ఇలా అనగానే అంతా చెప్పేది శంకర్ సినిమా గురించే. రీసెంట్ గా బుచ్చిబాబుతో మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు. ఇది చరణ్ కు 16వ సినిమా. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇండస్ట్రీలో రకరకాలుగా వినిపిస్తోంది. నిజానికి ఈ కథ బచ్చిబాబు ఎన్టీఆర్ కోసం రెడీ చేసుకున్నాడు. ఆ విషయం తెలిసీ.. చరణ్ కూడా ఎన్టీఆర్ పర్మిషన్ తీసుకున్నాడు. జనవరి నుంచే సెట్స్ లోకి వెళుతుందని కూడా చెప్పుకున్నారు.

సీన్ కట్ చేస్తే..ఇప్పుడు ఈ దర్శకుడి ప్లేస్ లోకి మరో దర్శకుడు వచ్చాడు. ఇతనితో పాటు తన కెరీర్ లో బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ తోనూ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఆ డైరెక్టర్స్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటుంటి..?
ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేసేందుకే వరుసగా ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ కు ఓకే చెబుతున్నాడు. అలా వస్తోన్న సినిమా శంకర్ ది. ఓ రకంగా ఇది క్రేజీ కాంబినేషన్అ నుకోవచ్చు. ఆల్రెడీ శంకర్ కూడా ప్యాన్ ఇండియన్ డైరెక్టర్. సో ఇదీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక నెక్ట్స్ గౌతమ్ తిన్ననూరితో అనుకుంటే అది ఆగిపోయింది. దీంతో లైన్ లోకి బుచ్చిబాబు వచ్చాడు. ఉప్పెన తర్వాత ఒక కథ పట్టుకుని ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తా అని భీష్మించుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కు మరో రెండేళ్ల వరకూ ఖాళీ లేదు. దీంతో సుకుమార్ సీన్ లోకి వచ్చి ఈ కథను రామ్ చరణ్ కు చెప్పించాడు. ఈ జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు. కానీ సడెన్ గా సీన్ లోకి ఓ కన్నడ దర్శకుడు వచ్చాడు.
కన్నడ డైరెక్టర్ కథకు ఓకే చెప్పిన చెర్రీ

కన్నడలో ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. అప్పుడు అవి నిజం కాదు అనుకున్నారు. అయితే ఇది నిజమే అంటోంది టాలీవుడ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫార్మ్ అయిందని టాక్ వివినిపిస్తోంది. నర్తన్… ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తర్వాత శాండల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మురళి కాంబోలో మఫ్టీ అనే మూవీతో
దర్శకుడుగా మారాడు. మఫ్టీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అప్పటి నుంచి మరో స్టార్ కోసం చూస్తోన్న నర్తన్ రామ్ చరణ్ ను కలవడంతో ప్రశాంత్ నీల్ హెల్ప్ ఉందంటున్నారు. అలా చరణ్ ను కలిసి కథ చెప్పి ఒప్పించాడు అంటున్నారు. అయితే శంకర్ తర్వాత ఈ ప్రాజెక్టే ఉంటుందనేది లేటెస్ట్ ట్విస్ట్. మరి బుచ్చిబాబు పరిస్థితి ఏంటీ అనేదే ఇంకా తేలడం లేదు. ఒకవేళ బుచ్చిబాబు కథలో మార్పులు చేర్పులు ఎక్కువగా ఉన్నాయా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఇక మరో విశేషం ఏంటంటే.. పుష్ప2 తర్వాత సుకుమార్ కూడా రామ్ చరణ్ తోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం చరణ్ కెరీర్ లోనే ఇప్పటి వరకూ ఉన్న బెస్ట్ మూవీ. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ దూకుడు ఓ రేంజ్ లో ఉంటే యంగ్ టైగర్ మాత్రం చాలా చాలా స్లోగా వెళుతున్నాడు.