Homeసినిమా‘ఏజెంట్’ అఖిల్ ఎప్పుడు రాబోతున్నాడు…?

‘ఏజెంట్’ అఖిల్ ఎప్పుడు రాబోతున్నాడు…?

అఖిల్ అక్కినేని ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనమడు, నాగార్జున తనయుడు. సినీ ఇండస్ట్రీలోకి తన బాల్యంలోనే సిసింద్రీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా క్లిక్ అవ్వలేక పోయాడు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా వరస పరాజయాల్లో ఉన్న అఖిల్ ఓ మంచి కథతో అందరి మనసులు దోచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటీ వరకు సాప్ట్ గా, లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు.

తాజాగా ఏజెంట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం మూవీ విడుదలకు సిద్దంగా ఉందని వచ్చు వేసవిలో తన మూవీతో అందరిని కూల్ చేయనున్నట్లు తెలుస్తుంది. భారీ అంచనాలతో విడుదలకు సిద్దమౌతున్న ఈ మూవీలో అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. గత ఇటీవల మేకింగ్ వీడియోను విడుదల చేయగా…తాజాగా మహా శివరాత్రి సందర్భంగా యూనిట్ ఆడియెన్స్ కు, అక్కినేని ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. దాంతోపాటు క్రేజీ అప్డేట్ కూడా అందించారు. త్వరలోనే చిత్రం నుంచి మరో అప్డేట్ రాబోతుంది.. ఈసారి మ్యూజిక్ బ్లాస్ రాబోతుందని అనౌన్స్ చేశారు. వచ్చే ఏఫ్రియల్ నెలలో సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ ఈ చిత్రం.

ఇంతకు ముందున్న సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఈ మూవీ ఉండబోతుంది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న మంచి కథను ఎంచుకోని తనకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డట్లు చిత్ర యూనిట్ చెప్తుంది. ఈ ఏజెంట్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుందని సమాచారం. అఖిల్ క్యారెక్టర్ పై రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలనున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. సినిమా కోసం డైట్ ఫాలో అవుతూ…ఎక్కువగా వర్క్ అవుట్ కూడా చేశారట.

ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే అందరి చూపు తన వైపు తిప్పుకుని సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ లో నిలిచారు. మొత్తంగా ఏజెంట్ మూవీ కోసం అఖిల్ పడుతున్న కష్టం చూసి నెట్టిజన్లు, ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. సురేందర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఏజెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. ఇందులో ప్రముఖ నటుడు మమ్మట్టి కీలక పాత్ర పోషించారు. మేకింగ్ వీడియోను గమనిస్తే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం ఏ విధంగా కష్టపడ్డారనేది ఇందులో చూపించారు. అంతేకాకుండా అఖిల్ స్టంట్లు కూడా మూవీకి హైలెట్ గా నిలుస్తాయని అంచనా. అఖిల్ లుక్ అల్ట్రా స్ట్రైలిష్‌గా, హాలివుడ్ హీరోగా ఉండటమే కాకుండా.. అటు మాస్ ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ పవర్ ప్యాక్‌గా ఈ సినిమా రాబోతంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడిందీ ఈ చిత్రం.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

Must Read

spot_img