ఆధ్యాత్మికవేత్త దలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టడం కలకలం రేపింది.. పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు దలైలామాకు భద్రత పెంచారు.. ఇంతకూ దలైలామాపై నిఘా పెట్టిన మహిళ ఎవరు..? ఆమె ఏం చేయాలనుకుంది..?
దలైలామాపై చైనాకు చెందిన మహిళ నిఘా పెట్టడానికి గల కారణం ఏంటి..? చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందా..? దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దలైలామా ప్రస్తుతం బీహార్ లోని బోధ్ గయాలో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ సంచనల విషయం వెలుగులోకి వచ్చింది. దలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దలైలామాకు భద్రత పెంచారు. మహిళా గూఢచారి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. బోధ్గయాలో ఆమె పలు చోట్ల పర్యటించినట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అందరినీ అప్రమత్తం చేశారు. ఆమె ఫోటోతో పాటు పాస్పోర్ట్ నంబర్, వీసా వివరాలు కూడా పోలీసులు షేర్ చేశారు.
మిస్ సాంగ్ జియోలాన్ అనే చైనా మహిళను గురువారం సాయంత్రం బోధ్ గయలోని కాలచక్ర మైదాన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ బౌద్ధ సన్యాసి వేషంలో ఉంది. ఆమె 2020 సంవత్సరం నుంచి బోద్గ యలో ఉన్నారని లెలుస్తోంది. ఈ మధ్య నేపాల్‌కి కూడా వెళ్లింది. ఆమె చైనాలో వాలంటీర్‌గా పనిచేసేదంట. బోధ్‌గయాలోని గెస్ట్‌హౌస్‌లో చైనా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు గయా సిటీ ఎస్పీ అశోక్ప్ర సాద్ తెలిపారు. ఆమెను బోద్‌గయ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఆమె 2020 నుంచి భారతదేశంలో నివసిస్తుందంట. మహిళకు 2024 వరకు వీసా ఉంది. ప్రాథమికంగా చూస్తే ఏ గూఢచర్యానికి సంబంధించిన అంశం ఇంకా తెరపైకి రాలేదు. విచారణ జరుగుతోంది. మహిళ వయస్సు 50 సంవత్సరాలుగా పోలీసులు పేర్కొన్నారు.
కాగా, గురువారం నుంచి కాలచక్ర మైదాన్‌లో దలైలామా మూడు రోజుల ఉపన్యాసం ప్రారంభమైంది.
ఇక్కడ నుంచే చైనా మహిళను కూడా అరెస్టు చేయడమే గమనార్హం. గురువారం ఉదయం మహిళ గురించిన సమాచారం పోలీసులకు అందిన వెంటనే తొలి స్కెచ్ బయటపడింది. వెంటనే పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు.
సాయంత్రం, కాలచక్ర మైదాన్ సమీపంలో మహిళను పట్టుకున్నారు. నిజానికి, దలైలామా ఒక నెల బసలో ఉన్నారు. ఆయన బోధ్ గయలో మాత్రమే ఉంటారు. ఆయన కార్యక్రమానికి 50కి పైగా దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బౌద్ధ భక్తులు హాజరవుతారని అంచనా. దలైలామాపై గూఢచర్యం చేస్తున్న మహిళ గురించి వెల్లడైంది. ఉపన్యాస కార్యక్రమం ప్రారంభమైన తొలిరోజే ఈ వార్త తెరపైకి రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న తరువాత, పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పుడు మహిళ పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి అసలు
విషయం ఏంటనేది విచారణ తర్వాత తేలుతుంది.
బోధ్ గయాలోని కాల్చక్ర మైదాన్లో దలైలామా నేతృత్వంలో ఓ కార్యక్రమం జరగనుంది. 50 దేశాలకు చెందిన 2 లక్షల మంది బౌద్ధ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దలైలామా ప్రసంగం వినేందుకు మొదటి రోజే 40 వేల మంది తరలి వచ్చారు. మొత్తం మూడు రోజుల పాటు అక్కడే దలైలామా పర్యటన కొనసాగనుంది. చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో…వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి.
భారత్లోని బౌద్ధ సంస్థలన్నీ ఇదే మాటను ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరనసలూ చేపడుతున్నాయి. తన తరవాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి. అయితే అటు చైనా మాత్రం తరవాతి
దలైలామాను ఎంచుకునే హక్కు తమకు ఉందనివాదిస్తోంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెబుతోంది. నిజానికి…టిబెట్ చైనాలో
భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తోంది. అందుకే… దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది.
ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే…టిబెట్ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. మరోవైపు లద్దాఖ్ నుంచి ధర్మశాల వరకూ బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పు బడుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలన్నీ
చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దలైలామా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని, ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని అన్నారు. భారత్ తనకు శాశ్వత నివాసం అని వెల్లడించారు. “చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నాకు భారత్లో ఉండటమే ఇష్టం. ఇండియా నాకెంతో నచ్చింది. కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు. ఇదే నాకు శాశ్వత నివాసం” అని స్పష్టం చేశారు.
లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలకు మూడేళ్ల ముందు డోక్లాంలో కూడా రెండు దేశాల సైనికులు తలపడ్డారు.
తలపడ్డారు.భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిధి లద్దాఖ్, డోక్లాం, నాథులా మీదుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోయ వరకూ విస్తరించింది.అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం తమదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తవాంగ్‌ను టిబెట్‌లో భాగమని.. తవాంగ్, టిబెట్ సంస్కృతి, సంప్రదాయాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయని చెబుతోంది.తవాంగ్ బౌద్ధుల ప్రముఖ ఆరామం. దలైలామా తవాంగ్ ఆరామాన్ని సందర్శించిన సమయంలో కూడా చైనా ఆ పర్యటనను చాలా వ్యతిరేకించింది.ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినపుడు కూడా చైనా ఆయన పర్యటన గురించి అధికారికంగా వ్యతిరేకత తెలియజేసింది.
టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని చైనా చెబుతోంది. దానిని దక్షిణ టిబెట్ అంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది.1938లో ఏర్పాటు చేసిన మెక్‌మోహన్ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగం. చైనా టిబెట్‌ను 1951లోనే తన నియంత్రణలోకి తెచ్చుకుంది.
టిబెట్ జనం ప్రధానంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. ఈ మారుమూల ప్రాంతం ‘ప్రపంచానికి పైకప్పు’ అని కూడా పేరుంది.. చైనాలో టిబెట్ స్వయం ప్రతిపత్తి హోదా గల ప్రాంతంగా చెప్తారు. ఈ ప్రాంతంపై శతాబ్దాల నుంచి తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా చెబుతోంది. అటు టిబెట్ ప్రజలు చాలా మంది బహిష్కరణకు గురైన తమ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు అనుచరులుగానే ఉన్నారు. దలైలామాను ఆయన అనుచరులు గౌతమ బుద్ధుడి అంశగా చూస్తారు. చైనా మాత్రం ఆయన వల్ల వేర్పాటువాద ప్రమాదం ఉందని భావిస్తోంది. టిబెట్ చరిత్ర చాలా అల్లకల్లోలాలను చవిచూసింది.
ఒకప్పుడు అది స్వీయ పాలనలో ఉన్న అందమైన ప్రాంతం. కొన్నాళ్లు మంగోలియా రాజులు, మరి కొన్నాళ్లు చైనాలో బలమైన రాజవంశాలు ఆ ప్రాంతంపై అధికారం చెలాయించాయి. కానీ 1950లో చైనా ఈ ప్రాంతంలో తమ జెండా ఎగరేయాలని వేలాది సైనికులను పంపించింది. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలను అది స్వయంప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చింది.
మిగతా ప్రాంతాలను వాటి పక్కనే ఉన్న చైనా రాష్ట్రాల్లో కలిపేసింది. కానీ, 1959లో చైనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం కావడంతో దలైలామా టిబెట్ వదిలి భారత్‌ను శరణుకోరారు. భారతదేశంలో ఆయన ఒక ప్రవాస టిబెట్ప్ర భుత్వాన్నికూడా ఏర్పాటుచేశారు. 1960, 70వ దశకంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన సమయంలో టిబెట్‌లోని ఎన్నో బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. ఈ అణచివేత, సైనిక పాలన సమయంలో వేలాది టిబెటన్లు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.
చైనా, టిబెట్ మధ్య గొడవ.. టిబెట్ చట్టబద్ధ హోదాకు సంబంధించినది. టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది. కానీ టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని, తమపై చైనా అధికారం నిరంతరంగా లేదని చెబుతారు.. మంగోల్ రాజు కుబ్లాయ్ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ను ఆక్రమించింది.
కానీ మూడేళ్లలోనే టిబెటన్లు వారిని తరిమికొట్టి.. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటించారు.1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు. దలైలామా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు.
చైనా 1949లో టిబెట్‌ను ఆక్రమించినపుడు ఆ ప్రాంతానికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. టిబెట్‌లో చైనా సైన్యం మోహరించింది. రాజకీయంగా జోక్యం చేసుకుంటోంది. దాంతో టిబెట్ నేత దలైలామా పారిపోయి భారత్ శరణుకోరాల్సి వచ్చింది. తర్వాత నుంచి టిబెట్‌లో చైనీకరణ ప్రారంభమైంది, టిబెట్ భాష, సంస్కృతి, మతం, సంప్రదాయం అన్నిటినీ లక్ష్యంగా చేసుకున్నారు. బయటి నుంచి వచ్చే వారికి, టిబెట్, దాని రాజధాని లాసా వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. అందుకే దానిని నిషేధిత నగరం అంటారు. 1963లో విదేశీయులు టిబెట్ రావడాన్ని నిషేధించారు. అయితే 1971లో మళ్లీ విదేశీయుల కోసం టిబెట్ తలుపులు తెరిచారు.
జే సింఖాపా 1409లో జేలగ్ స్కూల్ స్థాపించారు దలైలామా. ఆ స్కూలు ద్వారా బౌద్ధ మత ప్రచారం జరిగేది. ఆ ప్రాంతం భారత్, చైనా మధ్య ఉండేది. దానిని టిబెట్ అని పిలిచేవారు. అదే స్కూల్లో విద్యార్థి గెందూన్ ద్రుప్ గురించి చాలా చర్చ జరిగేది. తర్వాత ఆ గెందునే మొదటి దలైలామా అయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించేవారు దలైలామాను బుద్ధుడి రూపంగా చూసేవారు. ఆయనను కరుణకు ప్రతీకగా భావించేవారు. మద్దతుదారులు ఆయన్ను తమ నేతగా కూడా భావించేవారు. ముఖ్యంగా దలైలామాను ఒక బోధకుడుగా చూసేవారు. లామా అంటే గురువు అని అర్థం. లామా తన వారు సరైన మార్గంలో
వెళ్లేలా స్ఫూర్తి నింపేవారు.
టిబెట్‌లో బౌద్ధ మతానికి నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్దులందరికీ మార్గదర్శకుడుగా నిలిచేవారు.
1630వ దశకంలో టిబెట్ ఏకీకరణ సమయం నుంచి బౌద్ధులు, టిబెట్నాయకత్వం మధ్య గొడవ మొదలైంది. మాంచూ, మంగోల్, ఓయిరాత్ గుంపుల మధ్య టిబెట్‌లో అధికార కోసం యుద్ధాలు జరిగేవి. చివరికి ఐదో దలైలామా టిబెట్‌ను ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. ఆ తర్వాత నుంచీ టిబెట్ సాంస్కృతిక గుర్తింపు సాధించింది.
టిబెట్ ఏకీకరణతో అక్కడ బౌద్ధ మతం వృద్ధి చెందింది. జెలగ్ బౌద్ధులు 14వ దలైలామాకు కూడా గుర్తింపు ఇచ్చారు. దలైలామాను ఎంచుకునే ప్రక్రియ గురించి కూడా వివాదం ఉంది. 13వ దలైలామా 1912లో టిబెట్ ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత చైనా టిబెట్‌పై దాడి చేసింది. అక్కడ 14వ దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఆ యుద్ధంలో టిబెట్ ఓడిపోయింది. కొన్నేళ్ల తర్వాత టిబెట్ ప్రజలు చైనా పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ సౌర్వభౌమాధికారాన్ని డిమాండ్ చేశారు. కానీ తిరుగుబాటుదారులకు
విజయం దక్కలేదు. దాంతో, తాము చైనా గుప్పిట్లో ఘోరంగా చిక్కుకుపోయామని దలైలామాకు అనిపించింది.
అప్పుడు ఆయన భారత్ శరణు వేడారు. 1959లో దలైలామాతోపాటు టిబెటన్లు భారీ సంఖ్యలో భారత్ వచ్చారు. ఆయనకు భారత్ ఆశ్రయం ఇవ్వడం చైనాకు నచ్చలేదు. అప్పట్లో చైనాను మావో సేటుంగ్ పరిపాలిస్తున్నారు. దలైలామా, చైనా కమ్యునిస్టు పాలన మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగాయి.
దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి లభించింది. కానీ ఇప్పటికీ ఆయన ప్రవాస జీవితాన్నేగడుపుతున్నారు. దలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టడం చర్చనీయాంశంగా మారింది..