Homeసినిమాచెర్రీ నెక్ట్స్ సినిమా ఏంటీ..?

చెర్రీ నెక్ట్స్ సినిమా ఏంటీ..?

చెర్రీ నెక్ట్స్ సినిమా ఏంటీ..? శంకర్ సినిమా చేస్తున్నారు. మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఆర్సీ 15 తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు..?

రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరు నిర్మాతలతో సినిమాకు కమిట్ అయ్యారు రామ్ చరణ్. యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కి డేట్స్ ఇచ్చేశారు ఈ మెగా హీరో.

ఈ ఇద్దరీలో ఏ సినిమా ముందు చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ముందుగా యూవీ వారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కానీ ఎందుకో తెలియదు కానీ… ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వెనక్కి వెళ్తింది. దీంతో సీన్ లోకి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆర్సీ 15 మూవీ రిలీజ్ కూడా చూసుకొని…నవంబర్ లో బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

శంకర్ సినిమాతో సోలోగా తన మార్కెట్ ఎంత అనేది కూడా రామ్ చరణ్ కి క్లారిటీ వస్తుంది. అప్పుడు సినిమాని ఏ రేంజ్ లో తీస్తే వర్క్ అవుట్ అవుతుంది అనే లెక్కలు వేసుకొని దిగడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ లోపు స్క్రిప్ట్ సంబందించిన మార్పులు చేర్పులు చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నాడని తెలుస్తుంది. మరో వైపు తన మూవీకి కావాల్సిన క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Must Read

spot_img