Homeజాతీయంప్రపంచదేశాల రక్షణ వ్యయం ప్రతి ఏటా భారీగా పెరుగుతోందా ?

ప్రపంచదేశాల రక్షణ వ్యయం ప్రతి ఏటా భారీగా పెరుగుతోందా ?

  • ప్రపంచదేశాలు ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని భారీగా సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో మిలిటరీ దేశాల ఖర్చు నానాటికీ పెరిగిపోతోందా..?
  • మిలటరీ వ్యయం భారీగా పెరగడానికి ఇతర దేశాలతో ప్రమాదం పొంచి ఉండటమేనా..?

ఆధునిక యుగంలోనూ రక్షణ కోసం ఆయా దేశాలు ఖర్చు చేస్తున్న వ్యయం ప్రతి యేటా పెరుగుతూ పోతుంది. ఆయుధ సంపత్తిని.. సైన్యాన్ని సమకూర్చుకునేందుకు అన్ని దేశాలు ఆసక్తి చూపుతుండటంతో ఆ మేరకు మిలిటరీ ఖర్చు సైతం నానాటికీ పెరిగిపోతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది ఇరు దేశాలకు నష్టమే తప్ప లాభం చేకూరదని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ స్వీయ రక్షణలో భాగంగా అన్ని దేశాలు మిలిటరీ కోసం యేటా వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నాయి.

ప్రపంచంలో స్వీయ రక్షణ కోసం వివిధ దేశాలు చేస్తున్న వ్యయం ప్రతి ఏటా పెరుగుతోంది. ఆధునిక యుగంలోనూ మిలటరీ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్‌ 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని స్వీడన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నివేదిక వెల్లడించింది.1949 నుంచి వివిధ దేశాల మిలటరీ బడ్జెట్లను విశ్లేషిస్తూ ఈ సంస్థ ఏటా నివేదికలు వెలువరిస్తోంది. మిలటరీ వ్యయం అంటే కేవలం సైన్యాన్ని పోషించడం,మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు.. పరిశోధన – అభివృద్ధి వ్యయం కూడా భాగమే.

ప్రపంచ మిలటరీ బడ్జెట్‌ గత ఏడేళ్లుగా పెరుగుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో అమెరికా వాటా దాదాపు 38 శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం 80 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 29.3 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసిన చైనా రెండో స్థానంలోనిలిచింది. ప్రపంచ దేశాల మొత్తం మిలటరీ వ్యయంలో చైనా వాటా దాదాపు 14 శాతం. అలాగే, అమెరికా, చైనా దేశాల మిలటరీ వ్యయం.. మొత్తం ప్రపంచ దేశాల మిలటరీ వ్యయం కంటే కాస్త ఎక్కువే. మిలటరీ బడ్జెన్‌ను గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెంచుతున్న దేశం చైనా.2012లో చేసిన వ్యయంతో పోలిస్తే… 2021లో పెట్టిన ఖర్చు రెట్టింపు అయింది. గత 27 ఏళ్లుగా చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది.

అమెరికా ఒక్క దేశం చేస్తున్న రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే.. టాప్‌-10 దేశాల జాబితాలోని మిగతా 9 దేశాల మొత్తం మిలటరీ వ్యయం కంటే ఈ దేశానిదిఎక్కువే. అలాగే.. సౌదీ అరేబియా తన మొత్తం జీడీపీలో 6.6 శాతం ఖర్చు చేస్తోంది. రష్యా 4.1 శాతం వ్యయం చేస్తోంది.ఇక 7.66 వేల కోట్ల డాలర్ల వ్యయంతో భారత దేశం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ మిలటరీ వ్యయంలో భారత్‌ మిలటరీ వ్యయం 3.6 శాతం. తర్వాత స్థానంలో ఉన్న యూకే 3.2 శాతం వాటాతో 6.84 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసింది 5వ స్థానం రష్యాది.

ఈ దేశం 3.1 శాతం వాటాతో 6.59 వేల కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చు చేసింది.ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌ 2.7 శాతం వాటాతో… 5.66 వేల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. ఏడో స్థానంలో ఉన్న జర్మనీ కూడా దాదాపు ఫ్రాన్స్‌తో సమానంగా ఖర్చు చేసింది. 8వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియావెచ్చించింది 5.56 వేల కోట్ల డాలర్లు అంటే2.6 శాతం.9వ స్థానంలో 5.4 వేల కోట్లడాలర్ల వ్యయంతో జపాన్‌ ఉంది.ఇక పదో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 5.02 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి ప్రపంచ మిలటరీ వ్యయంలో 2.4 శాతం వాటా దక్కించుకుంది.

ఈ 10 దేశాలు మినహా ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు కలిపినా 53.6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో వాటి వాటా 25.3 శాతం మాత్రమే.ఆధునిక యుగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, సైన్యాన్ని పెంచుకోవడమే ఆధునిక యుద్ధ తంత్రం కాదని అగ్రదేశాలు పలుమార్లు నిరూపించాయి. ఆంక్షలు విధించడం, ఎగుమతులు – దిగుమతులను నియంత్రించడం, అధిక పన్నులు విధించడం, సరఫరాలు నిలిపివేయడం.. చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ మీద రష్యా దండెత్తినప్పుడు.. రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.. . రష్యా నుంచి చమురు కొనవద్దని ఇతర దేశాలతో పాటు భారత దేశం మీద కూడా ఒత్తిళ్లు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ తర్వాత అన్ని దేశాలు ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధాలు.. డ్రోన్ టెక్నాలజీపై..యాంటీ మిస్సైల్ రాకెట్ల లాంఛింగ్ వంటి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇక దేశ భద్రతలో సైబర్‌ సెక్యూరిటీ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. మిలటరీ కంప్యూటర్‌ వ్యవస్థల భద్రతకు అన్ని దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి.

ప్రపంచ జీడీపీలో రక్షణ వ్యయం 2.2%. 2021లో అత్యధికంగా ఖర్చు చేసిన ఐదు దేశాలు యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, కలిసి ఖర్చులో 62 శాతం వాటాను కలిగి ఉన్నాయని స్టాక్‌హోమ్ ఆధారిత ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి యొక్క ఆర్థిక పతనం ఉన్నప్పటికీ, ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలను తాకినట్లు వెల్లడించింది.. ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవిక వృద్ధి రేటులో మందగమనం ఉంది. నామమాత్రంగా అయితే సైనిక వ్యయం 6.1 శాతం పెరిగింది.

భారతదేశం యొక్క సైనిక వ్యయం $76.6 బిలియన్లు ప్రపంచంలో మూడవ అత్యధిక స్థానంలో ఉంది. ఇది 2020 నుండి 0.9 శాతం.. 2012 నుండి 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్‌లో 64 శాతం మూలధన వ్యయాలను దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించినట్లు తెలిపింది.

ప్రపంచంలోని అనేక దేశాలు మిలిటరీ, ఆయుధ సంపత్తి కోసం ప్రతి ఏటా భారీగా ఖర్చు చేస్తున్నాయి.. ప్రత్యర్థి దేశాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు అత్మంత బలమైన సైన్యం తయారు చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే ప్రపంచ జీడీపీలో రక్షణ వ్యయం రోజురోజుకు పెరుగుతూ పోతోంది..

Must Read

spot_img