Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నదెవరు…?

ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నదెవరు…?

  • ఖలిస్తాన్ ఉద్యమకారులే ఈ దాడులు చేస్తున్నారా..?
  • ఆస్ట్రేలియా ప్రభుత్వం, పోలీసులు ఈ దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారా..?
  • హిందూ ఆలయాలపై దాడుల తర్వాత ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి..?
  • ఇంతకూ ఈ దాడులకు కారణం ఏంటి..?
  • ఖలిస్తాన్ రెఫరెండం ఇరు వర్గాల మధ్య చిచ్చురేపిందా…?

ఈ ఏడాది జనవరి నుంచి మెల్‌బోర్న్‌ భారతీయ సమాజంలో ఉద్రిక్తతలు పెరిగాయి. మూడు హిందూ ఆలయాల ధ్వంసం తరువాత హిందువులు, సిక్కుల మధ్య కొట్లాటలు జరిగాయి. జర్నయిల్ సింగ్ బింద్రన్‌వాలే చిత్రాన్ని కొందరు హిందూ యాక్టివిస్ట్‌లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమకారులకు మద్దతిచ్చేవారు నిర్వహించే దుకాణాలను బహిష్కరించాలని మెల్‌బోర్న్‌లో పిలుపును ఇస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ రాష్ట్రం విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆస్ట్రేలియాలో భారతీయుల జనాభా ఎక్కువగా ఉన్న రెండో నగరం మెల్‌బోర్న్. సిక్కులు, పంజాబ్ నుంచి వచ్చిన ఇతరులు మెల్‌బోర్న్‌లో పెద్దసంఖ్యలో ఉన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ వరుస సంఘటనలు ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధం లేని అనేక మంది సిక్కులకు ఆగ్రహం తెప్పించాయి.

‘ఖలిస్తాన్ రిఫరెండం పూర్తిగా అర్థరహితం. ఆస్ట్రేలియాలోనే కాదు… భారత్ సహా ప్రపంచంలో ఎక్కడ కూడా మెజారిటీ సిక్కులు ఈ ఉద్యమాన్నిపట్టించుకోవడం లేదు. మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా కుటుంబాలతో మేం బిజీగా ఉన్నాం. విలువైన మా సమాయాన్ని, శక్తిని, డబ్బును విధ్వంసకర ఆలోచనల కోసం ఖర్చు చేయలేం’ అన్నారు మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న పంజాబీలు..1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల వల్ల కలిగిన తీవ్ర వేదనను అనుభవిస్తున్న వారంతా మళ్లీ అలాంటివి కోరుకోరని వెల్లడించారు.. మంచి జీవితం, భవిష్యత్తు కోసం ఆస్ట్రేలియా వచ్చామని.. ఖలిస్తాన్ లాబీ ఇక్కడ పెరుగుతుండడం విపత్కరమే. మత అతివాదమనేది ఏ దేశానికైనా మంచిది కాదని ఆస్ట్రేలియాలోని అత్యధిక మంది సిక్కులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు..

  • జనవరి 12న మిల్‌పార్క్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని కొందరు స్వల్పంగా పాడు చేశారు..

గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు, బొమ్మలు గీశారు. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో జనవరి 16న కారమ్ డౌన్స్‌లో శివ విష్ణు ఆలయంలోనూ ఇలాగే చేశారు. జనవరి 23న ఆల్బర్ట్ పార్క్ ఇస్కాన్ టెంపుల్‌పై దాడి జరిగింది. ఇదంతా అక్కడి హిందూ సమాజంలో చర్చనీయమవడంతో పాటు భారతీయ
మీడియాలోనూ వచ్చింది. విక్టోరియా రాష్ట్ర పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అయితే, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ అనుకూల గ్రూప్ ‘సిక్స్ ఫర్ జస్టిస్ ‘ దీనికి కారణమన్న అనామానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రూప్‌పై భారతదేశంలో నిషేధం ఉంది. జనవరి 29న మెల్‌బోర్న్‌లో ఎస్ఎఫ్‌జే ఆధ్వర్యంలో రెఫరెండం నిర్వహించారు. కానీ ఎస్ఎఫ్‌జే మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

‘సిక్కుల్లో ఎవరి అభిప్రాయం వారికి ఉంది. రిఫరెండంలో పాల్గొన్నవారికీ సొంత అభిప్రాయాలున్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ వ్యవహారాలన్నిటితో ఆస్ట్రేలియాలోని సాధారణ సిక్కులకు ముడిపెడుతున్నారు. ఇది మమ్మల్ని అప్రతిష్టపాల్జేయడానికే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెల్‌బోర్న్‌లోని సిక్కులు.. ఖలిస్తాన్ మరో కశ్మీర్ అవుతుంది. పాకిస్తాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.. కొందరు సిక్కులు రెఫరెండం కోసం ఆస్ట్రేలియా సిక్కులను తప్పుదారి పట్టిస్తున్నారు. చాలామంది సిక్కులు చిన్న వయసులోనే అంతర్జాతీయ విద్యార్థులుగా ఇక్కడికి వస్తున్నారు.

ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ శాశ్వత నివాసం పొందడంలో ఎస్‌ఎఫ్‌జే వారికి సహకారం అందిస్తూ వారిని ఉద్యమం వైపు ప్రేరేపిస్తోంది.. అయితే, ఖలిస్థాన్‌కు గట్టి మద్దతుదారు అయిన మెల్‌బోర్న్‌కు చెందిన సిక్కు కుల్‌దీప్ సింగ్ బస్సీ మాత్రం పాకిస్తాన్ అండదండలున్నాయన్న వాదనను తిరస్కరించారు. ‘పాకిస్తాన్ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. వారు ఖలిస్థాన్‌కు ఎలా మద్దతిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేశారు..

  • ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనవరి 29న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను ఖండించారు..

తాజా ఘటనలు ఆస్ట్రేలియాలో నివసించే హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపాయా అంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడుల విషయంపై లోతుల్లోకి వెళ్లదలచుకోలేదని.. శాంతి సామరస్యం కోసం విజ్ఞప్తి చేయాలని, వివాదాన్ని పోలీసులకు వదిలేయాలని కొందరు కోరుకుంటున్నారు.. తమ గురువు మార్గదర్శనమే అన్నిటినీ అధిగమించేలా చేస్తుందని పలువురు సిక్కులు భావిస్తున్నారు.. ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు లేవని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు..

ఆలయాలపై దాడుల ఘటనల తర్వాత కూడా గురుద్వారలకు హిందువులు వస్తున్నారని చెబుతున్నారు.. అంతేకాదు.. ఎలాంటి శత్రుత్వాలు పెంచుకోవద్దని హిందువులు, సిక్కులు ఇద్దరినీ కోరుతున్నారు.. అయితే.. ఈ ఘటనల తర్వాత రెండు మతాలకు చెందిన మధ్య గతంలో ఉన్న మాదిరిగా సంబంధాలు లేవని.. అవి దెబ్బతిన్నాయని పలువురు భావిస్తున్నారు.. మరోవైపు… ఖలిస్తాన్ డిమాండ్ కు హిందువులు, వారి ఆలయాలతో సంబంధం లేదని.. హిందువులతో కూడా తమకు ఎలాంటి శత్రుత్వం లేదని… స్థానిక దుర్గామాత ఆలయానికి విరాళాలు ఇస్తుంటారని చెబుతుండటం విశేషం..

మెల్‌బోర్న్‌లో శివవిష్ణు ఆలయాన్ని ఆయన సందర్శించి ఆ తరువాత ట్వీట్ చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టిమ్ వాట్స్ కూడా మెల్‌బోర్న్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడి కమిటీ సభ్యులతో మాట్లాడి ఇటీవలి ఘటనలపై వివరాలు తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ.. హిందువుల ఆలయాలపై దాడుల విషయం మాత్రం ఇరు వర్గాల ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఉన్నతాధికారులకు ఉంది.. మరి చూడాలి.. ఇప్పటికైనా హిందూ ఆలయాలపై దాడులు జరగకుండా చూస్తారో లేదో..

ఆస్ట్రేలియాలో కొంతకాలంగా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.. ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ.. దాడులు చేసిందెవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.. ఖలిస్తాన్ రెఫరెండమే హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం చూపిందనే దానిపై చర్చ జరుగుతోంది..

Must Read

spot_img