Homeజాతీయంఅధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది

అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది

సౌత్​ సెంట్రల్ రైల్వేలోని కీలక జంక్షన్లలో ఒకటి కాజీపేట రైల్వే జంక్షన్​. ఈ జంక్షన్​ కేంద్రంగా వరంగల్ లో ప్రస్తుతం రాజకీయ రగడ మొదలైంది. కొన్నేళ్ల క్రితం కాజీపేటకు మంజూరైన రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది. ఆ తరువాత వచ్చిన వ్యాగన్​ వీల్​ తయారీ కేంద్రం కూడా రాజకీయ కారణాలతో మరో చోటుకు తరలించారు. ప్రస్తుతం కాజీపేటకు పీవోహెచ్​ వర్క్ షాప్ మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి. కానీ పనులు మొదలుకావడంపైనే రాజకీయ కొట్లాట నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీ కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ నిరసనలపర్వం కొనసాగిస్తున్నారు.

విభజన హామీల్లోని కోచ్​ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని బీజేపీని ఎండగడుతున్నారురు కోచ్​ ఫ్యాక్టరీ పేరుతో స్థానిక బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్నాడు. దీనికి బీజేపీ నేతలు కేంద్రం చెప్పిన విధివిధానాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోచ్​ ఫ్యాక్టరీ తరలిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేతల సంవాదాలు సాగుతూ ఉండగానే కోచ్​ ఫ్యాక్టరీ, వ్యాగన్​ వీల్​ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రం దాటి పోగా.. తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో కేంద్ర ప్రభుత్వం 383 కోట్లతో మరో రైల్వే ప్రాజెక్టు పీవోహెచ్​ను కాజీపేటకు మంజూరు చేసింది.

దీంతో ఈ వర్క్​ షాపునైనా ప్రారంభిస్తే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రాజెక్టు మంజూరై ఆరేళ్లు గడుస్తున్నా వర్క్​ షాపు పనులు మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. పీవోహెచ్ ఏర్పాటుకు 160 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా.. 158.17 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు మూడు విడతల్లో అప్పగించింది. మరో ఎకరం పైగా స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంది. రైల్వేశాఖకు అందించిన స్థలానికి రహదారి నుంచి దారి లేకపోవడంతోనే ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. అయితే దారి కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు యజమాని సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీవోహెచ్​ పనులు ప్రారంభమైతే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అడ్డుపడుతూ.. ఎప్పుడో తరలిపోయిన కోచ్​ ఫ్యాక్టరీ పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

ఇదే విషయాన్ని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సైతం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో వరంగల్ ప్రజలు ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోచ్​ ఫ్యాక్టరీ నినాదం వదిలి యువతకు ఉపాధినిచ్చే పీవోహెచ్​ వర్క్​ షాపు పనులు ప్రారంభించి చిత్తశుద్ధి చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేని కోచ్​ ఫ్యాక్టరీ పేరుతో బీజేపీని బద్నాం చేద్దామనుకున్న ఎమ్మెల్యే వినయ్​ భాస్కరే పీవోహెచ్​ పనులకు అడ్డుపడుతున్నారని బీఆర్​ఎస్​ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నాయి.


ఇదిలా ఉంటే, బీజేపీ ప్రభుత్వం దేశంతో కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని, ఉన్న ఫ్యాక్టరీలు సరిపోతాయని పేర్కొంది. కాజీపేటకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో 2016లో ప్రధాని మోడీ పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీవోహెచ్) వర్క్​షాప్ మంజూరు చేశారు. ఈ వర్క్ షాప్ ఎంట్రన్స్ వద్ద 1.17 ఎకరాల ప్రైవేట్ల్యాండ్​ ఉంది. అది కూడా రైల్వే శాఖకు అప్పగిస్తేనే వర్క్ షాప్ ఏర్పాటుకు దారి ఉంటుంది. కానీ 1.17 ఎకరాలను సేకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఈ ఫ్యాక్టరీ కూడా 2021 నుంచి కలగానే మిగిలింది. కాజీపేట లో పీవోహెచ్​ వర్క్​షాప్ కోసం కేంద్రం 2016–17 బడ్జెట్ లో రూ.188 కోట్లు, 2018–19, 2019 20లో రూ.10 కోట్ల చొప్పున మం జూరు చేసింది. కానీ ల్యాండ్ పూర్తిస్థాయిలో అందించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. కాగా ఇటీవల ప్రాజెక్టు ల్యాండ్​ విషయంలో క్లారిటీ రావడంతో ఇప్పటికే రైల్వేశాఖ టెండర్లు కూడా పిలించింది.

హైదరాబాద్​ కు చెందిన ఓ సంస్థ రూ.361కోట్లకు టెండర్​దక్కించుకోగా.. రైల్​ వికాస్​నిగమ్ లిమిటెడ్​వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చింది. దీంతో పనులు పట్టాలెక్కుతాయని అంతా భావించారు. కానీ దారికి కావాల్సిన భూమిని అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. కదులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కొన్ని రాజకీయ కారణాల వల్లే ప్రాజెక్టుకు ముందుకు సాగడం లేదనే ప్రచారం జరుగుతోంది. రైల్వేశాఖ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కాజీపేటలో పీవోహెచ్‌ వర్క్‌షాపు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన చేసి ఇప్పటికి సంవత్సరం కావొస్తుంది. మరో రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది.

వరంగల్ జిల్లాలో ఓ నేత బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టె ప్రయత్నం .. బూమరాంగ్ అయిందట.. ఇంతకీ ఎవరా నేత..

అవసరమొచ్చినప్పుడల్లా ఈ ఫ్యాక్టరీపై పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని కాలాయాపన చేయడం తప్ప అడుగు ముందుకు పడిందీ లేదు. ఆశతో ఉన్న నిరుద్యోగులకు ఒక్క నౌకరీ కల్పించిందీ లేదు. తన నియోజకవర్గ పరిధి సమస్యకావడంతో వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే, చీప్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ ఎప్పుడూ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు. అవసరమైన సందర్భంలో అందరినీ ముఖ్యంగా సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను కలుపుకుని సాగుతుంటారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని, ప్రస్తుతం బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.

దీంతో దశాబ్దంన్నర కాలంగా పీవోహెచ్ రాజకీయ ఎజెండాగా మారిపోయింది. 2018లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు అనుకూలంగా విభజన
హామీలు, కోచ్​ ఫ్యాక్టరీని ఎజెండా చేసి కాజీపేట కేంద్రంగా పోరాటాన్ని ఎక్కుపెట్టారు. బీజేపీ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పోరాటం చేపట్టామని ప్రకటించారు.ఎన్నికలు ముగిసిన తర్వాత షరా మాములుగా ప్రాధాన్యత మారిపోయి పోరాటం నీరుగారి పోయింది. వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్ఆ ధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వామ్యం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించి ఒక దశలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి ఆఖరి నిమిషంలో వెనుకంజ వేసి ఉద్యమాన్ని చల్లార్చారు.

ఇప్పుడు బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందినతర్వాత మళ్ళీ ఎన్నికలు రానున్నందున నెమ్మదిగా ఈ అంశాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్​ఎస్​ మధ్య అధికార ఆరాటం పెరిగిన నేపథ్యంలో మరోసారి ఈ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చీఫ్‌విప్​ వినయ్​ బీజేపీపై విమర్శలు పెంచారు. దీనికి కౌంటర్​గా బీజేపీ నాయకులు సైతం విమర్శలు చేస్తున్నారు. బీఆర్​ఎస్​ భూమి కేటాయించకుండా జాప్యం చేస్తుందంటూ ప్రతివిమర్శ చేశారు.

ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి కార్యాచరణ చేపట్టాలని బిఆర్ఎస్ సిద్ధమైతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అటు బీజేపీ సైతం గట్టిగానే కౌంటర్వి నిపిస్తుండడంతో, టగ్ ఆఫ్ వార్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీవోహెచ్​ వర్క్​ షాపు దారి కోసం బడ్జెట్​ కూడా అందుబాటులో ఉంది.

Must Read

spot_img