HomePhonesమోడీ తమిళనాట నుంచి బరిలోకి దిగనున్నారా..?

మోడీ తమిళనాట నుంచి బరిలోకి దిగనున్నారా..?

  • ఉత్తర భారతంలో తిరుగులేని కమలం .. గాలి .. దక్షిణ దిశకు మారిందా..?
  • వచ్చే సార్వత్రికంలో దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోందా..?
  • అందుకే ప్రధాని మోడీ సైతం .. తమిళనాడు నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారా..?
  • వారణాసి నుంచి అధిక మెజార్టీతో గెలిచిన మోడీ .. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని మార్చుకోనున్నారా..?
  • ఏకంగా తమిళనాడు నుంచే పోటీలోకి దిగాలని యోచిస్తున్నారా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలు గట్టి సవాల్ ను విసరనున్నాయి…!

వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఎన్డీయే కూటమిని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమంటే కత్తిమీద సామే. ఎన్డీయేలో ఉన్న మిత్రపక్షాలన్నీ
ఒక్కొక్కటిగా కూటమికి గుడ్ బై చెప్పేస్తున్నాయి. తాజాగా బీహార్ లో జేడీయూ కూడా బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. గతంలో ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. యూపీఏ కూడా వరుసగా రెండుసార్లు ప్రభుత్వాలను ఏర్పాటుచేసి మూడోసారి విఫలమైంది.

అటువంటి సెంటిమెంట్ ను ఖాతరు చేయకుండా కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ-షా పనిచేస్తున్నారు. తమకు ఈసారి ఎన్ని నియోజకవర్గాలు తగ్గుతాయో అంచనా వేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 160 లోక్ సభ నియోజకవర్గాలు తగ్గుతాయని అంచనా వేశారు. లోటును దక్షిణాది నుంచి పూడ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని రామనాథపురం లోక్ సభ నుంచి పోటీచేయడానికి ప్రధానమంత్రి మోడీ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. వడోదరకు రాజీనామా చేసి వారణాసిని అట్టిపెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి వారణాసి నుంచి పోటీచేసి గెలుపొందారు.

ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతో కూడిన దక్షాణాది రాష్ట్రాల్లో పట్టుకోసం ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించుకుంటోంది.

రామనాథపురం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రాముఖ్యతను కలిగివుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం రామనాథపురానికి ఆతిథ్యం ఇస్తుంది. భారత్, శ్రీలంక మధ్య అనుసంధానంగా ఉన్న రామసేతు రామనాథపురం నుంచే ప్రారంభమవుతుంది. మోడీ రామనాథపురం నుంచి పోటీచేయడంవల్ల తమిళనాడుతోపాటు దక్షిణ భారతదేశం మొత్తం ప్రభావం చూపుతుందని పార్టీ అంచనా వేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో రామనాథపురంతోపాటు వారణాసి నుంచి కూడా పోటీచేయాలని మోడీ భావిస్తున్నారు. అక్కడ గెలుపొందితే వారణాసికి రాజీనామా చేస్తారు. వచ్చే ఎన్నికలు కమలనాధులకు ఎంత కీలకమో చెప్పనవసరంలేదు. ఉత్తరాదిన బాగా సీట్లు తగ్గుతాయని భావిస్తున్న నేపధ్యంలో ఆ లోటును దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇందుకోసం అనేక వ్యూహాలను అమలు చేస్తోంది లేటెస్ట్ గా మరో ప్లాన్ ఆ పార్టీ బయటకు తీసింది.

ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ వారణాసి నుంచి మోడీ ఎంపీగా ఉన్నారు. 2014లో ఆయన గుజరాత్ నుంచి కూడా రెండో సీటు పోటీ చేశారు. ఈసారి అదే ఫార్ములాతో సౌత్ లో పాగా వేయాలనుకుంటున్నట్లు భోగట్టా. దీనిపై పార్టీలో లోతైన చర్ఛ సాగుతోంది. దీనికి సంబంధించి తెర వెనక కసరత్తు మొదలైందని అంటున్నారు.

సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయనే స్వయంగా మోడీని కలసి తన సీటు త్యాగం చేస్తూ ఆహానించారట. ఇక్కడ నుంచి ప్రధాని స్థాయి వ్యక్తి బరిలో ఉంటే ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీదన ఉంటుందని బీజేపీ వూహిస్తోంది. అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా తెలంగాణలోని మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే ఆమె కర్ణాటకలోని చిక్ మంగలూరు నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించారు.

మోడీ, అమిత్ షాల కన్ను దక్షిణాది మీద ఇపుడు ఆశ ఉంది..!

సీరియస్ పాలిటిక్స్ కి కూడా తెర తీశారు. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, ఎన్నికల వేళకు తమిళనాడు లోనూ కూటమి కడుతుందని అంటున్నారు. ఏపీలో కూడా ఏదో మ్యాజిక్ చేస్తుందని, అందుకో భాగంగానే ప్రధాని మోడీ ఇక్కడ పోటీకి దిగుతారని చెబుతున్నారు. నిజంగా మోడీ పోటీ చేస్తే ఓ కొత్త ఊపు బీజేపీకి వస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రతి నియోజకవర్గంలోని గెలుపూ లెక్క వేసుకోవాల్సిందే.

క్లిష్టమైన పరిస్థితుల్లో అటు ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమి ఎదురీదుతున్నాయి. దక్షిణ భారతంలో ఎంతోకొంత బలమున్న కాంగ్రెసు స్వీయతప్పిదాలతో బోల్తా పడింది. బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కర్ణాటక మినహాయిస్తే మిగిలిన చోట్ల అంతంతమాత్రంగానే ఉంటూ ఉత్తరాది పార్టీగానే ముద్ర పడి పోయింది. 2019 ఎన్నికల్లో దక్షిణ భారతంలో తన గతవైభవాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కాంగ్రెసు కు ఉంది.

కనీసం పార్లమెంటులో సెంచరీ కొట్టాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఆదుకోవాల్సిందే. అలాగే బీజేపీ రెండువందల బెంచిమార్కు దాటి అధికారానికి చేరువ కావాలంటే ఎంతోకొంత దక్షిణాది ఆసరా దొరకాలి. ఆయా సమీకరణలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అగ్రనాయకులను ఆయాపార్టీలు ఇక్కడి రాష్ట్రాల నుంచి రంగంలోకి దిగమని ఆహ్వానిస్తున్నాయి. దీనివల్ల సెంటిమెంటును ప్రేరేపించేందుకు ఆస్కారముంటుందని పిలుపునిస్తున్నాయి.

2014లో మోడీ భారతీయజనతాపార్టీ జాతీయనాయకునిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచినప్పుడు ఉత్తరభారతం జయహారతులు పట్టింది. దక్షిణాదిన సైతం భారీగానే ఓట్లు దక్కాయి. ఈ విడత ఉత్తరభారతంలో బీజేపీ బాగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగని దక్షిణభారతం అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు.

గతంలో వచ్చిన సీట్లు కూడా రాకపోవచ్చనేది అంచనా. తెలుగుదేశం తో విడిపోవడంతో తెలంగాణ, ఏపీలలో ఒక్క సీటూ గెలిచే సూచనలు లేవు.

అన్నాడీఎంకే తో జోడీ కట్టినా తమిళనాడులో ఆశాజనకమైన వాతావరణం లేదు. కేరళలో ఓట్ల సంఖ్య పెరగవచ్చునేమో కానీ సీట్లు వస్తాయని ఆపార్టీకే నమ్మకం లేదు. గతంలో ఆదుకున్న కర్ణాటక ఈసారి అదే స్థాయి మద్దతు ఇవ్వకపోవచ్చు. జేడీఎస్ , కాంగ్రెసు కలిసి పోటీ చేస్తుండటంతో బీజేపీ సీట్ల సంఖ్య కుదించుకుపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

దాంతో మోదీ కర్ణాటక నుంచి పోటీ చేస్తే బలమైన ప్రభావాన్ని చూపవచ్చని బీజేపీ నాయకులు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే విభేదాలతో సిగపట్లు పడుతున్న కాంగ్రెసు, జేడీఎస్ లకు చెక్ పెట్టాలంటే మోడీ రావాలనేది పార్టీ డిమాండుగా కనిపిస్తోంది. అదే జరిగితే కర్ణాటకను స్వీప్ చేయవచ్చని ఆశిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎదురవుతున్న సమస్యలు వచ్చే ఎన్నికల్లో లోక్ సభ సీట్లపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది.

ముఖ్యంగా ఉత్తర భారత పార్టీగా ముద్ర పడిన బీజేపీ పై ఆ మచ్చ చెరిపేయాలంటే దక్షిణాది నుంచి ఒక స్థానాన్ని ఎంచుకోవాలన్నది స్థానిక నేతల సూచన. దీనివల్ల కర్ణాటకలో ఫలితాలను కన్సాలిడేట్ చేసుకోవచ్చనే అంచనా ఉంది. మొత్తమ్మీద అగ్రనాయకులు ప్రతినిధులుగా కొనసాగకపోయినా ఫర్వాలేదు. పోటీ చేస్తే చాలు. ఎన్నికల్లో బలమైన ముద్ర వేయగలుగుతారు. అందుకే ప్రాంతీయ నాయకులు అధిష్ఠానాలపై ఒత్తిడి చేస్తున్నారు.

దీంతో ఇదే యోచనలో ఉన్న మోడీ షా ద్వయం .. ఈ దఫా .. దక్షిణ భారతంపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే మోడీ .. ఈసారి వారణాసితో పాటు తమిళనాడులోని రామనాథపురం నుంచి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Must Read

spot_img