Homeఅంతర్జాతీయంకేంద్రం ప్రవేశపెట్టబోయే .. కొత్త బడ్జెట్ .. మధ్య తరగతికి ఊరట కలిగించనుందా..?

కేంద్రం ప్రవేశపెట్టబోయే .. కొత్త బడ్జెట్ .. మధ్య తరగతికి ఊరట కలిగించనుందా..?

  • అందుకే ఆదాయపన్నులో కొత్త శ్లాబ్ లను సిద్ధం చేస్తోందా..?
  • దీనిపై వేతనదారులు ఏమంటున్నారు..?
  • ఆదాయ పన్ను విషయంలో వేతనదారులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి .. మేలు జరగనుందా..?
  • దీనిలో భాగంగా .. పన్ను శ్లాబుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందా..?

ఆదాయ పన్నుకు సంబంధించిన కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్‌ విధానంలో కొత్త స్లాబ్‌లను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఈ కొత్త పన్ను విధానంలోని మార్పులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఆ మార్పులు ఎలా ఉండనున్నాయి? ఆదాయ పన్ను విధానంలో మార్పులపై నివేదికలు ఏం చెబుతున్నాయి.. అన్నదే చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించిన కొత్త పన్ను వ్యవస్థలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త పన్ను వ్యవస్థలో ట్యాక్స్ రేట్లను తగ్గించటం, వాటికి అనుగుణంగా పన్ను స్లాబ్‌లను మార్చి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వెల్లడవుతోంది.

ఈ అంశం ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం వద్ద ఉందని, తుది నిర్ణయం ప్రధాని కార్యాలయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఈ విషయంపై ఆర్థిక శాఖను వివరణ కోరగా ఎలాంటి స్పందన లేదని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాత పద్ధతిలో కేవలం మూడు స్లాబ్‌లే ఉన్నాయి. అయితే కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లను తీసుకొచ్చారు.

అందులో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ విధిస్తున్నారు. అలాగే రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు ఆపైన ఆదాయం ఆర్జించే వారికి 30 శాతం ట్యాక్స్ పడుతుంది.

  • అయితే, పాత పన్ను విధానం కావాలా లేదా కొత్త పన్ను పరిధిలోకి రావాలా..?

అనే విషయం చెల్లింపుదారులే నిర్ణయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే, కొత్త పన్ను విధానంలో ఎంత మంది వ్యక్తిగత చెల్లింపుదారులు ఉన్నారనే విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈసారి ఆదాయ పన్ను పరిమితి పెంపు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మ లా సీతారామన్. ఇటీవలే ఆమె మధ్యతరగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానూ మధ్య తరగతి నుంచే వచ్చానని, వారి కష్టాలు తెలుసని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మధ్య తరగతి కోసం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో మధ్య తరగతికి భారీగా ఊరట కల్పించేందుకు కొత్త పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలుకనిపిస్తున్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేస్తున్న పన్ను మినహాయింపుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం, పన్ను పరిమితిని పెంచడం, పీక్ ట్యాక్ రేటును పెంచడం వంటివి ఆర్థిక మంత్రి గమనించాలని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు.. ప్రస్తుతం రూ.15లక్షలు ఆపై మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తోంది.

ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఆదాయ పన్నుకు మినహాయింపు ఇవ్వాలని, ఆదాయపన్ను పరిమితిని పెంచాలని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లోనే ఈ పన్ను పరిమితిని సవరిస్తారని అంతా ఊహించారు. కానీ వేతన జీవులను నిరాశకు గురిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఊసే ఎత్తలేదు.

    • ఈ సారైనా కేంద్రం మేలు కలిగించకపోదా అని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు..

    ఇదివరకే పలుమార్లు ఈ విషయంపై కేంద్రానికి వేతన జీవులు బహిరంగంగానే విన్నవించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వివిధ శ్లాబుల్లో ఆదాయపన్ను కేంద్రం అమలు చేస్తోంది. రూ.2,50,000 వరకు వార్షిక ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు ఇస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక మినహాయింపులు, ప్రోత్సాహకాల కారణంగా రూ.5 లక్షల వరకు వేతనం ఉన్న ఉద్యోగులు కూడా పన్ను చెల్లించకుండా రాయితీ పొందొచ్చని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.

    ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ ఇందుకు సహకరింస్తుందని ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం అనంతరం 1949-50 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్‌కం ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం తొలిసారిగా తీసుకొచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మఠాయ్ ఈ విధానాన్ని ప్రకటించారు. అప్పుడు రూ.1,500కు పైగా వార్షిక వేతనం ఉన్నవారిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరికి విధించే పన్ను రేటు 4.69 శాతం.

    అప్పట్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు ఆదాయం ఉన్నవారికి 10.94 శాతం పన్ను కేటాయించింది. రూ.10 వేల నుంచి రూ.15 వేలు సంపాదించే వారు.. వారి ఆదాయంలో 21.88 శాతం పన్నుగా చెల్లించాలని నిర్ణయించింది. అలాగే రూ.15 వేలకు పైబడిన వార్షిక వేతనం కలవారు 31.25 శాతం పన్ను చెల్లించాలని షరతు విధించింది. స్వాతంత్య్రం వచ్చాక తొలి బడ్జెట్‌ను మాత్రం అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. 1947, నవంబరు 26న బడ్జెట్‌ని తీసుకొచ్చారు. అయితే, పన్ను శ్లాబులను క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చింది.

    చివరగా 2014లో పన్ను శ్లాబులను సవరించింది. ప్రస్తుతం పన్ను శ్లాబుల ప్రకారం చూస్తే, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు- 5 శాతం. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలు- 10 శాతం. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలు- 15 శాతం. రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలు- 20 శాతం. రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షలు- 25 శాతం. రూ.15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం- 30 శాతం పన్ను విధిస్తున్నారు.

    వచ్చే బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిధి పెంచాలని ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. సెక్షన్ 80 పరిధిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ లోటుతో పోలిస్తే పన్ను మినహాయింపులకే మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఈసారి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఉపయోగపడే బడ్జెట్నే రూపొందిస్తారని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

    కొవిడ్ 19 నష్టాలు, పెరిగిన కమొడిటి ధరలు, పెంచుతున్న వడ్డీరేట్లు, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత పరిస్థితులే ఇందుకు కారణాలని తెలుస్తోంది. ఎన్నికల ఏడాదికి ముందు బడ్జెట్ కావడంతో సామాన్యులపై వరాల జల్లు కురిపిస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు. దేశ బడ్జెట్ లోటు కన్నా పన్ను ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

    ఆర్ధిక మాంద్యం ఆందోళన దృష్ట్యా పన్నుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఎక్కువ ఆదా చేసుకొనేలా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ప్రతి ముగ్గురులో ఇద్దరు సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులను రెట్టింపు చేయాలని కోరుకున్నారు. రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని అంటున్నారు. రెగ్యులర్ నుంచి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కు మారడాన్ని పన్ను రహితంగా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    పన్ను శ్లాబుల్లో మార్పులు .. వేతన వర్గాలకు ఊరట కల్పించనుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

    Must Read

    spot_img