చైనాలో కోవిడ్ ఆంక్షలు సడలించడంతో అటు హాంగ్ కాంగ్ చైనా బార్డర్ తెరచుకుంది.దాంతో ఇరు ప్రాంతాల జనం తమ తమ బంధువులను కలుసుకుంటున్నారు. గత రెండేళ్లుగా దూరమైన తమ వారిని చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు. సరిహద్దుకు చేరుకున్న జనంలో ఆనందోత్సహాలు కనిపిస్తున్నాయి. అయితే హాంగ్ కాంగ్ వచ్చేవారు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాలని షరతు పెడుతున్నారు అధికారులు.
రెండేళ్ల తరువాత హాంకాంగ్-చైనా సరిహద్దు తెరుచుకున్నాయి ..రెండు వైపులా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. క్రాసింగ్ పాయింట్లలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు చూపి వెళ్లాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజల్లో ఆనంద వాతావరణం కనిపించింది. అయితే, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని మాత్రం నిబంధన విధించింది.
ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్బంధం తప్పనిసరి అనే నిబంధనను కూడా చైనా రద్దు చేసింది. రెండేండ్లుగా భార్యను కలుసుకోని హాంకాంగ్ నివాసి చియుంగ్ సెంగ్ బన్ .. ఆదివారం సరిహద్దు తెరవడంతో క్రాసింగ్ పాయింట్‌ను దాటిన తొలి వ్యక్తిగా నిలిచారు. తన భార్యను కలవాలన్న ఆతృతలో ఉన్నానని ఆయన మీడియాతో చెప్పారు.
హాంకాంగ్ వెళ్లేందుకు చైనా వైపు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రాసింగ్ పాయింట్‌కు చేరుకున్నారు. చాలా కాలంగా సరిహద్దును మూసి ఉంచడంతో చైనా నుంచి హాంకాంగ్ వెళ్లడం చాలా మందికి దుర్లభంగా మారింది. ఆదివారం ఈ సరిహద్దును తెరుస్తున్నట్లు ప్రభుత్వం రెండు రోజుల క్రితమై ప్రకటించింది. దీంతో హాంకాంగ్ వెళ్లాలనుకునే వారు ఒకేసారి క్రాసింగ్ పాయింట్‌కు వచ్చారు.
కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా చైనాలో కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతుండటంతో లాక్‌డౌన్‌ను పలు ప్రాంతాల్లో ఎత్తివేశారు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చేవారికి విధించిన నిర్బంధం తప్పనిసరి నిబంధనను చైనా ఎత్తివేసింది.
అలాగే, హాంకాంగ్ సరిహద్దును తెరిచింది. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తరలివచ్చారు. చైనాలోని ప్రధాన నగరాల్లో మాత్రం కరోనా కేసులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. త్వరలో చైనాలో లూనార్ న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశాలు ఉండటంతో కొవిడ్ మరింత వ్యాపించే అవకాశాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కంటే చైనాకు వచ్చే అంతర్జాతీయ విమానాలు తగ్గిపోయాయి. బీజింగ్‌లోని ప్రధాన విమానాశ్రయం గత మూడేండ్లుగా మూతపడి ఉన్నది. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకకు అనుమతిస్తే మరింతగా కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
- విదేశాల నుంచి వచ్చే వాళ్లకు చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేసింది.
ఆదివారం నుంచి ఈ కొత్త నిబంధన అమలవుతోంది. మూడేళ్ల తర్వాత చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం విశేషం. విదేశీ ప్రయాణికులు, చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లు ఇకపై ఎవరూ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా క్వారంటైన్ నిబంధన పాటించాల్సి ఉండేది.
వ్యాక్సిన్లు తీసుకుని ఉండాలి. ఇప్పుడు మాత్ర ఇలాంటివేవీ చైనా పాటించడం లేదు. ప్రస్తుతం చైనా వచ్చే ప్రయాణికులు 48 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఉంటే సరిపోతుంది. అయితే, ఒకపక్క దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న టైంలో చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం మరో విశేషం. చైనాలో పూర్తి స్థాయి కోవిడ్ రూల్స్‌ను ఆ దేశం ఎత్తివేసింది. దీంతో ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించడం మానేశారు.
ఫలితంగా దేశంలో కోవిడ్ కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోంది. కోవిడ్ పేరుతో గతంలో చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచేది. ఇప్పుడు అలాంటి వాళ్లందరినీ స్వేచ్ఛగా వదిలేసింది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.