దీనికి డిగ్గీ రాజా ఏమేరకు సక్సెస్ కాగలరన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి పదవుల పందేరాలే కారణమన్నది విశ్లేషకుల వాదన .. మరి ఏం జరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.
130 ఏళ్ల చరిత్ర కలిగిన పాతీ తమదని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఆ పార్టీని చిలువలు పలువలుగా చీల్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమైన పార్టీని కలిసికట్టుగా అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు.. గాడిన పెట్టే ప్రయత్నం చేయకపోగా.. ముక్కలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిని గుర్తించిన అధిష్టానం సర్దుబాటు చర్యలకు దిగింది.
![](https://inewslive.net/wp-content/uploads/2022/12/congress-684x1024.jpg)
లడ్డూ కావాలనా నాయనా అన్నట్లుగా కట్టి తుడుపు బుజ్జగింపులు మొదలు పెట్టింది. దేశాన్ని ఐక్యం చేస్తామంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఒకవైపు భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తుంటే.. తెలంగాణ సీనియర్ లీడర్లు మాత్రం.. పార్టీలో ఎంతమేరకు ఐనైక్యత సృష్టిద్దామా అని చూస్తున్నారు.
పీసీసీ కమిటీల నియామకంతో పుట్టిన ముసలంతో రంగంలోకి దిగిన సీనియర్లు సేవ్ కాంగ్రెస్ నినాదంతో పార్టీని చీల్చే ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపారు. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తోంది.
అందర్నీ కూల్ చేసేందుకు దిగ్విజయ్ సింగ్ త్వరలో తెలంగాణకు వసస్తారని తెలిపింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. అందుకే మంగళవారం నిర్వహించాలనుకున్న సభను వాయిదా వేశామని నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది.
తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ సీరియస్‌గా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిగ్విజయ్‌సింగ్.. సీనియర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయనున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు కొనసాగుతోంది.
అయితే తాజాగా ఒక్కక్కరుగా కాకుండా.. అందరు సీనియర్లు ఒకేసారి తెరపైకి వచ్చారు. వీరంతా వ్యూహాత్మకంగా ఓ పార్టీతో మాట్లాడుకుని ఇలా రచ్చ
చేస్తున్నరని.. వీరంతా కోవర్టులన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మేరకు వస్తున్న సోషల్ మీడియా పోస్టులపైనా రేవంత్‌వర్గం నేతలు దృష్టి పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదని.. ఎవరైనా పెడితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు సీనియర్ నేతలు.. బుజ్జగింపులకు తగ్గాలా.. తమ నిర్ణయం తాము తీసుకోవాలా అన్న విషయంలో డైలమాలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలను సర్దుబాటు చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.
సలహాదారుగా దిగ్విజయ్ సింగ్‌ను నియమించినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆయన పలువురు సీనియర్లకు పోన్ చేసి.. తొందరపడవద్దని సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కావాలనుకున్న నేతలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి.. సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ సీరియస్ గా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిగ్విజయ్ సింగ్.. సీనియర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయనున్నారు.
ఇటీవలే ప్రకటించిన కమిటీల్లో ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు ఉన్నవాళ్లకే పదవులు వచ్చాయని సీనియర్లు అంటున్నారు. ఇలా ఉంటే పార్టీ తమ చేతుల్లో నుంచి వెళ్తొందని.. దీనికోసమే సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు తెరపైకి తీసుకు వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీల్లో ఎలాంటి పదవీ.. దక్కని మరో నేత
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్లకు మద్దతు తెలుపుతున్నారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మీ వెంట నేను అంటున్నారు.
రేవంత్ తో కలిసి పని చేయడం కన్నా రాజకీయాలు వదిలేయడం బెటరని.. అందరూ బీజేపీలోకి రావాలని సీనియర్లకు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంజి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు ది. అయితే ఒక్కక్కరుగా కాకుండా.. అందరు సీనియర్లు ఒకేసారి తెరపైకి వచ్చారు.
వీరంతా వ్యూహాత్మకంగా ఓ పార్టీతో మాట్లాడుకుని …ఇలా రచ్చ చేస్తున్నారని.. వీరంతా కోవర్టులన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం పదవులు అనుభవించిన సీనియర్లు తరువాతి తరం నాయకత్వానికి స్వాగతం పలకడం లేదు సరికదా.. అడుగడుగునా అడ్డుపడుతున్నారు.
దీంతో సహజంగానే పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్యా గ్యాప్ బాగా పెరిగిపోయింది. పెరిగి పోయింది అనడం కంటే ఇరువురి మధ్యా అగాధం ఏర్పడింది అని చెప్పవచ్చు. యువ నాయకత్వాన్ని స్వాగతించలేక పోవడంతోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని సంక్షోభానికి కారణంగా విశ్లేషకులు అంటున్నారు.
యువ నాయకత్వానికి వ్యతిరేకొంగా గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చుకు కారణమయ్యారు. అయితే .. ఈ మేరకు వస్తున్న సోషల్ మీడియా పోస్టులపైనా రేవంత్ వర్గం నేతలు దృష్టి పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదని..ఎవరైనా పెడితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు సీనియర్ నేతలు.. బుజ్జగింపులకు తగ్గాలా.. తమ నిర్ణయం తాము తీసుకోవాలా అన్నదానిపై డైలమాలో ఉన్నారు.
అయితే సీనియర్లు ఇలా పార్టీని రోడ్డు మీదకు తీసుకొస్తే.. నష్టపోయేది పార్టీనేనని మరికొంత మంది సీనియర్లు చెబుతున్నారు. ఏదైనా ఉంటే.. కూర్చొని పరిష్కరించుకోవాలని అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుందని చెబుతున్నారు. సేవ్ కాంగ్రెస్.. అంటూ పార్టీని
ముంచేయవద్దని.. తప్పో.. ఒప్పో కూర్చొని మాట్లాడుకుని.. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ఒకింత పుంజుకుందన్న మాట ఎవరూ కాదనలేరు. అయితే అది ఎన్నికలో విజయం రూపంలో ఫలితం వచ్చేందుకు అవకాశం లేకుండా పార్టీలో అంతర్గత విభేదాలు, రచ్చకెక్కి విమర్శలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందా అన్నట్లు తయారైంది. ఇప్పుడు పార్టీలో సంక్షోభ నివారణకు దిగ్గిరాజేనే హైకమాండ్ పంపడంతో ఆయన సీనియర్లను ఎంత వరకూ సముదాయించగలరన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అంతే కాకుండా డిగ్గి రాజా ఇప్పటి వరకూ యువ నేతలకు ప్రోత్సాహం ఇచ్చిన దాఖలాలు లేవు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో యువ నేతలు తిరుగు బావుటా ఎగుర వేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అటు సీనియర్లకు, ఇటు జూనియర్లకూ సమ్మతం లేని దిగ్గిరాజాను అధిష్టానం దూతగా పంపడంతో ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దగలుగుతారా అన్నఅనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెటటడంతో సీనియర్లు ఏలా స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.