Homeఅంతర్జాతీయంయుద్ధ విమానాలతో తైవాన్ చుట్టూ చైనా దుందుడుకు చర్యలు

యుద్ధ విమానాలతో తైవాన్ చుట్టూ చైనా దుందుడుకు చర్యలు

ఎవరి నుంచైతే కాపాడుకోవాలని తైవాన్ అనుకుందో వారి చేతికే తమ ఆయుధాల సీక్రెట్ చేరిపోవడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు అధికారులు. చైనా నుంచి రాబోయే ముప్పును అంచనా వేసుకుని తనను తాను రక్షంచుకునేందుకు సరికొత్త ఆయుధాలు సేకరిస్తోంది తైవాన్. అంతే కానీ చైనా అడుగులకు మడుగులొత్తలేమని అంటున్నారు తైవాన్. ఈ నేపథ్యంలో తెలియకుండా ఓ తప్పు చేసారు రక్షణశాఖ అధికారులు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఒక్క పొరబాటుతో తైవాన్‌ ఆయుధ సీక్రెట్‌ చైనా చేతికి చిక్కిపోయింది. నిజానికి దొంగను ఇంటికి కాపలా పెడితే ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితే తైవాన్‌ కు ఎదురైంది. ఆ దేశానికి ప్రధాన ముప్పు చైనా నుంచే రానుంది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ను ఎదుర్కోవడానికి అనేక రకాలైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ముఖ్యంగా సముద్రాన్ని దాటి చైనా సేనలు తైవాన్‌ను చేరకుండా అడ్డుకొనేందుకు అత్యాధునిక యాంటీషిప్‌ మిసైళ్లను అభివృద్ధి చేసుకొంది. వీటిల్లో ఐరోపా దేశాలకు చెందిన విడిభాగాలను వాడింది. ఇదే తైవాన్‌ చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు దాని యాంటీ షిప్‌ మిసైల్‌ వ్యవస్థే ప్రమాదంలో పడింది. చైనా ఇటీవల కాలంలో భారీ నౌకాదళాన్ని సిద్ధం చేస్తోంది.

తైవాన్‌ ఆక్రమించుకొనేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఇది కూడా ఒకటనే అనుమానాలు ఉన్నాయి. ఇది గ్రహించిన తైవాన్‌ దీనికి విరుగుడుగా సియాంగ్‌ ఫెంగ్‌-3 అనే నౌకా విధ్వంసక క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకొంది. నేషనల్‌ ఛుంగ్‌ షాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ దీని తయారీలో కీలకపాత్ర పోషించింది. ‘క్యారియర్‌ కిల్లర్‌’గా ఇది పేరు తెచ్చుకొంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై 225 కిలోల వార్‌హెడ్‌ను ఇది ప్రయోగించగలదు. ఇప్పడు దీనికి సంబంధించిన రహస్యాలే చైనా బారిన పడ్డట్టు తైవాన్ భయపడుతోంది. ఈ క్షిపణిలో స్విట్జర్లాండ్‌కు చెందిన లైకా జియోసిస్టమ్స్‌ తయారుచేసిన థియోడోలైట్‌ అనే పరికరాన్ని వాడారు. ఇది క్షిపణి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

అయితే 2021లో వీటిల్లో ఏదో సమస్య ఉన్నట్లు తైవాన్‌ అధికారులు గుర్తించారు. వెంటనే వీటిని స్విట్జర్లాండ్‌లోని తయారీ సంస్థకు పంపారు. 2022 ఫిబ్రవరిలో ఈ భాగాలు మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి తైవాన్‌ చేతికి వచ్చాయి. అదే ఏడాది సెప్టెంబర్‌లో లైకా నుంచి డిక్లరేషన్‌ ఇతర పత్రాలు కూడా వచ్చాయి. వాటిని చూశాక తైవాన్‌ గుండె ఝల్లుమంది. ఈ విడిభాగాలు చైనాలోని షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని క్వింగ్‌డావ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లైకా ఆసియా సర్వీసింగ్‌ విభాగం చైనాలో ఉంది. దీంతో అక్కడకు పంపినట్లు భావిస్తున్నారు. దీంతో సియాంగ్‌ ఫెంగ్‌-3 క్షిపణి రహస్యాలు చైనా చేతికి చిక్కినట్లు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఈ విడిభాగాలు స్విట్జర్లాండ్‌ నుంచి మరమ్మతుల కోసం చైనాకు పంపినట్లు తేలింది.

అక్కడ చైనా సైనికాధికారులు దీనిని పరిశీలించినట్లు భావిస్తున్నారు. నిజానికి శత్రుదేశం యుధ్ద విమానాలు క్షిపణులను తమ భూభాగంలో కూలిపోతే చైనా రాబందులా దిగిపోతుంది. సదరు అవశేషాలను సేకరిస్తుంది. దానిని రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలతో తనకోసం క్షిపణిని తయారుచేసుకుంటుంది. దానికి చైనా పేరేదైనా పెట్టి వాటిని ప్రపంచదేశాలకు అమ్మజూపుతుంది. గతేడాది అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఆ తర్వాత తైవాన్‌ చుట్టూ చైనా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఇటీవల కాలంలో తరచూ తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చైనా విమానాలు వెళుతున్నాయి. అలాంటి సమయంలో తమ యాంటీషిప్‌ మిసైల్‌ వ్యవస్థ పరికరాలు మరమ్మతుల కోసం చైనా చేతిలోకి వెళ్లడం తైవాన్‌ను షాక్‌కు గురిచేసింది.

ఎవరి చేతుల్లో పడకూడదో అలాంటి వారి చేతిలోకి చేరిపోయాక చైనావాళ్లు ఊరుకుంటారా..? వెంటనే దానికి కాపీ ఐటమ్ తయారవుతుంది. అది కూడా చాలా వేగంగా ఆ పని పూర్తవుతుంది. రంగులు మార్చి చిన్న దేశాలకు అందజేస్తుంది. దానికి బదులుగా ఆయా దేశాలలో తమకు అవసరమైన స్థలం గురించిపాకిస్తాన్ తో దొంగస్నేహం కూడా నటించింది. ఇన్న జరుగుతున్నా చైనా ఇప్పటి వరకు చిన్న పాటి ప్రకటన కూడా చేయలేదు. అంటే తైవాన్ మోడల్ ను ఇప్పుడు రష్యా తనదైన స్లైల్ లో మార్చుకుని వాటిని అమ్మడం ద్వారా డాలర్లు సంపాదించుకుంటుంది. ఇది ఇప్పుడే కాదు. దశాబ్దాలుగా సాగుతోంది. మరీ షీ జింపింగ్ అద్యక్షుడయ్యాక ఈ దోరణి మరింత పెరిగింది. స్వదేశంలో కరోనా విజ్రుంభన గురించిన విషయాన్న పక్కదారి పట్టించేందుకు ఇలా యుధ్ద విన్యాసాలు చేయడం మామూలయిపోయింది.

Must Read

spot_img