Homeఅంతర్జాతీయంఐటీ రంగంలో మరో ట్రెండ్ రానుందా..?

ఐటీ రంగంలో మరో ట్రెండ్ రానుందా..?

  • గ్రేట్ రికగ్నైజైషన్, మూన్‌ లైటింగ్ తరహాలో .. క్వైట్ హైరింగ్ .. ప్రకంపనలు తీసుకురానుందా..?
  • ఇంతకీ ఇదేమిటి..? దీనివల్ల ఒనగూరే ప్రభావం ఏమిటి..?
  • ఇంతకీ ఏమిటీ విధానం..? దీనిగురించి ఐటీ కంపెనీలు ఏం చెబుతున్నాయి..?
  • అసలు .. ఈ విధానం ఎవరికి ప్రయోజనం అన్నది చర్చనీయాంశంగా మారింది..?
  • దీంతో ఈ ట్రెండ్ ఇప్పుడు .. మరో చర్చకు దారితీయనుందా..?

ఐటీ .. ఈ పేరు చెబితేనే, వణుకు వస్తుంది. దీనికి కారణం.. ఈ రంగంలో లేఆఫ్స్ పెడుతోన్న టెన్షన్ అటువంటిది.. అయితే ఇప్పుడు ఐటీలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి.. మూన్ లైటింగ్, గ్రేట్ రిజిగ్నైజేషన్, రేజ్ అప్లయింగ్ వంటి వాటి స్థానంలో కొత్తగా క్వైట్ హైరింగ్ .. వచ్చి చేరింది. ఈ కొత్త విధానం .. ఏమేరకు ప్లస్ అవుతుంది.. అన్నదే ఇప్పుడు .. సర్వత్రా చర్చోపచర్చలకు కారణమవుతోంది.. మరి ఈ విధానం ఎవరికి మేలు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కరోనా తర్వాత.. కార్పొరేట్ ప్రపంచంలో కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇది అందులో పనిచేసేవారికి ఒక పరిపాటిగా మారిపోయింది. క్వైట్ క్విట్టింగ్, గ్రేట్ రిసిగ్నిషన్, రేజ్ అప్లైయింగ్, మూన్‌లైటింగ్ ఇలా ఎన్నో చూశాం. ఇప్పుడు క్వైట్ హైరింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలీ ట్రెండ్ ఏంటి.. దీని వల్ల ఎవరికి ప్రయోజనం.. అసలు దీని సంగతి ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంపెనీలో అప్పటికే ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ను అత్యవసర విభాగాల్లో ఉపయోగించుకొని.. అంతగా ప్రొడక్టివిటీ లేని విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకోవడం.. Quiet Hiring గా నిపుణులు చెబుతున్నారు.

కంపెనీలు కొంత కాలంగా ఉద్యోగులను తొలగించుకుంటున్న క్రమంలో క్వైట్ హైరింగ్ అనేది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. క్వైట్ హైరింగ్ అంటే కొత్తవారిని నియమించుకోవడం మాత్రం కాదు. కంపెనీలోనే తమకు కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడమే ఈ క్వైట్ హైరింగ్. సంస్థలోనే ఇతర విభాగాల్లో పనిచేస్తున్నవారిని.. నైపుణ్యాలు గుర్తించి ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్ అన్నమాట. ఇక కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల కొరత ఉండటం, ఇక అదే సమయంలో టార్గెట్స్‌‌‌ను సమీపిస్తున్న సమయంలో క్వైట్ హైరింగ్ చాలా ఉపయోగపడుతుందని టెక్నికల్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ గార్ట్‌నర్ తెలిపింది. సంస్థలోనే ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించి.. ఆ ఉద్యోగాల కొరతను భర్తీ చేస్తున్నారు.

ఇంకా అదనంగా అవసరమైతే స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇలా కంపెనీలో అప్పటికే పనిచేస్తున్న వారికి తిరిగి నియమించుకోవడం.. అంత ఉత్పాదకత లేని డిపార్ట్‌మెంట్స్‌లో వారిని తగ్గించుకోవడం ద్వారా కంపెనీలు సమతుల్యతను సాధిస్తున్నాయి. ఉదాహరణకు .. యాన్యువల్ టార్గెట్స్‌ను అందుకోవడానికి కంపెనీకి మరో నలుగురు డేటా సైంటిస్ట్స్ అవసరం పడింది. ఇదే సమయంలో కొత్త వారిని నియమించేందుకు ఆ కంపెనీకి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అప్పుడు లక్ష్యాలను తొందరగా అందుకోలేం.

అప్పుడే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగులను వారి టాలెంట్‌ను గుర్తించి.. దానికి సరితూగగల వారిని ఆ స్థానాల్లో భర్తీ చేస్తారు. ఈ సరికొత్త ట్రెండ్ ఉద్యోగులకు కూడా ప్రయోజనకరమని చెబుతున్నారు నిపుణులు. కొత్త నైపుణ్యాలను తెలుసుకోవడం, సవాళ్లతో కూడిన పనితో టాలెంట్ నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశం అని అంటున్నారు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఐటీలో వినూత్నత ఉంటుంది. జీతాలు దండిగా ఉంటాయి. అదే స్థాయిలో ప్రమోషన్లు, బోనస్‌లు, డిమోషన్లు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ఐటీ ఉద్యోగం అనేది పాలపొంగు లాంటిది. ఇక ఇప్పుడు ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

2008 లో మహా మాంద్యం తాలుకుకు మించిన పరిస్థితులను చవి చూస్తోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌ బుక్‌, అడోబ్‌, ట్విట్టర్‌, ఆపిల్‌.. ఎంత తోపు తురుం
సంస్థలయితేనేం ఉద్యోగులను ఎహే పోండి అంటూ బయటకు పంపాయి. బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం రెండు లక్షల మంది దాకా ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, యూరో జోన్‌లో ఆర్థిక కష్టాల వల్ల ఐటీ ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది.

ఫలితంగా గ్రేట్‌ రెసిగ్నేషన్‌, క్వైట్‌ క్విట్టింగ్‌, మూన్‌ లైటింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌ తాజాగా క్వైట్‌ హైరింగ్‌.. ఇలా ఐటీ సమూల మార్పులకు లోనయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు క్వైట్‌ హైరింగ్‌ వైపు మళ్లుతున్నాయి. దీనివల్ల ఐటీ కంపెనీలపై ఒత్తిడి తగ్గుతోంది. ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల అవసరాలు ఒక పట్టాన అంతు పట్టవు. ఆ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను ఉపయోగించుకోవడమే క్వైట్‌ హైరింగ్‌ ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీకి డాటా బేస్‌లో ఉద్యోగుల అవసరం పడింది. అప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. ఈక్రమంలో మరో విభాగంలో ఉన్న ఉద్యోగులతో ఆ స్థానాలు భర్తీ చేస్తుంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. అక్కడ ఏర్పడిన ఖాళీలను మరో ఉద్యోగులతో భర్తీ చేస్తుంది.

  • కొత్త లక్ష్యాలను సాధించే క్రమంలో ఉద్యోగులకు ఆశించినంత వేతనాలు ఇస్తున్నాయి..

అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అనే సామెతను ఇప్పుడు ఐటీ కంపెనీలు పాటిస్తున్నాయి. అంతే కాదు కొత్త లక్ష్యాలను సాధించే క్రమంలో ఉద్యోగులకు ఆశించినంత వేతనాలు ఇస్తున్నాయి. మరోవైపు బోనస్‌లు కూడా ప్రకటిస్తున్నాయి. కార్పొరేట్ రంగంలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. కరోనా తరవాత ఈ మార్పుల వేగం పెరిగింది. గ్రేట్ రిజిగ్నేషన్‌తో మొదలై…క్వైట్ క్విట్టింగ్, మూన్‌ లైటింగ్ వరకూ వచ్చింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి టెక్ కంపెనీలు.

ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఈ ట్రెండ్‌కి మంచి డిమాండ్ ఉంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగిస్తున్న సంస్థలకు .. మ్యాన్‌ పవర్‌ను భర్తీ చేసుకునేందుకు ఈ క్వైట్ హైరింగ్ ట్రెండ్ పెద్ద సాయమే చేస్తోంది. ఫుల్ టైమ్‌ ఎంప్లాయ్‌లను నియమించుకోకుండానే, పని పూర్తి చేసేందుకు ఇది తోడ్పడుతోంది. ఈ కంపెనీ ప్రకారం…అత్యవసర సమయాల్లో ఈ క్వైట్ హైరింగ్ ప్రక్రియ టెక్ సంస్థలకు భారీ ఊరట కలిగిస్తోంది. ఉన్న మ్యాన్‌ పవర్‌తోనే అన్ని పనులూ సకాలంలో చక్కదిద్దుకునేలా సహకరిస్తోంది. క్వైట్ హైరింగ్ అంటే ఉన్న ఉద్యోగులతోనే అవసరమైన పనులు చేయించుకోవడం.

ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే…ఉదాహరణకు ఓ కంపెనీ ఈ ఏడాదిలో కొన్ని టార్గెట్‌లు పెట్టుకుంది అనుకుందాం. అయితే..ఆ టార్గెట్‌ను రీచ్ కావాలంటే అదనంగా ఐదుగురు ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లను రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఆ పని పూర్తి చేసే సరికి సమయం అంతా వృథా అవుతుంది. అలా కాకుండా వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులను ఇప్పుడు రీసోర్సెస్ అవసరమున్న డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తే ఆ పని సులువుగా పూర్తి చేసుకోవచ్చు. 5గురు డేటా సైంటిస్ట్‌లు అవసరం అనుకుంటే…డేటా అనలిస్ట్‌ల విభాగంలో నుంచి ఐదుగురు ఉద్యోగులను డేటా సైంటిస్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి పంపుతారు. పని పూర్తి చేస్తారు. ఇదంతా చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది.

ఇది వినటానికి బాగానే ఉంది కానీ డిపార్ట్‌మెంట్‌లు మారిపోతే వాళ్లు మాత్రం ఎలా పని చేయగలరు అనే సందేహం రావచ్చు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటే చాలని అనుకుంటున్నారు చాలా మంది. అందుకే సవాళ్లు స్వీకరించేందుకు ముందుకొస్తున్నారు. స్కిల్స్‌ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీలు తెలుసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ల కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చేవే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కొద్ది రోజులు కష్టపడితే తప్పేముంది..? అనుకుంటున్నారు చాలా మంది ఉద్యోగులు. మారు మాట్లాడకుండా పని చేసేస్తున్నారు.

అలా అని కంపెనీలు ఒత్తిడి పెంచితే అసలుకే మోసం వస్తుంది. అందుకే కంపెనీలు ఇలాంటి సవాళ్లు స్వీకరించి పని చేసే వాళ్లకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వన్ టైమ్ బోనస్,అదనపు వీకాఫ్‌లు, పని గంటల్లో ఫ్లెక్సిబిలిటీ లాంటివి ఇస్తే వాళ్లు ఉత్సాహంగా పని చేస్తారని చెబుతున్నారు. నిజానికి 2022లోనే గూగుల్‌ ఈ క్వైట్ హైరింగ్ ట్రెండ్‌ను ఫాలో అయింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఇలా ఉద్యోగుల తొలగింపుతో ఐటీ కంపెనీల్లో కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత ఏర్పడుతోంది.

కొత్త ఉద్యోగులను నియమించుకోకుండానే, ఉన్న వారితోనే కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారికి కనిపెట్టి అవసరం ఉన్న చోట ఉపయోగించుకోవడమే క్వైట్‌ హైరింగ్‌ విధానం. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌. చాలా కంపెనీలు ఈ విధానంలో అప్పటికే ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు అవసరమైన చోట ఉపయోగించుకుంటున్నారు. అంతగా డిమాండ్‌ లేని చోట ఉద్యోగులకు కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. ఈ కొత్త విధానం ఉద్యోగులకు కూడా కొంతమెర ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. సవాళ్లతో కూడిన పనిలో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

ఉద్యోగి అభిప్రాయం ప్రకారం .. దీనివల్ల నైపుణ్యం ఉన్నవారికి లేఆఫ్‌ ఉండదని, దీంతో భవిష్యత్ కు డోకా లేదని తెలుస్తోంది. కానీ ఇదంతా ఐటీ కంపెనీలకు మేలైన విధానంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img