశాలను గుర్తించడం, ఒప్పందం మీద ఆయా దేశాల ప్రభుత్వాల అంగీకారం తీసుకోవడం, నిధుల సమీకరణ వంటివి జరిగాయి’ అని ఎస్‌కేఏ డైరెక్టర్ జనరల్ ప్రొ.ఫిల్డైమండ్ తెలిపారు.

మొదట సుమారు 200 పారాబోలిక్ యాంటెనాలు, 131,000 డైపోల్ యాంటెనాలతో ఈ అతిపెద్ద టెలిస్కోప్ ప్రారంభమవుతుంది. కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ టెలిస్కోపు విస్తరించి ఉండటం వల్ల అంతరిక్షంలో మరింత లోతుగా పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది.

దీని ఫ్రీక్వెన్సీ సుమారు 50 మెగా హెర్ట్జ్ నుంచి 25 గిగా హెర్జ్ట్ మధ్య ఉంటుంది. తద్వారా భూమి నుంచి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు వంటి వాటి నుంచి వచ్చే అతి చిన్న రేడియో సంకేతాలను సైతం ఈ టెలిస్కోప్ పసిగట్ట గలుగుతుంది.

బిగ్ బ్యాంగ్ అంటే మహావిస్ఫోటనం జరిగిన తరువాత తొలి వంద మిలియన్ సంవత్సరాలలో విడుదలైన సంకేతాలను సైతం ఇది గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈవిశ్వంలో అత్యంత విస్తారంగా లభించే హైడ్రోజన్మూలాలను కనుగొనేందుకు ఎస్‌కేఏ ద్వారా ప్రయత్నించనున్నారు.అంతేకాదు.. దుమ్ము, వాయువులతో కూడిన అతి పెద్ద మేఘాలు నక్షత్రాలుగా మారక ముందు కూడా హైడ్రోజన్ జాడ కోసం ఈ ఎస్‌కేఏ టెలిస్కోప్ వెతకనుంది.

‘ఖగోళ శాస్త్రానికి అనేక విధాలుగా
ఎస్‌కేఏ సాయం చేయనుంది. ఫాస్ట్ రేడియో బరస్ట్స్‌ను ఇది గుర్తించగలదు. సూర్యుని నుంచి ఏడాది మొత్తంలో విడుదలయ్యే శక్తిని ఈ ఫాస్ట్ రేడియో బరస్ట్స్ మిల్లీ సెకన్లలోనే విడుదల చేస్తున్నాయి. కానీ ఆ శక్తి
ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఇంత వరకు తెలియదు. అదొక ప్రశ్నలా మిగిలింది. దీనికి ఎస్‌కేఏ సమాధానం ఇవ్వగలదని ఆశిస్తున్నారు’ శాస్త్రవేత్తలు…

ఇప్పటికే ఖగోళ పరిశోధనలు జరుగుతున్న ప్రాంతాలను కలుపుతూనే ఈ భారీ టెలిస్కోప్‌ను నిర్మిస్తున్నారు. ఈ అతి పెద్ద ప్రాజెక్ట్ కోసం ఉన్న రేడియో అబ్జర్వేటరీ కేంద్రాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని చోట్ల భూముల కోసం ఆదివాసీలతోనూ ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియాలో నాలుగు యాంటెనాలు, దక్షిణాఫ్రికాలో ఆరు యాంటెనాలు 2024 నుంచి విరామం లేకుండా పని చేయనున్నాయి. ఆ తరువాత విడతల వారీగా మిగతా యాంటెనాలుకూడా అందుబాటులోకి వస్తాయి.

2028 నాటికి 5లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పూర్తి స్థాయి టెలిస్కోప్ పూర్తవుతుంది. కానీ ఇది ఇంతటితో ఆగకపోవచ్చు. దీన్ని ఇలాగే విస్తరిస్తూ 10లక్షల చదరపు మీటర్లు లేదా కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. కానీ మరిన్ని దేశాలు ఈ నెట్‌వర్క్‌లో చేరడంతో పాటు నిధులు సమకూర్చితేనే ఇది సాధ్యమవుతుంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ ఈ అబ్జర్వేటరీలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ఇందులో చేరుతున్నాయి. భారత్, కెనడా, స్వీడెన్, దక్షిణకొరియా, జపాన్ తమ ఆసక్తిని తెలియజేశాయి.

ఖగోళ శాస్త్రం ఇప్పటి వరకు విప్పలేని అంతరిక్ష రహస్యాలను కనుగోనేందుకు ద స్క్వేర్ కిలోమీటర్ అర్రే అని పిలిచే ఈ రేడియో టెలిస్కోప్ నిర్మాణం చేపట్టారు.. బ్రిటన్ ప్రధాన కార్యాలయంగా ఉండే ఈ టెలిస్కోప్ దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉండనుంది.. అతిపెద్ద టెలిస్కోప్ తో శాస్త్రవేత్తలు అంతరిక్ష రహస్యాలను ఛేదించాలని భావిస్తున్నారు..

Must Read

spot_img