Homeఅంతర్జాతీయంచంద్రుడి మరో వైపు ఏమి జరుగుతోంది..?

చంద్రుడి మరో వైపు ఏమి జరుగుతోంది..?

చంద్రుడికి అవతలి వైపున చీకటి భాగంలో ఏం జరుగుతోందనే విషయంపై పరిశోధనలు ఊపందుకున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనాల సంస్థ నాసా ఇటీవలే చేపట్టిన ఆర్టిమిస్ చంద్రమండల యాత్ర ప్రాజెక్టులో మొదటి రాకెట్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆర్టెమిస్1 చంద్రుడికి అత్యంత దగ్గరగా పరిభ్రమిస్తూ అక్కడి విశేషాలను భూమికి చేరవేస్తోంది. ఇక రాబోయే సంవత్సరం జరగనున్న ఆర్టెమిస్2 రాకెట్ మానవసహిత యాత్రగా ఉండబోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం…

వీటిని నాసా శాస్త్రవేత్తలు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేశారు.

చంద్రుడికి అత్యంత సమీపం నుంచి ఈ ఫొటోలను తీసింది ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో నాసా మరో మిషన్‌ను చేపట్టింది. ఆర్టెమిస్ 1కు సీక్వెల్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. దానిని ఆర్టెమిస్ 2 మిషన్‌ అని ప్రకటించింది. ఇది మానవ సహిత మిషన్. చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి నలుగురు వ్యోమగాములను అక్కడికి పంపించనుంది. వచ్చే సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్‌లో ఆ నలుగురు ఆర్టెమిస్ 2 రాకెట్ ద్వారా చంద్ర మండలానికి చేరుకుంటారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై ల్యాండ్ కావడం గానీ, కక్ష్యలోకి అడుగు పెట్టడం గానీ చేయదు. చంద్రుడి బాహ్య కక్ష్యకు వెలుపలే తిరుగుతూ అక్కడి డేటాను సేకరిస్తుంది. ఈ మిషన్ కూడా దాదాపుగా ఆర్టెమిస్1ను పోలి ఉంటుంది. అది మానవ రహిత మిషన్.

ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతూ అక్కడి డేటా, ఫొటోలను నాసా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఆర్టెమిస్ 2 ద్వారా మానవ సహిత మిషన్‌ను చేపట్టింది నాసా. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. జెరెమీ హాన్సెన్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైస్‌మన్ క్రిస్టినా హమ్మక్ కోచ్‌ను నాసా ఎంపిక చేసింది. వీరిలో క్రిస్టీనా ఆఫ్రికన్-అమెరికన్. అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికన్ మూలాలు గల మహిళ. ఒక అంతరిక్ష ప్రయోగం కోసం ఆఫ్రికన్-అమెరికన్ మహిళను ఎంపిక చేయడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టెమిస్ 2 ఫ్లైట్ టెస్టింగ్‌ను ఇంకో 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు నాసా తెలిపింది. దాదాపుగా 50 ఏళ్ల తరువాత తొలిసారిగా మానవుడు మరోసారి చంద్రుడి వద్దకు వెళ్లబోతున్నాడు. వారి యాత్రలో అమెరికా నుంచి తొలి మహిళ కూడా ఈ టీంలో ఉండనుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్టెమిస్ 2 జాబిలి వద్దకు వెళ్లనుంది.

కెనడాకు చెందిన జెరెమీ హాన్సెస్ మిషన్ స్పెషలిస్టుగా, యూఎస్ నేవీ ఫైటర్ పైలెట్ రీడ్ వైస్ మాన్ కమాండర్ గా ఈ మిషన్ లో పనిచేయనున్నారు. ఆర్టెమిస్ I మిషన్ విజయవంతంగా డిసెంబర్ 2022లో పూర్తయింది. మానవ రహితంగా సాగిన ఈ యాత్ర తర్వాత ఆర్టెమిస్ 2 మనుషులతో చంద్రుడి కక్షలోకి వెళ్లనున్నారు. ఆర్టెమిస్-2 మొత్తం 10 రోజుల మిషన్. 2024లో నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి మాత్రమే తీసుకెళ్లడం జరుగుతుంది. వారు చంద్రుడిపై పాదం మోపే అవకాశం ఉండదు. అలా పది రోజుల తరువాత వారిని తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలన్నది నాసా ప్లాన్. ఇది విజయవంతం అయిన తర్వాత ఆర్టిమిస్ -3 ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది.

జులై 16, 1969 మానవ చరిత్రలో అత్యద్భుత ఘట్టం.

ఈ విశ్వంలో భూమి తర్వాత మరో ఖగోళంపై మనిషి కాలుపెట్టిన సందర్భం. 1972లో నాసా.. చందమామపై అపోలో మిషన్ ప్రయోగాలను ఆపేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ ద్వారా చందమామపైకి వ్యోమగాముల్ని పంపించనుంది. సూర్యాస్తమయం కాగానే… ఆకాశంలో అల్లంత దూరాన మెరుస్తు కనిపిస్తుంది చందమామ. జాబిల్లిని అందుకోవాలని అందరికీ ఉంటుంది. ఈ కలను నాసా అపోలో మిషన్ సాకారం చేసింది. 1969 నుంచి 1972 వరకూ అపోలో మిషన్లలో వ్యోమగాములు చందమామను చేరి.. అక్కడి మట్టి, రాళ్లను భూమికి తెచ్చారు. నిధుల కొరతతో 1972లో ఈ ప్రయోగాలకు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు నాసా.. ఆర్టెమిస్ మిషన్ ద్వారా చందమామ చెంతకు వ్యోమగాముల్ని పంపుతోంది. అందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

Must Read

spot_img