Homeఅంతర్జాతీయంఫ్లయింగ్ సాసర్స్ అంటే ఏంటి..?

ఫ్లయింగ్ సాసర్స్ అంటే ఏంటి..?


ఫ్లయింగ్ సాసర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..శతాబ్ద కాలంగా ఈ రహస్యమయ వస్తువు మనిషి మెదడుకు పదను పెడుతూనే ఉంది. ఇప్పటికీ ఎగిరే పళ్లెలు మనుషుల ముందు సవాలుగానే నిలిచాయి. ఆకాశంలో అవి ఎప్పుడు ఎవరికి కనబడతాయో ఎటు నుంచి ఎటు పోతున్నాయో నేటికీ ఎవరూ కనిపెట్ట లేకపోయారు. వీటిని చూసామన్న ప్రకటనలు ఫేక్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటాయి. చూసిన వాళ్లు చెబుతున్న కథనాలు వీటి మిస్టరీని మరింత సస్పెన్స్ చేస్తున్నారే కానీ నిజం తేలడం లేదు. అయితే త్వరలోనే ఎగిరే పళ్లేలు, గ్రహాంతరవాసుల రహస్యాలు బయటకు రానునున్నాయి. నిజం.. మీరు వింటున్నది నిజం.. ఇన్నాళ్లూ ఇలాంటి విషయాలపై ఏమాత్రం పెదవి విప్పని అమెరికా కాంగ్రెస్ ఏకంగా ఎగిరే పళ్లేలలపై విచారణ మొదలుపెట్టనుంది. ఈ 50 ఏళ్లలో ఇదే తొలి దర్యాప్తు కానుండటం విశేషం. ‘సేటీ’ వంటి గ్రహాంతరవాసులు వారి వాహనాలను నమ్మి వాటిపై పరిశోధనలు నిర్వహించే ప్రైవేటు సంస్థ ఈ విషయంలో పూర్తి ఆశాభావంతో ఉంది. ఎన్నాళ్లు గానో ఈ విషయంపై రీసెర్చ్ చేస్తున్నా ఇంకా ఏ విషయం శాస్త్రీయంగా తేల్చలేపోయింది సెటీ.. అయితే ఇంకా గుర్తించబడని యూఎఫ్‌వోలపై తొలిసారి అమెరికా కాంగ్రెస్‌ బహిరంగ విచారణ జరుపనుంది. యూఎఫ్‌వోలపై గత ఏడాది జూన్‌లో ఒక నివేదిక ప్రచురితమైన నేపథ్యంలో తీవ్రవాద వ్యతిరేక హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ప్రొలిఫెరేషన్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగనున్నది. ఆకాశంలో ఎగిరే వస్తువుల కారణంగా అమెరికా ప్రజల భద్రతకు, దేశానికి ముప్పు పొంచి ఉన్నందున యూఎస్‌ హౌస్‌ బహిరంగ విచారణ చేపట్టనున్నది. యూఎఫ్‌వోలపై చివరి బహిరంగ విచారణ 1970 ప్రారంభంలో జరిగింది.


గాలిలో ఎగిరే పళ్లాలను చూశాం….

పెద్ద పెద్ద ఫ్లయింగ్ సాసర్లు మా ఇళ్ల పైకప్పుల మీద నుంచి ఎగిరి వెళ్లాయి……అడవిలో ఏలియన్ వంటి వింత ఆకారాలను చూశాం….ఇవన్నీ అమెరికాతో సహా కొన్ని దేశాలలో వినిపించిన పుకార్లు. అయితే నిజంగానే ఏలియన్లు ఉన్నాయని ఆ ఎగిరే పళ్లాలు నిజమేనని కొందరి వాదన. మరికొందరైతే. ఏలియన్లపై పరిశోధన చేసేందుకు అమెరికాలో ఏరియా 51 అనే ప్రాంతముందని అక్కడ గతంలో దొరికిన ఏలియన్లపై రహస్య పరిశోధనలు జరపుతున్నారని చెబుతుంటారు. స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు కూడా ఏలియన్ల ఉనికి గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. యూఎఫ్ వోల అన్వేషణ కోసం వాటి ఉనికిని కనిసెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ ‘పెంటగాన్’…. సీక్రెట్ యూఎఫ్ వో హంటింగ్ బ్యూరో పేరుతో ఏకంగా ఓ మిషన్ ను చేపట్టింది. ఆ మిషన్ మాజీ డైరెక్టర్ లూయీస్….. ప్రపంచం ఉలిక్కిపడే షాకింగ్ న్యూస్ ఒకటి వెల్లడించారు. ఈ భూప్రపంచం మీద మానవులు ఒంటరివారు కాదని లూయీస్ సంచలన ప్రకటన చేశారు. దేశ రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవడం యూఎఫ్ వోల ఉనికిపై నిఘా ఉంచడం కోసం అమెరికాలో పెంటగాన్ అధ్వర్యంలో సీక్రెట్ యూఎఫ్ వో హంటింగ్ బ్యూరో ను ప్రారంభించారు.. 2014 లో అమెరికా రక్షణ శాఖ కు చెందిన కొన్ని యుద్ధ విమానాలు ఎగిరే పళ్లాలను గుర్తించాయని లూయీస్ చెప్పారు. వాటిని రాడార్ లో పరిశీలించామని అయితే కొద్ది క్షణాల్లోనే అవి మాయమయ్యాయని అన్నారు. అస్పష్టమైన ఆకారాలను – ఎగిరేపళ్లాలను గుర్తించామని చెప్పారు. అయితే అవి కచ్చితంగా గ్రహాంతరవాసులకు చెందినవని చెప్పలేనని – అదే సమయంలో మానవులు రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా కావని అన్నారు. అయితే తాను ఇపుడు ప్రభుత్వం తరపున పని చేయడం లేదు కాబట్టి ఈ విషయాలను అధికారికంగా వెల్లడించలేనని అన్నారు. తన వ్యాఖ్యలు – అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు.


మీరు ఎప్పుడైనా ఫ్లయింగ్​ సాసర్​ చూశారా? దాదాపు ఎవరూ చూసి ఉండరు.

కానీ, మన తాత ముత్తాతలు మాత్రం వాటి గురించి కథలు కథలుగా చెబుతూ ఉంటారు. దానికి తగినట్టుగా పురాణాలకు సంబంధించిన పాత చిత్రపఠాలలో దేవతల పక్కనో ఆకాశంలోనో ఫ్లియింగ్ సాసర్స్ వంటివి కనిపిస్తుంటాయి. ఆకాశ దేశాల జీవులు భూమికి వచ్చేవని ఆనాటి కథకులు చెబుతుండేవారు. తినకుండా మారాం చేసే చిన్నపిల్లలను వాళ్లు ఎత్తుకెళ్లిపోతారని అమ్మమ్మలు, నానమ్మలు భయం చెప్పి ముద్దలు తినిపించడం చూస్తుంటాం.. మనం నిజంగా ఎప్పుడూ వాటిని చూడకపోయినా, ఇకపై చూసేయొచ్చు. ఇదిగో ఇదే ఆ ఫ్లయింగ్​ సాసర్​. నిజంగా నిజమైన ఫ్లయింగ్​ సాసర్​ ఇది. రుమేనియాలో ఇది ఎగిరింది. ఎటువైపు వెళ్లాలంటే అటువైపుకు కదిలింది. అయితే, ఇది గ్రహాంతర వాసుల ఫ్లయింగ్​ సాసర్​ మాత్రం కాదు. రుమేనియాకు చెందిన ఏరోడైనమిక్​ సైంటిస్ట్​ రజన్​ సాబీ దీనిని తయారు చేశారు. ఎటు వైపంటే అటువైపు కదిలేలా దానిని తయారు చేశారు కాబట్టి దానికి ఆల్​ డైరెక్షనల్​ ఫ్లయింగ్​ ఆబ్జెక్ట్​ అని పేరు పెట్టారు. పైలట్​ లేకుండా ఎగిరే దీనిని రిమోట్​తో నియంత్రించవచ్చు. రుమేనియాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఏరోస్పేస్​ రీసెర్చ్​లో మాజీ సీనియర్​ సైంటిస్ట్​, ప్రస్తుతం నేషనల్​ ఏవియేషన్​ ఇనిస్టిట్యూట్​లో ఏరోడైనమిక్స్​ హెడ్​ అయిన యూసిఫ్​ తపోసుతో కలిసి 20 ఏళ్ల పాటు పనిచేసి దీనిని తయారు చేసినట్టు చెబుతున్నారు. నేరుగా పైకి లేచేలా దీని కింది భాగంలో నాలుగు డక్ట్​ ఫ్యాన్లు పెట్టారు. గాల్లో ఎగిరేందుకు శక్తినిచ్చేలా వెనక భాగంలో రెండు థ్రస్టర్​ ఇంజన్లను ఏర్పాటు చేశారు. పక్కకూ దూసుకెళ్లేలా మరికొన్ని థ్రస్టర్లనూ అమర్చారు. సూపర్​సోనిక్​ అంటే.. ధ్వని వేగంతో దూసుకెళ్లే స్పీడ్​తో ఇది కదులుతుంది. ఇప్పటికైతే దీని ప్రొటోటైప్​ను విజయవంతంగా టెస్ట్​ చేశారు. దీనిపై కొన్ని దేశాల ప్రభుత్వాలు, ఒక విమానాలను తయారు చేసే సంస్థ ఆసక్తి చూపిస్తున్నాయని రజన్​ చెప్పారు. 1950–60ల్లో అమెరికా మిలటరీ వాటిపై ప్రయోగాలు చేసినా అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది.


గ్రహాంతరవాసులు అసలు ఉన్నారా లేరా అన్న విషయంపై నాసా ఎన్నడూ ఓపెన్ కావడం లేదు.

కానీ గత రెండు వారాలుగా పెంటగన్‌లో జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తే మాత్రం తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే అవేంటన్నది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన పనిగానే చెబుతున్నారు నిపుణులు. నిజానికి మొన్నటికి మొన్న చైనాకు చెందినవని భావిస్తున్న స్పై బెలూన్‌లు అమెరికా వ్యాప్తంగా తిరుగుతూ సర్వేలు చేస్తుంటే యూఎఫ్ఓ మేనియా మొదలైంది. ఇది నిజంగానే చైనా బెలూనా లేక గ్రహాంతరవాసులేమైనా ఎంట్రీ ఇచ్చారా అన్న అనుమానాలు కలిగాయంటే అతిశయోక్తి కాదు. సముద్రంపై చైనా బెలూన్‌ను కూల్చివేసే సమయంలోనే అమెరికాలో గ్రహాంతరవాసుల వార్తలు గుప్పుమన్నాయి. అదే సమయంలో అక్కడ జరిగిన పలు యూఎఫ్ఓ ఘటనలను అక్కడి రక్షణ మంత్రిత్వశాఖ గుర్తు తెలియని వస్తువుల గురించి ప్రకటించింది. అదే సమయంలో గూగుల్ సెర్చ్‌లో ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ లైఫ్ గురించి, ఏలియన్స్ అస్థిత్వం నిజమేనా అన్న క్వెరీలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటికీ శాస్త్రీయమైన ఆధారాలేవీ లభించలేదన్నది నిజం. ఆ ఫస్ట్ కాంటాక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై పరిశోధనలు చేసేవాళ్లు ఎదురుచూస్తున్నారు. మొదట వారు కనబడితే ఎలా మాట్లాడాలి..ఎలా వారితో కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలి అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా డిబేట్లు జరుగుతున్నాయి. మరి ఉన్నారన్నవాళ్లు ఉన్నారో లేదో కానీ ఉంటే మన ప్రపంచంపై ఏ ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.

Must Read

spot_img