Homeసినిమానయన్ ఇక టాలీవుడ్ కు దూరం అవుతుందా..?

నయన్ ఇక టాలీవుడ్ కు దూరం అవుతుందా..?

దక్షిణాది సినిమా పరిశ్రమలో నయనతార కు ఉన్న క్రేజ్ అందరికి తెలుసు. ఓ మినిమం హీరోకి ఉన్న స్థాయిలో నయన్ మార్కెట్ వుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న నయనతార… పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా అందరి హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను తన అందచందాలతో అలరిస్తుంది. తన కెరీర్ మొత్తంలో కూడా ఇప్పుడు అద్భుతమైన స్టార్డంను అనుభవిస్తుంది ఈ బొద్దు గుమ్మ. అయితే రానున్న రోజుల్లో టాలీవుడ్ కి నయన్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

లేడీ సూపర్ స్టార్ నయనతార కి తమిళం తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ నయనతార పూర్తిగా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిమితం అవ్వడం ఆమె అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. తెలుగు లో ఈమె స్టార్ హీరో లకు జోడి గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ నయన తార మాత్రం పూర్తిగా తమిళ సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయినట్లుగా కనిపిస్తోంది.

దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయనతార ఆయన దర్శకత్వం లో లేదా ఆయన నిర్మాణం లో సినిమా లు చేస్తూ వస్తోంది.పెళ్లి అయిన తర్వాత కూడా నయనతార వరుసగా సినిమాలు చేస్తుంది. కానీ తెలుగు లో మాత్రం నయన్ చేయకపోవడం పట్ల తెలుగు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో నయన్ నటించిన పలు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

తమిళం లో ఆమె నటించడం ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగు లో డబ్బింగ్ అవుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె నేరుగా తెలుగులో నటించిన సినిమాలు కావాలని కోరుకుంటున్నారు.ఇప్పటి వరకు ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచలేదు. మినిమం సక్సెస్ అయినా దక్కించుకుంటూ వచ్చింది.అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా నయనతార మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే నయనతార ముందు ముందు తమిళం లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం ఈమెకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు. స్టార్ హీరోలకు జోడిగా నయన్ ను సంప్రదించే అవకాశం లేదు. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమా లకు నయన్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించడం లేదు. కనుక తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈమె డబ్బింగ్ సినిమాలతోనే వచ్చే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ వచ్చే అవకాశం తక్కువే.

Must Read

spot_img