HomePoliticsఏపీలో పసుపుజెండాలు..జగన్ షాక్..?

ఏపీలో పసుపుజెండాలు..జగన్ షాక్..?

బాబు పర్యటన వేళ .. ఇదే హాట్ టాపిక్ గా మారిందా..?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించనుందా అంటే తెలుగుదేశం శ్రేణులు సహజంగానే ఔనని అంటాయి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న జన సందోహాన్ని చూసి పరిశీలకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలోనైనా, గత రెండు రోజులుగా గోదావరి జిల్లాలలోn పర్యటనకైనా జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారేమీ తరలిస్తే వచ్చిన జనం కాదు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ కంటే ఐదారు గంటలు ఆలస్యమైనా జనం ఓపికగా వేచి చూస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. వైసీపీపై ఆయన విమర్శలకు చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారు.

గతంలో అంటే తన హయాంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ఔను నిజమే అని ఆమోదం తెలుపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వాతావరణమే పరిశీలకులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం తధ్యమన్నఅంచనాకు వచ్చేలా చేశాయి. అన్నిటికీ మించి గోదావరి జిల్లాల దీవెన ఏ పార్టీకి లభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే గోదావరి జిల్లాలలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడమే కారణం.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సైకిల్ గాలి వీస్తోందా..?

ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ స్థానాలలో విజయం సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నది ఇప్పటి వరకూ రుజువౌతూ వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి వస్తుండటంతో వైసీపీలో కలవరం కనిపిస్తోంది. జనం చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూడటమే ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఎత్తి చూపుతోంది. ఈ పరిస్థితి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తు పొడుపులపై జరిగిన చర్చ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది.

జనం తెలుగుదేశం అధినేత బాబు పర్యటనలకు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే.. రాష్ట్రం పురోగమించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అన్న నిర్ణయానికి వారు వచ్చేశారా అనిపించక మానదు. తెలుగుదేశంలో కూడా అదే ధీమా కనిపిస్తోంది. పొత్తులతో సంబంధం లేకుండానే అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో విజయం ఖాయమన్న భావన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనం నీరాజనాలు పలుకుతుండటంతో తిరుగులేదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 2019 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు పెట్టని కోటగా ఉండేవి. అయితే 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ పై చేయి సాధించింది.

బాబు పర్యటన ఆద్యంతం జనం వెల్లువలా తరలివస్తున్నారా..?

ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 29 స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం కేవలం ఐదు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబూ అంటూ జనం బాధపడేలా చేశారని అంటున్నారు.

ఈ పరిస్థితి ఒక్క గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రమంతటా ఉందని కూడా చెబుతున్నారు. ఆఖరికి రాయలసీమలో కూడా ఈ సారి అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెబుతున్నారు. పరిశీలకులు సైతం ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న వ్యతిరేకత రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్ల సునామీగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రంగంలో జనసేన వంటి పార్టీలు ఉన్నా..ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబే గట్టెక్కించగలరని ప్రజలు భావిస్తున్నారని రాజకీయవర్గాలలో సైతం చర్చనడుస్తోంది.

ఇక్క‌డ త‌న హ‌వా ఎలా ఉంది? పార్టీ ప‌రిస్థితి ఏంటి? ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం ఎలా ఉంది.. అనే కీల‌క అంశాల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అస‌లు చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని ఒక‌వైపు అధికార పార్టీ ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు అనూహ్యంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం నిజంగానే ఆనందం క‌లిగిస్తోంది. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. అయితే, కేవ‌లం కార్య‌క్ర‌మం ప్రారంభించేందుకు మాత్ర‌మే ఆయ‌న ప‌ర్య‌ట‌న చేయ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. త‌మ్ముళ్ల మ‌ధ్య విభేదాలు.. ఎవ‌రు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎవ‌రు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు? అనే విష‌యాల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో క‌ర్నూలు హైలెట్‌గా నిలిచింది. నందిగామ‌, న‌ర‌సారావు పేట‌ల్లో త‌మ్ముళ్ల మ‌ధ్య వివాదాలు విభేదాలు క‌నిపించినా, క‌ర్నూలులో మాత్రం ఐక్య‌త క‌నిపించింది. ఈ నేప‌థ్యంలోనే ఉభ‌య గోదావరుల‌పై చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఈ రెండు జిల్లాలు కూడా టీడీపీకి కంచుకోట‌లు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా వీచినా.. ఈ రెండు జిల్లాల నుంచి నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా
వేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకమైన జిల్లాలుగా గోదావరి జిల్లాలను చెప్పుకుంటారు. అది ఒక సెంటిమెంట్ గా కూడా ఉంది. గోదావరి ప్రజలలో వచ్చే మార్పు ఏపీ అంతటా కనిపిస్తుంది అని అంటారు. అక్కడ జనం నాడి పట్టుకుంటే గెలుపు గుట్టు తెలుస్తుంది. అందుకే చంద్రబాబునాయుడు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు.

పర్యటన సందర్భంగా ఆయన తన సభలకు వచ్చే జనం విషయంలో ఆరా తీస్తున్నారు. వారి మనసులో ఏముంది అని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. అలాగే జనాలు తమ

Must Read

spot_img