కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటారు..ఇంతకూ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు జనవరి 1 వ తేదీనే నూతన సంవత్సరం ఎందుకు ప్రారంభం అవుతుంది..? ఇంతకూ క్యాలెండర్ ను ప్రవేశపెట్టింది ఎవరు..? న్యూ ఇయర్ వేడుకల వెనక ఉన్న చరిత్ర ఏంటి..?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కొత్త సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అయితే, నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది..? ఈ రోజునే ఎందుకు వేడుకలు జరుపుకోవాలి..?
దీనికి సమాధానం కావాలంటే 2000 సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.
అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని ప్రవేశపెట్టాల్సి వచ్చింది” అని కీల్ యూనివర్శిటీ అబ్జర్వేటరీ డైరెక్టర్ డాక్టర్ జాకో వాన్ లూన్ తెలిపారు..
భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి.
కాగా, క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది.
రోమన్లకు జనవరి నెల ప్రముఖమైనది. ఎందుకంటే వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది… ఆయన ముందు, వెనుక.. రెండువైపులా చూడగలరు. ఏదైనా ఫ్రెష్‌గా ప్రారంభించేందుకు ఏడాది మొత్తంలో ఏదైనా సమయాన్ని ఎవరైనా ఎంచుకోవాలంటే ఇదే సరైనది అని యురోపియన్లు భావించేవారు” అని బర్మింగ్‌హమ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డయానా స్పెన్సర్ వెల్లడించారు..
యూరప్ లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా ఇప్పుడే..
”రోమన్లకు ఇదొక శక్తివంతమైన కాలం. ఎందుకంటే వారు అప్పటి వరకూ పగటి వేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తుంటారు. వారి ప్రపంచమంతా చీకటిగా, చల్లగా ఉంటుంది. ఏదీ వృద్ధి చెందదు. చేసేందుకు ఏ పనీ ఉండదు.. ముఖ్యంగా శీతాకాలం ఒక విశ్రాంతి సమయం లాంటిదని చెప్పవచ్చును..
రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ… వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది… అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది.
అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు. చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి.ఎందుకంటే.. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా దానికి ప్రాశస్త్యం ఉంది.
”క్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్. అయితే, దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నావంటూ మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చిలో.. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుంది. మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలనటానికి ఇది కూడా ఒక కారణం.. పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్ధంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు.
క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది. అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్ తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.
అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను, కళ్లు మిరుమిట్లు కొలిపే రీతిలో ప్రజల సంబరాలను చూస్తున్నాం. వాస్తవానికి భారతదేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తోంది. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ రోజు 1940వ సంవత్సరం పుష్య మాసం 11వ తేదీ.
అమరావతి కేంద్రంగా పాలించిన గౌతమీ పుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహన శకం ప్రారంభం అయ్యిందని భావిస్తుంటారు. అలా ఇప్పటికి 1939 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు 1940వ సంవత్సరంలో ఉన్నాం. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు ఈ కేలండర్ వాడతారు.
ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 78 నుంచి మొదలవుతుంది. శాలివాహన శకం క్యాలెండర్‌లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరం అయితే మార్చి 21వ తేదీన వస్తుంది.
భారత ప్రభుత్వం 1957 మార్చి 22వ తేదీ నుంచి ఈ శాలివాహన శకం క్యాలెండర్‌ను అధికారికంగా పాటిస్తోంది. పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్ధంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. అప్పటి నుంచి జనవరి 1 నే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇది చదవండి :- మరో అయిదు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం..