ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తప్పదా..? పక్కా సమాచారంతోనే ఈడీ దూకుడు ప్రదర్శిస్తోందా..? అదే జరిగితే, ఇక కవిత ఇరుక్కుపోయినట్లేనన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం ఉచ్చు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటోంది. మొదట ఆరోపణలే అనుకున్నా ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో లిక్కర్ పద్యవ్యూహంలో చిక్కుకున్న కవిత అందులో నుంచి బయట పడేందుకు వెతుక్కుంటున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో లీగల్‌గా ఉచ్చులో ఆమె చిక్కుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ కవిత పేరును మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో చేరుస్తూ వస్తోంది. అందులో కొన్ని నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇవి రుజువు అయ్యేనా, సచ్చేనా అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నారు కవిత. కానీ ఇదే కేసులో రంగంలోకి దిగిన సీబీఐ కవిత ప్రమేయాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు సంపాదించింది. ఈమేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు.
విచారణ జరిపిన కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ సమర్పించిన కీలక సాక్షుల ఖాతాలు, ఇతర పత్రాల ఆధారంగా కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు రాఘవ నిందితులతో కలిసి మొత్తం రాకెట్‌ను నడిపినట్లు స్పష్టంగా రుజువు చేసిందని కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొంత మంది నిందితులను ప్రశ్నించాల్సి ఉందని, మనీలాండరింగ్‌ను రుజువు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. దీంతో కవిత ప్రమేయం దాదాపు నిర్ధారణ అయిందని సమాచారం.
అరెస్ట్ కూడా ఎంతో దూరంలో లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ తమ పని తాము చేసుకుపోతున్నాయి. కుంభకోణాన్ని నిరూపించేందుకు, అరెస్ట్ తప్పుకాదని ధ్రువీకరించేందుకు తగినన్ని ఆధారాలు సేకరిస్తోంది. కానీ, ఈ స్కాంలో చిక్కుకున్నవారు ఏమీ జరుగట్లేదు అన్నట్లు మిన్నకుండిపోతున్నారు.
ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలతో సీబీఐ, ఈడీ ఏం చేస్తున్నాయో.. ఏం చేయబోతున్నాయో స్పష్టంగా అర్థమైంది. వాట్సాప్ చాట్‌లు, మొబైల్ లొకేషన్‌లు, నగదు లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, హోటల్ రికార్డులపై కవిత ప్రమేయం ఉందని ఈడీ తగినన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచింది.
దీంతో కోర్టు కూడా నిందితులను ప్రశ్నించాల్సి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
- లిక్కర్ స్కాం వ్యవహారంలో రామచంద్రన్ పిళ్లై కీలకం..
ఇతర నిందితులు దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో కవిత జరిపిన సమావేశాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడని కూడా వెల్లడించింది. ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో రామచంద్రన్ పిళ్లై కీలకం. ఇంత వరకూ ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అప్రూవర్‌గా మారారని అన్ని విషయాలు చెబుతున్నారని.. ఆయన వివరాలతోనే దాడులు చేస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే కవిత ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే చెబుతున్నారు.
మొత్తంమీద లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయని కోర్టుతోనే చెప్పించింది సీబీఐ. కోర్టు తాజా వ్యాఖ్యలతో కవిత అరెస్ట్‌కు ఇంకా ఎన్నో రోజులు పట్టకపోవచ్చని తెలుస్తోంది. నిందితులను విచారణ చేయాల్సిందే అని కోర్టు స్పష్టం చేయడంతో వీలైనంత త్వరగా కవిత అరెస్ట్ ఉంటుందన్న సంకేతాలు ఈడీ నుంచి వెలువడుతున్నాయి. ఇది బీఆర్ఎస్‌కు, కేసీఆర్ కు తీరని దెబ్బగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇన్నాళ్లూ కవిత పేరును మాత్రమే
ఎన్‌ఫోర్‌సమెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో చేరుస్తూ వస్తోంది. అందులో కొన్ని నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తోంది.
దీంతో ఇవి రుజువు అయ్యేనా, సచ్చేనా అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నారు కవిత. కానీ ఇదే కేసులో రంగంలోకి సీబీఐ కవిత ప్రమేయాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు సంపాదించింది. ఈమేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్ బోయి¯Œ పల్లి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్లు వేయగా, కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
ఈడీ సమర్పించిన కీలక సాక్షుల ఖాతాలు, ఇతర పత్రాల ఆధారంగా కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు రాఘవ నిందితులతో కలిసి మొత్తం రాకెట్‌ను నడిపినట్లు స్పష్టంగా రుజువు చేసిందని కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొంత మంది నిందితులను ప్రశ్నించాల్సి ఉందని, మనీలాండరింగ్‌ను రుజువు చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. దీంతో కవిత ప్రమేయం దాదాపు నిర్ధారణ అయింది. అరెస్ట్ కూడా ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.
నిందితులను విచారణ చేయాల్సిందే అని కోర్టు స్పష్టం చేయడంతో వీలైనంత త్వరగా కవిత అరెస్ట్ ఉంటుందన్న సంకేతాలు ఈడీ నుంచి వెలువడుతున్నాయి. అయితే ఈ తీర్పులో కొన్ని సార్లు కవిత ప్రస్తావన వచ్చింది. కవితను ఇంకా సీబీఐ, ఈడీ నిందితురాలిగా చూపించేలేదు. కానీ ఆమె పేరు మాత్రం చాలా సార్లు ప్రస్తావించింది.. డిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆమె బినామీ భాగస్వామి అని స్పష్టం చేసింది.మరో వైపు లిక్కర్ కేసు మెల్లగా కవిత వద్దకే వస్తున్నట్లుగా పరిణామాలు మారుతున్నాయి. ఒక్కొక్కరిగా అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు.
సౌత్ లాబీ లింకులన్నీ కవిత దగ్గరకే చేరుతున్నాయన్న ప్రచారం గుప్పు మంటోంది. ఇప్పటికే కవితను ఓ సారి విచారించారు. మరో సారి విచారణకు పిలుస్తామని నోటీసులు ఇచ్చారు. దీంతో ఎప్పుడైనా కవితను విచారణకు పిలువవచ్చన్న ప్రచారం ప్రారంభమైంది. ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో రామంచంద్రన్ పిళ్లై కీలకం. ఇంత వరకూ ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అప్రూవర్‌గా మారారని అన్ని విషయాలు చెబుతున్నారని.. ఆయన వివరాలతోనే దాడులు చేస్తున్నారని అంటున్నారు.
అదే నిజం అయితే కవిత ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే చెబుతున్నారు. కవిత నివాసంలో జరిగిన సమావేశంలో రామచంద్రన్ పిళ్లై, బోయిన్ పల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి పాల్గొనగా.. అనిల్ కూడా ఆ భేటీలో ఉన్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో కవిత భర్త అనిల్ కూడా ఈ కేసులో చిక్కుకున్నట్లైంది. త్వరలో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆ రోజు సమావేశంలో అసలు ఏం మాట్లాడుకున్నారు? పాలసీ రూపకల్పనలో ఏం జరిగింది? అనే వివరాలను అనిల్ ద్వారా తెలుసుకోనున్నారని చెబుతున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో చాలామంది మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను తరచూ మార్చారని, డిజిటల్ ఆధారాలు దొరక్కుండా రీసెట్ చేశారని ఈడీ
ఇటీవల దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఫోన్లను ధ్వంసం చేశారని, కవిత వాడిన ఫోన్లలో అనిల్ సంభాషణలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో వాటి గురించి తెలుసుకునేందుకు అనిల్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు ఊహాగానాలు హల్‌చల్ చేస్తోన్నాయి. ఇప్పటికే ఈ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచడం, ఇటీవల పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కవిత భర్తకు నోటీసులు వస్తాయనే వార్తలు బీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి.
మరి కవిత అరెస్ట్ అవుతారా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారుతోంది..