HomePoliticsఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు..?

ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు..?

ఏ ఇద్దరు నేతలు గానీ కార్యకర్తలు గానీ కలిస్తే, ఇదే చర్చ సాగుతోందట. మునుగోడు దెబ్బకు సైలెంటైన ఆయన .. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలకు తెర లేపడంతో, నెక్ట్స్ స్టెప్ ఎటువైపు అన్నదే ఆసక్తికరంగా మారింది.

ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ మీటింగ్ పైన టీపీసీసీలో ఆసక్తి కర చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికలకు నెల ముందు మాత్రమే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేసారు. మంత్రి పదవికే రాజీనామా చేసిన తనకు పార్టీ పదవులు ముఖ్యం కాదన్నారు. మునుగోడు ఫలితం వేళ పార్టీలో కొందరు నేతలకు టార్గెట్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మునుగోడు ఫలితం తరువాత నెమ్మదించారు. దూకుడు తగ్గించారు.

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ టాపిక్‌గా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయం నుంచీ ఆయన తీరు.. ఇటు పార్టీలోనూ.. అటు నియోజకవర్గంలోనూ.. చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత ఖర్గేతో భేటీ అయ్యారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. వెంకటరెడ్డి సైతం తన సోదరుడి గెలుపు ఖాయమనే ధీమాతో కనిపించారు. కానీ, ఫలితం రివర్స్ అయింది. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా నియమించిన కమిటీల్లోనూ వెంకటరెడ్డికి స్థానం దక్కలేదు. ఈ సమయంలో వెంకటరెడ్డి డిల్లీలో నేరుగా మల్లిఖార్జన ఖర్గేతో భేటీ అయ్యారు.

రేవంత్ లక్ష్యంగా అడుగులు వేసిన వెంకటరెడ్డికి.. తాజాగా పార్టీ కమిటీల్లో ఎలాంటి బాధ్యతలు లేకుండా అధినాయకత్వం జలక్ ఇచ్చింది.

దీని పైన వెంకటరెడ్డి తన సహజ ధోరణికి భిన్నంగా స్పందించారు. ఇప్పుడు ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో పార్టీని సీనియర్లు ఎందుకు వీడుతున్నారనే అంశం పైన ఖర్గేకు వెంకటరెడ్డి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వరుసగా సీనియర్లు పార్టీలో ఉండలేకపోవటం వెనుక పార్టీని లీడ్ చేస్తున్న కొందరు ముఖ్య నేతల తీరు కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీ వీడిన నేతలు సైతం చెప్పిన అంశాలను వెంకటరెడ్డి వివరించారు. పార్టీ పైన ప్రజల్లో ఆదరణ ఉన్నా.. నాయకత్వంలో మాత్రం
లోపం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కమిటీల నియామక విషయంలోనూ వస్తున్న స్పందనలను ఖర్గేకు వివరించినట్లు సమాచారం.
అయితే, ఖర్గే మొత్తం వెంకటరెడ్డి ఇచ్చిన సమాచారం సేకరించటంతో పాటుగా కొన్ని అంశాల పైన ఆరా తీసారని తెలుస్తోంది. వెంటకరెడ్డి పార్టీకి ఏ విధంగా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని ఖర్గే ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు పార్టీలో రేవంత్ నిర్ణయాలకు ఢిల్లీ కేంద్రంగా హైకమాండ్ పెద్దలు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నియిమించిన కమిటీల్లోనూ ఇదే అంశం స్పష్టమైంది. దీంతో, నేరుగా ఏఐసీసీ పెద్దల నుంచే పార్టీలో తన స్థానం సుస్ధిరం చేసుకోవాలని వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీలో ఏ పదవి ఇవ్వకపోవటం ద్వారా వెంకటరెడ్డి పై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉందనే సంకేతాలు ఇవ్వటంలో వెంకటరెడ్డి వ్యతిరేక వర్గం సక్సెస్ అయింది. ఇప్పుడు ఏఐసీసీలో తనకు ఉన్న పట్టు నిరూపించుకుంటూ.. పార్టీలో మరోసారి తన సత్తా చాటాలనేది వెంకటరెడ్డి వ్యూహం. దీని కోసం ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కోమటిరెడ్డి కొత్త అడుగులు వేస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో కోమటిరెడ్డి వర్సస్ రేవంత్ మద్దతు శిబిరం మధ్య కొత్త రాజకీయం చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో ప్ర‌ధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఖ‌రారైంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ న‌డ‌క‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌మ్ముడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం రాజ‌గోపాల్‌రెడ్డి అన్న వెంక‌ట‌రెడ్డి రాజ‌కీయంపై తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల 18 మంది నేత‌ల‌తో తెలంగాణ కాంగ్రెస్ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఏర్పాటైంది. ఈ క‌మిటీల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి చోటు దక్కకపోవడం ఆయనకు షాక్ ఇచ్చిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గేను కోమ‌టిరెడ్డి క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త్వ‌ర‌లో జాతీయ స్థాయిలో వెంక‌ట‌రెడ్డికి కీల‌క ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కాంగ్రెస్‌కు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తరపున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నం చేయని వెంకటరెడ్డి.. పరోక్షంగా తమ్ముడికి సహకారం అందించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఏఐసీసీ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసుకు కూడా జారీ చేసింది.

కానీ ఆయన మాత్రం ఆ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇటీవల అధిష్టానం ప్రకటించిన తెలంగాణ పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు గల్లంతు అయ్యింది. షోకాజ్ నోటీసుకు స్పందించనందుకే ఆయనను పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. పార్టీని వీడాలని వెంకటరెడ్డి ఆలోచిస్తున్నారని.. అందుకే పార్టీ నోటీసు పంపించినా బేఖాతరు చేశారని వార్తలు వచ్చాయి. అయితే, వెంకటరెడ్డి అకస్మాతుగా బుధవారం ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోతుండటం వంటి అంశాలపై తాను ఖర్గేతో చర్చించానని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఖర్గేతో భేటీ అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తెలంగాణ నేతలతో కూడా త్వరలోనే కలిసి మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చారు. మోడీ, వెంకటరెడ్డి భేటీ తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఖర్గేను కలిసిన వెంకటరెడ్డి.. మోడీని ఎందుకు కలుస్తున్నారనే ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని మోడీ దృష్టికి వెంకటరెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. నమామి గంగా తరహాలో నమామి మూసీ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఆయన మోడీని కోరతారని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ అంశాన్ని కూడా మోడీ వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. కాంగ్రెస్అ ధ్య‌క్షుడు ఖ‌ర్గేతో జ‌రిగిన స‌మావేశం అసంతృప్తిని మిగిల్చింద‌ని, అందుకే వెంక‌ట‌రెడ్డి బీజేపీలో చేరేందుకు నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. త‌మ్ముడి మాదిరిగానే అన్న కూడా త్వ‌ర‌లో బీజేపీ కండువా క‌ప్పు కుంటార‌ని వీరంతా అంటున్నారు. ఈ పరిణామల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌లోనే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వెంకటరెడ్డి పార్టీ మారరని.. ఏఐసీసీ పెద్దల ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఎన్నికల టైంలో పార్టీ మార్పుపై ప్రకటిస్తానన్న కోమటిరెడ్డి .. అప్పటివరకు కాంగ్రెస్ లోనే ఉంటారని విశ్లేషకులు సైతం అంటున్నారు.

మరి కోమటిరెడ్డి దారెటు అన్నది తేలాలంటే, నగారా మ్రోగాల్సిందేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img