HomePoliticsపవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి గెలిపిస్తానంటున్న ఆ నేత ఎవరు..?

పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి గెలిపిస్తానంటున్న ఆ నేత ఎవరు..?

  • యుద్ధం చేతకాని వాడు రణక్షేత్రంలో తప్పుకుంటాడు.. అదే తెలివైన వాడు తప్పించుకుంటాడు.. సమయం కోసం వేచి చూస్తాడు.. ఇదే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఒక నేత ఫాలో అవుతున్నట్టు ఉన్నారు.
  • నా స్థానంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే.. తప్పుకుని ఆయన్ని నా భుజాన వేసుకుని గెలిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
    రాజకీయాల్లో తల పండిన ఆ నేత కామెంట్స్ అందరికీ షాకింగ్ గా ఉన్నా.. దానికి ఒక యుద్ధ నీతి దాగి ఉందన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.
  • ఇంతకీ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి గెలిపిస్తానంటున్న ఆ నేత ఎవరు.. ఆయన యుద్ధ నీతి ఏంటి..

    ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు చర్చనీయాంశంగా ఉంటే, అనంతపురం జిల్లాలో మాత్రం ఇంకో మ్యాటర్ పెద్ద డిస్కషన్ గా మారింది. అసలు పవన్ చంద్రబాబు ఇద్దరూ తాము పొత్తుల గురించి ప్రస్తావించుకోలేదని.. అసలు ఇప్పుడది మ్యాటర్ కాదంటుంటే.. టీడీపీతో పొత్తులో భాగంగా మా ఊరికి వస్తానంటే నేను తప్పుకుని ఆయన్ని గెలిపిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.

    అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ప్రభాకర్ చౌదరి బలమైన వ్యక్తి అనడం కంటే ఓ బలమైన శక్తి. నైన్టీస్ నుంచే ప్రజల్లో పట్టు సాధించి.. ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు. పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ పెట్టుకున్నారు. అంతెందుకు తాను తప్ప నియోజకవర్గంలో ఇంకో ప్రత్యామ్నాయం లేదనే విధంగా ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలో పాతుకపోయారు.

    అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తానంటే.. తాను తప్పుకుంటానని చెప్పడం ఏంటన్నది పెద్ద డిస్కషన్ గా మారింది. అయితే ఇక్కడే సరిగ్గా ప్రభాకర్ చౌదరి రాజకీయ చతురత గురించి చెప్పాలి. అసలు ఆయన ఈ వ్యాఖ్యలు వెనుక ఒక బలమైన కారణం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనంతపురంపై ఎప్పటినుంచో గురి ఉంది.

    ఆయన పార్టీ స్థాపించిన తొలి రోజుల్లోనే నాకు అనంతపురం అంటే ఇష్టమని.. నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన సైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ చివరి నిమిషంలో తన సొంత ప్రాంతం వైపు వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ అనంతపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది.

    ఇక్కడ బలిజ సామాజిక వర్గం చాలా ఎక్కువ. నియోజకవర్గంలో సుమారు 2లక్షలకు పైగా ఓటర్లు ఉంటే.. ఇందులో దాదాపు 60వేల మంది బలిజలు ఉన్నారు. వీరంతా సమయాన్ని బట్టి ఒకసారి టీడీపీకి, మరోసారి వైసీపీ లేదా కాంగ్రెస్ కు సహకరించారు. అయితే ఎక్కువ మంది బలిజలు టీడీపీ వైపే ఉన్నారు. ఒక వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే తామంతా పార్టీలకతీతంగా ఆయన్ని గెలిపించుకుంటామని గతంలో బలంగా చెప్పారు.

    ఇటు బలిజ ఓట్ బ్యాంక్ ఉండటం, వారి కంటే అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీ యువత కూడా పవన్ వైపు ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

    బలిజలు, మైనార్టీలు కనీసం 60శాతం మంది సహకరించినా.. ఇక పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరు సరికదా.. దరి దాపుల్లో కూడా ఎవరూ రాలేరు. ఇలాంటి
    పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కాపులు వేచి చూస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో ఎంత లేదన్నా.. పొత్తుల గురించే డిస్కషన్ ఉంటుందన్న వాదన ఉంది.

    ఈ నేపథ్యంలో పవన్ .. గత చేదు అనుభవంతో ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. అదే జరిగితే అనంతపురం కచ్చితంగా ఎంచుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీతో పొత్తు దాదాపు ఖరారైందన్న ప్రచారంతో .. అనంతపురం సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చర్చ సాగుతోంది. దీంతో ఈ స్థానం నుంచి పోటీకి దిగాలని భావిస్తోన్న టీడీపీ నేతలు ఆశలు వదులుకున్నట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

    ఈ కోవలోకే ప్రభాకర్ చౌదరి వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అనంతపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా చౌదరి ఉన్నారు. ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. అయితే గత కొన్ని రోజులు అర్బన్ టీడీపీలో విబేధాలు చాలా బలంగా ఉన్నాయి. జేసీ పవన్ రెడ్డి గ్రూప్ అంటూ కొందరు చీలిపోయారు. వీరంతా గతంలో చౌదరి వద్ద ఉన్న వారే. వీరిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం ఆందోళన కల్గించే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేసినా.. చౌదరికి టికెట్ రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా జేసీ ఫ్యామిలీ ఉంది. మరోవైపు టీడీపీలోని బలిజలు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వారు కూడా చౌదరికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎవరు ఎంత బలంగా ఉన్నా.. చౌదరికి కాకుండా ఇక్కడ టీడీపీ టికెట్ మరొకరికి ఇస్తే.. వారి పని మటాష్ అనే టాక్ బాగా ఉంది. ఇవన్నీ పక్కన బెడితే అనంతపురం నియోజకవర్గంలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.

    వైసీపీలో కూడా విబేధాలు ఉన్నా.. ఎన్నికల సమయంలో వారు పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం చాలా తక్కువ. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో అధిష్టానంలోనూ కన్ఫూజన్ ఉంది. అందుకే చౌదరి తన చతురతను ప్రదర్శించారు. జనసేనతో పొత్తు ఉండి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అడ్డుపడే శక్తి చౌదరికి లేదు. గెలుపును కూడా ఆపలేరు. సరిగ్గా ఇక్కడే యుద్ధనీతిని ప్రదర్శించారని విశ్లేషకులు సైతంవ్యాఖ్యానిస్తున్నారు.

    • పవన్ వస్తే గెలవడం ఖాయం..

    చౌదరి వ్యాఖ్యలపై కొందరు .. చౌదరి చేతులెత్తేశారని కామెంట్స్ చేసినా.. ఆయన తెలివిని పసిగట్టలేకపోతున్నారు. ఇక్కడ ఒకవేళ పవన్ రాని పక్షంలో చౌదరి పార్టీకి విధేయుడన్న ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఆయనకు టికెట్ వచ్చే అవకాశాల్ని మరింత మెరుగు పరుచుకున్నారు. పవన్ వస్తే గెలవడం ఖాయం.. కాబట్టి ఆ విజయంలో ఎంతో కొంత క్రెడిట్ చౌదరికి దక్కే అవకాశం ఉంటుంది.

    ఒకవేళ పవన్ రాకున్నా .. పవన్ కు మద్ధతుగా నిలవడం వల్ల స్థానిక వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపించే అవకాశం ఉంది. అంటే .. పవన్ పోటీ చేస్తే, ఈయన పవన్ కు మద్ధతు ఇచ్చినట్లే, పవన్ రాకుంటే తానే గనుక పోటీ చేస్తే, తనకు పవన్ కు మద్ధతిచ్చిన వర్గాల నుంచి మద్ధతు లభిస్తుందన్నదే ఈయన రాజకీయ వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో పవన్ పోటీకి దిగకపోతే, చౌదరి గెలుపు పక్కా చేసుకుంటున్నారని వీరంతా అంటున్నారు.

    ఒకవేళ పవన్ పోటీకి దిగినా, సెగ్మెంట్లో ఆయనకు పాజిటివ్ టాక్ మిగిలిపోతుందని తెలుస్తోంది. దీంతో అయితే పోటీకి ఛాన్స్, లేకుంటే, పాజిటివ్ టాక్ .. రెండూ ఆయనకు ప్లస్ కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభాకర్ చౌదరి చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక చాలా వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    దీంతో అనంతనాట చౌదరి రాజకీయం .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ వచ్చినా, రాకున్నా .. తన పట్టు వదులుకోకుండా .. చౌదరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే ఈ వ్యూహం .. స్థానిక నేతల్ని ఏమాత్రం చౌదరికి మద్ధతు పలికేలా చేస్తుందన్నదీ చర్చనీయాంశంగా మారింది.

    ఎందుకంటే, ఈ సామాజిక వర్గాల్లోని ఓటర్లు .. తమ సొంత రాజకీయ పార్టీలను .. వదలి, చౌదరికి ఏమాత్రం మద్ధతు పలుకుతాయన్నదీ తేలాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. పవన్ పోటీ చేస్తే, గెలిపించుకుంటాము గానీ .. పవన్ కోసం వేరెవరికో ఓటు వేస్తామని వీరెవ్వరూ చెప్పకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    మరి ప్రభాకర్ చౌదరి మంత్రాంగం ఏమేరకు కలిసివస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    Must Read

    spot_img