సంక్రాంతి ముగిసింది. వాలెంటైన్స్ డే కంప్లీట్ అయింది. మరి టాలీవుడ్ షూటింట్ అప్డేట్స్ ఏంటీ…? ఏ హీరో ఎక్కడ ఉన్నారు. ఇంతకీ స్టార్ హీరోలు హైదరాబాద్ లోనే ఉన్నారా…? లేక బ్రేక్ తీసుకొని..ఫారన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారా…?
టాలీవుడ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. సంక్రాంతి పండగ కారణంగా బ్రేక్ తీసుకున్న సినిమాలు కొన్ని అయితే, ఇప్పుడే షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు మరికొన్ని. గత కొత్త కాలంగా రెండేళ్ళకి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న డార్లింగ్ స్పీడ్ పెంచేశాడు. ఈ ఏడాది రెండు చిత్రాలను రిలీజ్ ని టార్గెట్ పెట్టుకొని మరీ షూటింట్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది మధ్యలో ఆదిపురుష్ రిలీజ్ కానుండగా, ఎండింగ్ లో సలార్ విడుదల కానుంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఇక గత కొంత కాలంగా చిత్రీకరణ దశలోనే ఉన్న ‘హరిహర విరమల్లు’ షూటింగ్ ని పూర్తి చేసి ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. చాలా రోజుల గ్యాప్ తరువాత ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు మేకర్స్. SSMB28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతుంది.