HomeEntertainmentబాలయ్య షో కి రానన్న స్టార్ హీరో ఎవరు..?

బాలయ్య షో కి రానన్న స్టార్ హీరో ఎవరు..?

బుల్లితెరపై ఆహా ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న షో అన్ స్టాప్ బుల్. నట సింహం నదమూరి బాలకృష్ణతో దీపావళి రోజున అన్ స్టాప్ బుల్ మొదటి ఎపిసోడ్ ని ఆహా గ్రాండ్ గా లాంచ్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న ఈ షోకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఛాట్‌ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చారు. బాలయ్యతో తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో షోపై అంచనాలు బాగా పెరిగాయి. మొదటి ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబం షో కి గెస్టులుగా వచ్చారు.

ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. త్వరలోనే రెండవ సీజన్ కూడా పూర్తి కాబోతుంది. ఇక ఈ రెండు సీజన్స్ లో వచ్చిన గెస్ట్ లతో బాలయ్య చేసిన సందడి అంతా కాదు. ముఖ్యంగా తన బావ, టీడీపీ అధినేత మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చేసిన హంగామా అంత ఇంత కాదు. ఒక మంచి యాంకర్ గా కనిపిస్తూ…చిక్కు ప్రశ్నలు సందిస్తూ…తిక మక పెట్టి వారి నుంచి సమాదానాలు రాబట్టి…తెగ అల్లరి చేస్తున్నారు. ఫాన్ ఇండియా హీరోలను సైతం షో లో ఒక ఆట ఆడుకుంటున్నారు బాలయ్య. అల్లు అరవింద్ స్టూడియోలో జరుగుతున్న ఈ షోకి ఓ స్టార్ హీరో మాత్రం నాలుగు సార్లు ఇన్వైట్ చేసిన రాలేదట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అరవింద్ బావ, మెగాస్టార్ చిరంజీవి.

షో ప్రారంభం మెగాస్టార్ తో చేయాలని మొదట బావించారు కానీ దానికి చిరు నో చెప్పాడంతో మోహన్ బాబును పిలిచారు. అల్లు అరవింద్ షో స్టార్ట్ కాకముందు నుంచే ఫస్ట్ గెస్ట్ గా రావాలని చాలా సార్లు చిరంజీవిని అడిగారట. ఆ తర్వాత రెండో సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా చిరును చాలా రిక్వెస్ట్ చేశారట కానీ మెగాస్టార్ మాత్రం నో చెప్పుతూ వచ్చారని సినీ ఇండస్ట్రీలో టాక్. ఇక లాభం లేదనుకున్న బాలయ్య ఇప్పటికే చిరును నాలుగు సార్లు తన షోకి రావాలని ఫోర్స్ చేసిన అంతగా ఆసక్తి చూపలేదట చిరు. కనీసం పవన్ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు అయినా ఆ ఎపిసోడ్లో గెస్ట్ గా రమ్మంటూ కోరాడట. అయినా కూడా చిరంజీవి దాన్ని రిజెక్ట్ చేశారట. అలా నాలుగు సార్లు చిరంజీవి రిజెక్ట్ చేయడంతో ఈ విషయంలో అల్లు అరవింద్ చాలా హర్ట్ అయ్యాడట.

కానీ బాలయ్య మాత్రం ఆయన పరిస్థితి అర్థం చేసుకొని ఆయనకు సమయం ఉన్నప్పుడు కచ్చితంగా వస్తాడు.. మిగతా గెస్టులను ప్లాన్ చేయండి అంటూ చిరంజీవికి సపోర్ట్ గా మాట్లాడారట. అయితే తాను హోస్టుగా వ్యవహరించిన టాక్ షో కి చిరంజీవి నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా బాలయ్య మాత్రం చిరు వైపే మాట్లాడటం గమనార్హం. అయితే వాల్తేరు వీరయ్య సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత చిరంజీవి చిన్న చిన్న ఇంటర్వ్యూలో కూడా వెళ్లిన ఆయన బాలయ్య షోకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కావడంలేదు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ చిరును ఈ విషయంపై అడగ్గా చిరు మాత్రం తనను ఇంత వరకు ఎవరూ షోకు రమ్మని పిలువలేదని, రమ్మని పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజంగా చిరుకు ఆహ్వానం రాలేదా..? లేక అలా చెప్పారా అన్న ప్రశ్నలు అభిమానులను వేదిస్తున్నాయి. త్వరలోనే సీజన్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడైనా మెగాస్టార్ బాలయ్య షోకి వస్తారా? లేక మళ్ళీ హ్యాండ్ ఇస్తారా? అనేది చూడాలి.

Must Read

spot_img