- గతేడాది అనుసరించిన విధానాన్నే ఈసారి పవన్ ఫాలో కానున్నారా..?
- ఈ దఫా ఎన్నికల్లో రెండుచోట్ల పోటీకి జనసేనాని సై అంటున్నారా..?
- ఇంతకీ ఈసారైనా పవన్ గెలుపు గుర్రం ఎక్కుతారా..?
- ఇంతకీ పవన్ పోటీ చేయాలనుకుంటోన్న సెగ్మెంట్లేవి..?
- వాటి పరిస్థితి ఏమిటి..? వీటిలో పవన్ గెలుస్తారా లేదా..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో త్వరలో వెయ్యబోతున్న అడుగులు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఉండనుంది. అలాంటి స్థానం లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన వోట్ షేర్ 2019 ఎన్నికలతో పోలిస్తే మూడింతలు పెరిగిందని లేటెస్ట్ గా వచ్చిన సర్వేలు చెబుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి తెలుగు దేశం పార్టీ అంతలా పరితపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబొయ్యే స్థానాలు దాదాపుగా ఫిక్స్ అయ్యిపోయినట్టే అని జనసేన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం ప్రాంతాల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈసారి వెయ్యబోయే అడుగులు ఆచి తూచి వెయ్యనున్నారు. గతం లో లాగానే ఈసారి కూడా ఆయన రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారట. ఇందుకు సంబందించిన గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభం అయ్యినట్టు సమాచారం. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నుంచి పోటీ చెయ్యబోతున్నట్టు సమాచారం. వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తుతం ఈ స్థానం లో సిట్టింగ్ MLA గా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూడా ఆయన ఇక్కడి నుండే పోటీ చెయ్యబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చిన ఈ స్థానం నుండి ఈసారి అవలీల గా గెలుస్తారని, ఒకవేళ పొత్తు ద్వారా వస్తే కనీవినీ ఎరుగని రేంజ్ మెజారిటీ తో గెలుస్తారని రిపోర్ట్స్ అందాయట. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబొయ్యే రెండో స్థానం పిఠాపురం. ఈ స్థానం నుండి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ నుండి ఎవరు పోటీ చేసిన గెలిచేస్తారని సర్వే రిపోర్ట్స్ చెప్తుతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానం లో వైసీపీ MLA పెండెం దొరబాబు సిట్టింగ్ MLA గా ఉంటున్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలుస్తారని అంటున్నారు.
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పోటీ చెయ్యబొయ్యే స్థానాల గురించి అధికారిక ప్రకటన చేస్తారట. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి అదే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాదు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలు కూడా సిద్దమైపోయాయి. తాజా సమాచారం మేరకు ఆ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఈసారి పోటీ చేస్తే రెండు చోట్ల నుంచి గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు స్ధానికంగానే అంచనాలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో పాతికేళ్ల రాజకీయమంటూ జనసేన పార్టీ పెట్టి తొలిసారి పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. రెండోసారి ఎన్నికల్లో మాత్రం జనసేనను ఒంటరిగా బరిలోకి దింపి.. తాను రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓటమితో సరిపెట్టుకున్నారు. దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో పవన్ ఏం చేయబోతున్నారన్న ఆసక్తి పెరుగుతోంది.
అదే సమయలో రాష్ట్రంలో కాపు సీఎం డిమాండ్ కూడా అంతకంతకూ ఊపందుకుంటోంది. ఎప్పుడూ కమ్మ, రెడ్లేనా.. ఈసారి కాపులకు రాజ్యాధికారం దక్కాల్సిందేనన్న పట్టుదల ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. దీంతో పవన్ అడుగులకు ప్రాధాన్యం పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. తన పోటీ కోసం రెండు నియోజకవర్గాలు ఎంచుకున్నారు. వీటిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాగా.. మరొకటి విశాఖ జిల్లా గాజువాక. ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఒక్క చోట కూడా పవన్ గెలవలేదు.
దీంతో ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే రెండు నియోజకవర్గాల నుంచి పోటీకే పవన్ మరోసారి మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా గోదావరి జిల్లాల నుంచే ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కన్నబాబును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ వైసీపీపై విమర్శలు చేసినప్పుడల్లా కౌంటర్లు ఇస్తున్న కన్నబాబు.. నేరుగా పవనే తనకు ప్రత్యర్దిగా ఎదురైతే ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.
అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా లేకున్నా కాకినాడ రూరల్ లో పవన్ గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది. కాకినాడ రూరల్ తో పాటు పిఠాపురం కూడా కన్ఫమ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సిట్టింగ్ గా ఉన్నారు. ఆయన ఆరోగ్య కారణాలతో పోటీకి దూరమైతే తాను బరిలో ఉండాలని కాకినాడ ఎంపీ వంగా గీత సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పవన్ పోటీకి దిగితే వంగా గీత రాకపోవచ్చని
అంటున్నారు. కాకినాడ రూరల్, పిఠాపురం రెండు నియోజకవర్గాల్లో పవన్ ఒకేసారి పోటీ చేస్తే కచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న మూడు కొత్త జిల్లాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తున్న రెండు కొత్త జిల్లాల్లోనూ ఆ ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఏపీలో జనసేనను ఈ సారి ఎలాగైనా గెలిపించాలని పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఉండే వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు అవసరం అయితే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఈ సారి ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
తాను గెలవడమే కాకుండా.. తాను పోటీ చేసే నియోజకవర్గాల వల్ల మరి కొందరు జనసేన అభ్యర్థులను కూడా గెలిపించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల నుంచే ఈ సారి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బరిలో ఉంటే మరి కొన్ని నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇప్పటికే రెండు నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.
గతంలో చిరంజీవి కుటుంబానికి దగ్గరగా ఉన్న కన్నబాబు.. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు వైసీపీ మీద విమర్శలు చేసినా కన్నబాబు తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పడు పవన్ కల్యాణే తనకు రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి అయితే ఏం చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల కాకినాడ జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు.. కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆ రెండింటినీ సెలెక్ట్ చేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోవడం పవన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. తరచూ వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు
చేస్తుంటారు. ఈ సారి కనుక చట్ట సభకు ఎన్నిక కాకపోతే పార్టీని నడిపించడం కష్టం అని పవన్ భావిస్తున్నారు. అందుకే సేఫ్‌గా ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకొని..గెలుపు కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ దఫా పవన్ కు విజయం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే..