పాలిటిక్స్ లో ఆయనో బెటర్ లీడర్. రెండుసార్లు ఎమ్మెల్యే గా పనిచేసినా ఏ ఆరోపణలు లేని నాయకుడు. అయితే ఒకప్పుడు ఆయన రాకను నిరాకరించిన పార్టీ.. ఇప్పుడు ఆయన్ను పార్టీలోకి రమ్మని పిలుస్తోంది. ఇంతకీ ఏవరా నేత. ఎక్కడా ఆ నియోజక వర్గం. ఆయన ఏంట్రీ పై ఏంటి ఇంతటి హాట్ డిస్కషన్..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న ఇప్పటి నుంచే ఇక్కడ పోలిటికల్ హైఓల్టేజ్ స్టార్ట్ అయింది. పాత నేతలు పార్టీ కండువాల కలర్ మార్చటం పొలిటికల్ అటెన్షన్ ను పెంచింది. అయితే ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే యర్రం వేంకటేశ్వరరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకే ఇష్టపడని వైసీపీ ఇప్పుడు ఆయన్ను పార్టీలోకి సాదరంగా రమ్మని ఆహ్వానిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు వద్దన్న పార్టీయే ఇప్పుడే ఎందుకు పిలుస్తోంది. అసలు ఇప్పుడే ఆయన ఎంట్రీ ఎందుకు అన్నదానిపై
పోలిటికల్ సర్కిల్స్ బిగ్ టాక్ నడుస్తోంది. ఐతే కన్నా లక్ష్మీ నారాయణ ఇటీవల బిజెపిని వీడి టీడీపీలో చేరారు.

కన్నాను టీడీపీ సత్తెనపల్లి నుంచి పోటీ దించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ కన్నానే క్యాండిడెట్ అయితే ఈ బలమైన నేతను దీటుగా ఢీకొట్టానికి వైసీపీ అస్త్రాలు సిద్దం చేస్తోందట. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ను షూరు చేసినట్లుగా తెలుస్తోంది. అసంతృప్తి నాయకులను, ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలో చేరేలా మంతనాలు చేస్తునట్లుగా తెలుస్తోంది. గతంలో కన్నా అనుచరుడిగా, కాపు నేతగా, ప్రస్తుత బిజెపి నాయకుడిగా ఉన్న పక్కాల సూరిబాబును ఇటీవల మంత్రి అంబటి కలసి పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అలాగే సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వేంకటేశ్వరరెడ్డి విజయవాడలో అంబటి కలిశారు. యర్రంను అంబటి పార్టీలోకి రమ్మని ఆహ్వనించినట్లుగా వార్తలొచ్చాయి.
ఈ ఇద్దరి కలయిక ఎన్నికల సంకేతమేనని పోలిటికల్ కామెంట్స్ సెగ్మెంట్ వ్యాప్తంగా నడుస్తున్నాయి. వాస్తవంగా యర్రం 2004-09 రెండు సార్లు సత్తెనపల్లి శాసనసభ్యుడిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడి గుర్తింపు పొందిన యర్రం సౌమ్యుడిగా, వివాదరహిత నేతగా పేరుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ యర్రంను పార్టీలోకి ఆహ్వానించినా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. టీడీపీ నుంచి పోటీ చేసి కోడెల శివప్రసాదరావు పరాజయం పొందారు. 2019లో వైసీపీ నుంచి యర్రం సీటును ఆశించారు. అప్పట్లో యర్రం రాకను వైసీపీ నిరాకరించింది.
దీనితో యర్రం జనసేన నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే అప్పుడు యర్రం రాకపై అభ్యంతరం తెలిపిన వైసీపీ ఇప్పుడెందుకు ఆయన్ను పార్టీలోకి
ఆహ్వనిస్తునట్లు అన్నదాని చుట్టూ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. సత్తెనపల్లిలో మొదటి నుంచి అంబటికి రెడ్డి సామాజిక వ్యతిరేకంగా ఉంది. ఈ గ్యాప్ ను సరిచేయటం కోసమే యర్రంను వైసీపీ పార్టీలోకి ఆహ్వనిస్తునట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆపరేషన్ వర్కవుట్ చేసి రెడ్డి కాపు కాంబినేషన్ లో టీడీపీని దీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధమవుతుందని చెప్పుకుంటున్నారు.
అంతేకాక ఎన్నికల నాటికి సామాజిక సమీక్షలు మారితే స్ధానిక కోటలో యర్రంనే అభ్యర్థిగా పోటీలో దించనుందన్న చర్చలు సాగుతున్నాయి. ఇక సత్తెనపల్లి విషయానికొస్తే.. ముందు నుంచి తెలుగుదేశం ప్రాబల్యం ఎక్కువగా ఉండే సెగ్మెంట్ ఇది. ప్రస్తుతం.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన.. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండరనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో.. ఆయనపై అసమ్మతి రాగం కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌పై అంబటి చేస్తున్న విమర్శలు.. కాపులకు మింగుడుపడటం లేదు. సత్తెనపల్లి వైసీపీ టికెట్ అంబటికే ఇచ్చినా.. గెలుపోటములను నిర్ణయించేది కాపులే కావడంతో.. ఈసారి అంబటి విషయంలో వాళ్లు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇక.. మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత.. సత్తెనపల్లిలో టీడీపీ రెండు ముక్కలైంది. కోడెల తనయుడు శివరాం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి టికెట్ రేసులో కోడెల శివరాంతో పాటు వైవీ ఆంజనేయులు ఉన్నారు. ఇక్కడ.. కన్నాకు సంబంధించిన క్యాడర్ కాస్త ఎక్కువే ఉంది. అది.. ఈసారి టీడీపీ కొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు. జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. సత్తెనపల్లిలో జనసేన అభ్యర్థినే బరిలోకి దించుతారనే టాక్ వినిపిస్తోంది.

ఇక వైసీపీ అధిష్టానం తాజా మార్పుల్లో భాగంగా సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబును ఈసారి అక్కడి నుంచి కాకుండా కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి తరహాలోనే అవనిగడ్డలోనూ కాపు జనాభా ఎక్కువగానే ఉండటం, అవనిగడ్డ కూడా వైసీపీ సిట్టింగ్ స్ధానమే కావడంతో అక్కడికి అంబటిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా మారి వేరే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అంబటి అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. దీంతో యర్రం వైసీపీలో చేరతారో లేదోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
అలాగే మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లికి మార్చాలని అధిష్టానం భావిస్తోంది. అమరావతిలో మారుతున్న పరిస్ధితులు, ఆళ్లకు పెరుగుతున్న వ్యతిరేకత తట్టుకోవాలంటే తమ సిట్టింగ్ స్ధానమైన సత్తెనపల్లి నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ప్రకటన రాకపోయినా అధిష్టానం ఆలోచన మేరకు సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగేందుకు ఆళ్ల రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. స్ధానికంగా నెలకొన్న బీసీల పోరు, అమరావతి సమస్య నేపథ్యంలో మంగళగిరి కంటే సత్తెనపల్లి అయితేనే బెటరని ఆర్కే భావిస్తున్నట్లు అర్దమవుతోంది.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీకి రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటు అధికార పార్టీతో పాటు అటు వైసీపీలోనూ సీట్ల కొట్లాటలు షురూ అయినట్టుగానే తెలుస్తోంది. అధికార టీడీపీలో పరిస్థితి కాస్తంత గుంభనంగానే ఉన్నా వైసీపీలో మాత్రం ఈ కొట్లాటలు రచ్చకెక్కుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి ఉన్నా.. కీలక జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా రచ్చలు వైసీపీకి పెద్ద తలనొప్పిగానే పరిణమించాయని సమాచారం.
గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సత్తెనపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న కీలక నేత అంబటి రాంబాబుకు కూడా ఈ దఫా సీటు దక్కదన్న పుకార్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. పార్టీలో ఓ మోస్తరు స్టామినా కలిగిన నేతలుగా ఉన్న వీరిద్దరికే ఈ దఫా టికెట్లు దక్కడం లేదంటే… ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గడచిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అంబటి, స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్‌కు గట్టి పోటీనే ఇచ్చారు.
ఒకానొక సమయంలో అంబటి గెలిచిపోయారన్న మాట కూడా వినిపించింది. అయితే కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో కోడెల విజయం సాధించారు. నాటి నుంచి పార్టీ తరఫున తురుపు ముక్కగానే వ్యవహరిస్తున్న అంబటి రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌పై మాత్రమే దృష్టి సారించి సొంత నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవడం మానేశారట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి మినహా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే గానీ అంబటికి మాత్రం టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు నేరుగా అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారట.
మరి వైసీపీ నుంచి బరిలోకి దిగేది ఎవరన్నదే హాట్ టాపిక్ గా మారిందట..