Homeఅంతర్జాతీయండోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి..?

డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి..?

అమెరికా రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌ అయ్యారు. అమెరికా రాజకీయ చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం పెనుదుమారం రేపుతోంది..

డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి..? ట్రంప్‌ దోషిగా తేలితే.. వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయొచ్చా…? ట్రంప్‌కు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా..? తాను ఎలాంటి నేరం చేయలేదని మొదటి నుంచి చెబుతోన్న ట్రంప్.. నిర్ధోషిగా బయటపడే అవకాశం ఏమైనా ఉందా…?

అమెరికా రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌ అయ్యారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌కు జరిపిన డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే బెయిల్‌ కోసం మాన్‌హట్టన్‌ కోర్టులో ట్రంప్‌ వాదనలు వినిపిస్తున్నారు.. త్వరలోనే ట్రంప్‌కు బెయిల్‌ వస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే షరతులు విధించే అవకాశం ఉందంటున్నారు.

2006లో డొనాల్డ్ ట్రంప్.. తాను ఓ ఈవెంట్‌లో కలుసుకున్నామనీ.. ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించింది.

ఈ వ్యవహారాన్నిరహస్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ట్రంప్‌పై ప్రధాన ఆరోపణ. అయితే, ఇది నిజమేనని కోహెన్ఒప్పుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డ్ కవర్‌లో ఉంచారు. ఇక ఈ కేసును విచారించిన న్యూయార్క్‌ కోర్టు గత మంగళవారం డొనాల్డ్‌ ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. మరోవైపు ఈ కేసులో తానే తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తన పోటీని నిలువరించేందుకు జరుగుతున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. డబ్బు కాజేసేందుకే పోర్న్‌ స్టార్‌ ఆడుతున్న నాటకంగా దీన్నిట్రంప్‌ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి అగ్రరాజ్యాధిపతి ఇలాంటి కేసుల్లో కటాకటాల్లోకి వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

అంతకుముందు గత గురువారం ట్రంప్‌పై అభియోగాలు మోపేందుకు గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది.ఇండిక్ట్‌మెంట్ అంటే ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డారని లిఖితపూర్వకంగా ఆరోపణలు లేదా అభియోగాలు మోపడమే. దీన్ని నిందితులు లేదా వ్యక్తులపై దర్యాప్తు అధికారులు నమోదు చేయిస్తారు. ఈ అభియోగపత్రంలో ఆరోపణలు ఉంటాయి. అదే ట్రంప్ కేసు విషయంలో అయితే, ఫెలోనీ చార్జెస్న మోదు చేస్తారు. ఇలాంటి అభియోగాలు రుజువైతే శిక్ష ఏడాది లేదా అంతకంటే ఎక్కువే పడుతుంది.దర్యాప్తు అధికారులు చేసే సాధారణ అభియోగాల కంటే ఇండిక్ట్‌మెంట్ భిన్నమైనది. ఇండిక్ట్‌మెంట్న మోదుకు ముందుగా ఒక గ్రాండ్ జ్యూరీ దీనికి సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ కేసులో న్యూయార్క్‌లోని మన్‌హటన్ జ్యూరీ దీనికి ఆమోదం తెలిపింది.

ఇక్కడ గ్రాండ్ జ్యూరీ అంటే కొంతమంది పౌరుల బృందం. వీరు సాక్షులు చెప్పే అంశాలను పరిశీలిస్తారు. అభియోగాలు మోపేందుకు వీరు చెబుతున్న ఆధారాలు సరిపోతాయో లేదో చూస్తారు.

డోనాల్డ్ ట్రంప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ట్రంప్‌ను మొదటగా జర్నలిస్టులు, కెమెరాలు, మైక్‌ల ముందు నుంచి న్యూయార్క్ సిటీ కోర్టులకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీన్నే ప్రెప్ వాక్అంటారు. అంటే పెర్పెట్రేటర్ వాక్.

తీవ్రమైన కేసుల్లో నిందితులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్తారు. కొంతమందిని సాధారణంగా తీసుకెళ్తుంటారు.

ఇలాంటి సమయాల్లో తీసే ఫోటోలు బాగా వైరల్అవుతుంటాయి. హాలీవుడ్ దిగ్జజం హార్వే వీన్‌స్టీన్‌పై వరుస లైంగిక నేరారోపణలు వచ్చినప్పుడు ఆయన్ను ప్రెప్ వాక్‌ చేసుకుంటూ తీసుకెళ్లారు. అంటే ఆయన చేతికి బేడీలు వేసి న్యూయార్క్ పోలీస్డిపార్ట్‌మెంట్‌కు తరలించారు.

మీటూ ఉద్యమంలో బాగా వైరల్ అయిన ఫోటోల్లో ఇవి కూడా ఒకటి. మరోవైపు మాజీ ఐఎంఎఫ్ చీఫ్ డొమినిక్ స్ట్రాస్ కన్‌ను కూడా లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇలానే తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లేటప్పుడు ఒళ్లంతా చెమటలతో తీవ్రంగా అలసిపోయి ఆయన కెమెరాలకు కనిపించారు. అయితే, ఆ తర్వాత కాలంలో స్ట్రాస్ కన్‌‌పై వచ్చిన ఆరోపణలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఆ కేసును కోర్టు బయట పరిష్కరించుకున్నారు.ప్రస్తుత కేసులో మాత్రం చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లబోరని ట్రంప్ న్యాయవాది జోయి టకోపినా స్పష్టం చేశారు.

నిజానికి ఈ ప్రెప్ వాక్‌లు ఇంతలా ప్రజల్లోకి వెళ్లడానికి ట్రంప్ సలహాదారుడు, అమెరికా మాజీ అటార్నీ రూడీ జిలియానీనే కారణం. నిందితులను ఇలా మీడియా ముందు నుంచి తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. దీన్ని 1980, 90లలో రూడీ బాగా ప్రోత్సహించారు.

ట్రంప్ పై లైంగిక ఆరోపణలే కాదు.. మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు అమెరికా కాంగ్రెస్ ఉండే క్యాపిటల్ హిల్స్ మీద దాడి చేశారు. వారిని
రెచ్చగొట్టేలా ట్రంప్ ప్రసంగించిన తరువాత ఆ దాడి జరిగింది. అయితే క్యాపిటల్ హిల్స్ మీద దాడిలో ట్రంప్ విచారణ ఎదుర్కొంటారో లేదో ఇంకా తెలియడం లేదు.

ఫ్లోరిడాలోని ట్రంప్ వ్యక్తిగత నివాసంలో అమెరికా రహస్య పత్రాలు లభించాయి. ఈ కేసులో కూడా ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఓడిపోయినట్లుగా ప్రకటించాలంటూ జార్జియా రాష్ట్రం అధికారులను ట్రంప్ ఒత్తిడి చేసినట్లుగా చెబుతున్న కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కావాల్సిన ఓట్లను ‘గుర్తించాల్సింది’గా ట్రంప్ ఫోనులో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను కోరారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఒకవేళ ట్రంప్ దోషిగా తేలినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఆరోపణలు మోపినా లేక దోషిగా తేలినా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం అభ్యర్థులకు ఎటువంటి నేర చరిత్ర లేకుండా ఉండాలనే నియమం లేదు.

అభిశంసన ఎదుర్కొన్నవారు, పెద్దపెద్ద నేరాలు చేసిన వారికి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం లభించకపోవచ్చు. కాకపోతే ట్రంప్ మీద రెండు సార్లు అభిశంసన పెట్టినా అమెరికా సెనేట్ ఆయనను నిర్దోషిగా తేల్చింది.”నేరం రుజువై శిక్ష పడినప్పటికీ జైలు నుంచే అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించొచ్చు. నేరస్థులను అధ్యక్షుడు కాకుండా నిషేధించే చట్టాలు ఏవీ అమెరికాలో లేవు.. కాగా, తాజాగా, డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కోర్టుకు వెళ్లడానికి ముందు ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. లోయర్మాన్ హట్టన్ కోర్టు హౌస్‌కు వెళ్లడం అతివాస్తవికంగా ఉంది. వావ్! పోలీసులు నన్ను అరెస్టు చేయబోతున్నారు. అమెరికాలో ఇది జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు.

నేరారోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ దేశ రాజకీయ చరిత్రలో సంచలనంగా మారింది.. క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోనున్నారు.

Must Read

spot_img