ఏపీలో వంగవీటి, లోకేష్ భేటీ
ఏపీలో వంగవీటి, లోకేష్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. దీంతో వంగవీటి నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ భేటీకి కారణమేమిటి..? దీనిపై రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి..?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి తెలుగు దేశం పార్టీ .. జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు .. కానీ ఈ రెండు పార్టీల పొత్తు ఖరారు అనే ప్రచారం ఉంది. ఓ వైపు పొత్తు ఉంటుందనే సంకేతాలు అందుతుంటే మరోవైపు టీడీపీ నేతలు కొందరు జనసేనలోకి చేరుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో మొదట వంగవీటి రాధా పేరే ప్రముఖంగా ఉంది.
రేపో..మాపో ఆయన జనసేన కండువా కప్పుకుంటారు అంటూ ప్రచారం జరిగింది. మొదట కన్నా లక్ష్మీ నారాయణ, వంగ వీటి రాధా ఇద్దరూ జనసేనలో చేరడం ఖాయమన్నారు. కానీ కన్నా టీడీపీలో చేరారు.. రాధా మాత్రం తన నిర్ణయం ఏంటన్నది ఎక్కడా బయటపడడం లేదు. ఆ వార్తల నేపథ్యంలో తాజాగా రాధా నారా లోకేష్ ను కలవడం హాట్టా పిక్ అయ్యింది. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారా
లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వంగవీటి రాధ పాల్గొన్నారు.. అనుకోకుండా రాధా ఈ పాదయాత్రలో పాల్గొనడం వెనుక పెద్ద కథే ఉంది అంటున్నారు. కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా జనసేనకే ఉందనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో తనకు జనసేనే సరైన వేదిక అని రాధా భావించారని.. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మనసు మారింది అంటున్నారు.
ముఖ్యంగా కన్నా లక్ష్మీ నారాయణ సైతం జనసేనను కాదని.. టీడీపీలో చేరడం రాధాపైనా ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాధా సన్నిహితులు.. అనుచరులు సైతం జనసేనలో కంటే టీడీపీలోనే భవిష్యత్తు ఉంటుదని చెప్పడంతోనే ఆయన తన నిర్ణయం మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో.. వాటికి చెక్ పెట్టడానికే.. ఆయన ప్రత్యేకంగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వంగవీటి రాధా.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు.. ఇటు గుంటూరు.. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో రాధాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఓ ప్రధాన సామాజికవర్గం రాధాను ఓన్ చేసుకుంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అంతేకాదు.. తన తండ్రి రంగా ఇమేజ్, వంగవీటి అనే బ్రాండ్ రాధాకు పెద్ద ప్లస్ పాయింట్. అందుకే ఎన్నికలు దగ్గరకు వచ్చిన ప్రతీసారి రాధా పార్టీ మారతారనే ప్రచారం జరగడం కామన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన, వైసీపీ .. రాధా తమ పార్టీలో ఉండాలని కోరుకుంటాయి.
వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి రాధా దగ్గరి మిత్రుడు.
దీంతో వారిద్దిరిలో ఎవరినో ఒకరిని కలిసిన ప్రతీసారి రాధా తెలుగుదేశం పార్టీకి రాంరాం చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య వంశీని కలిసినప్పుడు రాధా పార్టీ మారడం ఖాయం అనే కామెంట్స్ వినిపించాయి. మళ్లీ ఇప్పుడు నానిని కలవడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఆ మధ్య రాధాపై రెక్కీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఆ సమయంలో.. కొడాలి నాని సీఎం జగన్‌తో మాట్లాడి రాధాకు భద్రత పెంచే విషయంపై మాట్లాడారు. వెంటనే స్పందించిన జగన్.. రాధాకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. రాధా తిరస్కరించారు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు సాధారణంగా మారాయి. అందరూ మర్చిపోతున్న టైంలో రాధా.. వల్లభనేని వంశీని కలిశారు. దీంతో
ఆయన మళ్లీ వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీనిపై రాధా ఎక్కడా స్పందించలేదు గానీ.. వంశీ, నాని మాత్రం.. తమ మిత్రుడు తమతో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇటు తెలుగుదేశం పార్టీలో రాధా యాక్టివ్‌గా ఉన్నారు. 2024లో బందరు ఎంపీగా కానీ.. విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. వైసీపీలోకి వచ్చినా.. ఈ రెండింట్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇప్పిస్తామని రాధా మిత్రులు హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా రాధాను వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. రాధా ఎక్కడ కోరితే అక్కడ పోటీ చేయించే యోచనలో టీడీపీ ఉందని
సమాచారం.
ఇప్పుడే కాదు.. 2019కి ముందే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. రాధా తిరస్కరించారని సమాచారం. ఈ క్రమంలో.. ఎప్పుడు వంశీని కలిసినా.. కొడాలి నాని కలిసినా.. రాధా పార్టీ మారొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. కేవలం వైసీపీలోనే కాదు.. జనసేన నేతలు కూడా రాధాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కూడా చాలాసార్లు వంగవీటి రంగా పేరును ప్రస్తావించి.. ఆయనపై అభిమానం చాటారు. అటు నాదెండ్ల మనోహర్ కూడా రాధాతో చర్చలు జరిపినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో మరోసారి వంగవీటి రాధా పొలిటికల్ జంక్షన్‌లో నిలబడ్డారనే చర్చ జరుగుతోంది. రాయలసీమ యాత్ర పూర్తైన తరువాత.. రెగ్యులర్ గా తాను కూడా
పాదయాత్రలో పాల్గొంటానని.. రాధా చెప్పినట్టు సమాచారం.. ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రాధా సేవలను వినియోగించుకోవాలని.. ఆయన సైతం లోకేష్ వెంట నడిస్తే కలిసి వస్తుందని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. అదే విషయం ఇద్దరి మధ్య చర్చకు వచ్చి ఉండొచ్చు అంటున్నారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇద్దరు కలిసి కొంతదూరం నడిచారు.. అనంతరం ఇద్దరు గంటసేపు సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటూ కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాధా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.. అయితే
ఇప్పటికే అక్కడ టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఉమా పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.. ఆయనకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఉమా అంశంపై రాధాతో చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇస్తామని రాధాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తను ఇక నుంచి వారానికి రెండు సార్లు యువగళంలో పాల్గొంటానని రాధా చెప్పారు. కొద్దిరోజులుగా రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం
జరిగింది.. అయితే ఇంతలో లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది. వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన రాధా.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేయగా ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల సమయంలో రాధా టీడీపీ కండువా కప్పుకున్నారు. పోటీకి దూరంగా ఉన్న రాధా.. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడంతో టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది. రాధా జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు.. అలాగే అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా సభల్లో పాల్గొన్నారు. రాధా టీడీపీలోనే ఉన్నా సరే.. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లడం లేదు. అంతేకాదు ఇటీవల ఆయన నివాసం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి రాధాను పరామర్శించారు. ఆ తర్వాత వంగవీటి రాధా వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది కూడా రంగా విగ్రహం ఆవిష్కరణకు ఇద్దరితో కలిసి హాజరయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ మారతారని మళ్లీ ప్రచారం జరుగుతోంది.
ఇంతలో లోకేష్‌ను కలిశారు. మరి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.మరి వంగవీటి నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.