ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ దే ఆధిపత్యం.. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్నీ అమెరికన్ డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి.. అయితే.. భవిష్యత్తులో మాత్రం భారత కరెన్సీ రూపాయి ప్రపంచ వాణిజ్యాన్ని లీడ్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
భవిష్యత్ గ్లోబల్ కరెన్సీగా ‘రూపాయి’ ఆవిర్భవిస్తుందా..? రూపాయిల్లో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తున్నాయి..? ప్రపంచ వాణిజ్యాన్ని రూపాయి లీడ్ చేసే అవకాశం ఎంత..?
ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది.. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఏ దేశమైనా, తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా పోగు చేసుకునేది అమెరికన్ డాలర్‌నే. దీని తర్వాతి స్థానం యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరోది. యూరోపియన్
యూనియన్‌లోని 19 దేశాల్లో చట్టబద్ధమైన కరెన్సీ ఇది. ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపుగా ఈ రెండు కరెన్సీలే లీడ్ చేస్తున్నాయి.
ప్రధాన వాణిజ్య కరెన్సీలు అమెరికన్ డాలర్, యూరో.. ఇవే కాక… మరికొన్ని ప్రధాన వాణిజ్య కరెన్సీలు కూడా ఉన్నాయి. వాటిలో జపనీస్ యెన్ , బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ , ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్ , స్విస్ ఫ్రాంక్ , చైనీస్ యువాన్ , స్వీడిష్ క్రోనా, న్యూజిలాండ్ డాలర్, మెక్సికన్ పెసోలు ఉన్నాయి… వీటిలో వాణిజ్యం జరుగుతున్నా, అది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటోంది.
అయితే.. భారత కరెన్సీ రూపాయిని దాదాపుగా ఏ దేశమూ పట్టించుకోవడం లేదు. దీనికి కారణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చాలా బలహీనంగా ఉండడమే. బలమైన కరెన్సీకే ఏ దేశమైనా ప్రాధాన్యత ఇస్తుంది.
రూపాయిల్లో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం వివిధబ్యాంకుల ద్వారా ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయిస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుకు రూపాయిల్లో చెల్లిస్తోంది. మరికొన్ని దేశాలతోనూ రూపాయిల్లోనే వాణిజ్య వ్యవహారాలు నడిపిస్తోంది.
ఈనేపథ్యంలో, న్యూయార్క్ యూనివర్శిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నోరియల్ రౌబినీ చేసిన వ్యాఖ్యలు రూపాయి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్‌లో, భారతదేశ ‘రూపాయి’ ఒక గ్లోబల్ కరెన్సీగా ఆవిర్భవిస్తుందని రౌబినీ అభిప్రాయపడ్డారు..
కాలక్రమేణా డి-డాలరైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు నోరియల్ రౌబినీ తెలిపారు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 40% నుంచి 20%కి పడిపోయిందన్నారు నోరియల్ రౌబినీ… మొత్తం అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య లావాదేవీల్లో యూఎస్ డాలర్ వాటా మూడింట రెండువంతులు ఉండటం సమంజసం కాదన్న విషయాన్ని ఈ క్షీణత నిరూపిస్తోందని చెప్పుకొచ్చారు.. అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధాన లక్ష్యాల యూఎస్ డాలర్ ను ఆ దేశం ఆయుధంగా వాడుతోందని, ఇది
అమెరికా ప్రత్యర్థులను అసౌకర్యానికి గురి చేస్తుందన్నారు. మధ్యప్రాచ్యంలో లేదా ఆసియాలో ఉన్న యూఎస్ మిత్రదేశాల్లోనూ ఈ విధానం పట్ల విసుగు వ్యక్తమవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు..
ఈపరిస్థితుల్లో, రూపాయిని ప్రపంచ ట్రేడింగ్ వేదికపైకి భారత్ వేగంగా తీసుకువస్తోందని రౌబినీ వివరించారు. భారతదేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యానికి, ముఖ్యంగా సౌత్ టు సౌత్ వాణిజ్యానికి భారత రూపాయి ఒక ప్రధాన కరెన్సీగా మారుతుందని అంచానా వేస్తున్నారు… భారత రూపాయిని యూనిట్‌గా తీసుకుని, ఓవర్‌సీస్ ట్రేడ్స్ నిర్వహిస్తారని.. ఇది చెల్లింపుల రూపంలోనూ ఉండవచ్చు, వాణిజ్య విలువను
లెక్కించడానికీ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. “ఖచ్చితంగా, కాలక్రమేణా, ప్రపంచంలోని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీల్లో ఒకటిగా రూపాయి మారవచ్చు” అని నోరియల్ రౌబినీ స్పష్టం చేసారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆర్థిక సమీకరణలకు తావిస్తోంది. అందులో భాగమే రూపాయి అంతర్జాతీయీకరణ ప్రతిపాదన. భారతదేశ కరెన్సీని అంతర్జాతీయ వాణిజ్యంలో చెల్లింపులు- పరిష్కారాలకు వినియోగించే అవకాశం ఆసన్నమైందని, రూపాయిని రిజర్వు కరెన్సీగా విశ్వవ్యాప్తం చేసే ఆలోచన చేయాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. రష్యాపై పశ్చిమ
దేశాల ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయని.. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా వినియోగించడానికి ఇదే మంచి అవకాశమని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని తెలిపింది.
“ప్రపంచ వాణిజ్యంపై అమెరికా డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగొచ్చు.
కానీ రష్యాపై పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు పెద్దఎత్తున విధిస్తున్న నేపథ్యంలో, కొన్ని దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి. రూపాయి- రూబుల్ వాణిజ్యానికి జరుగుతున్న సంప్రదింపులు ఈ కోవలోనివే. బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా మరికొందరు ప్రతి పాదిస్తున్నారు.. ‘రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించటానికి తగిన సందర్భం రావాలి. అది ఇప్పుడు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ‘స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్’ ను వినియోగించుకుని అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు చేయలేని పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోంది.
రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ముఖ్యంగా ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టంగా మారుతుందని ఆర్‌బీఐ గతంలో అభిప్రాయపడింది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని ఇటీవల ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ఫలితంగా రూపాయి మారకపు విలువ మరీ పతనం కాకుండా
ఆర్‌బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి మద్దతుగా నిలిచే చర్యలపై దృష్టి సారించింది. తద్వారా ద్రవ్యోల్బణ హెచ్చుతగ్గులు మరీ ఎక్కువగా లేకుండా చూసే అవకాశం కలుగుతోంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ గత కొంతకాలంగా స్థిరంగా ఉండగా, ఇటీవల కొంతమేర క్షీణించింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల రూపాయి మరీ ఎక్కువగా బలహీన పడదని ఎస్‌బీఐ
అభిప్రాయ పడింది. భవిష్యత్తులో రూపాయి ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఈ నేపథ్యంలో, న్యూయార్క్ యూనివర్శిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నోరియల్ రౌబినీ చేసిన వ్యాఖ్యలు రూపాయి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపుగా రెండు దేశాల కరెన్సీలే లీడ్ చేస్తున్నాయి.
అందులో మొదటిది అమెరికన్ డాలర్ కాగా రెండోది యూరోపియన్ యూనియన్ కు చెందిన యూరో.. కానీ.. భవిష్యత్తులో భారత కరెన్సీ రూపాయి ప్రపంచ వాణిజ్యాన్ని లీడ్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడటం రూపాయిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి..