Homeజాతీయంనీరు లేకుండా కేవలం గాలి పీలుస్తూ జీవనం...

నీరు లేకుండా కేవలం గాలి పీలుస్తూ జీవనం…

అది 2003 వ సంవత్సరం..అహ్మదాబాద్ లోని స్టెర్లింగ్ హాస్పిటల్ లో ఓ ప్రయోగం జరిగింది. అదేంటంటే..ప్రహ్లాద్ జానీ అనే ఓ వ్రుద్ధుడు గత 64 సంత్సరాలుగా ఏ రకమైన ఆహారం, నీరు లేకుండా కేవలం గాలిపీలుస్తూ జీవిస్తున్నాడు. ఆ సంగతి మరో డాక్టర్ ద్వారా తెలియడంతో ఆస్పత్రి డైరెక్టర్ ఆ వింత గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. దాంతో ఆయన ఆధ్వర్యంలో పదిరోజుల పాటు పరీక్షలు జరిగాయి. దాదాపు అన్ని రంగాల సీనియర్ స్పెషలిస్టులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఆయనను కంటిన్యూగా ఎక్కడా కట్ లేకుండా వీడియో తీస్తూ ఆ పరీక్షలు జరిగాయి. అంటే ఏ ఫ్రేములోనూ ప్రహ్లాద్ జానీ లేకుండా ఉండదు. అలా జరిగిన ప్రయోగంలో ప్రహ్లాద్ జానీ నిజంగానే ఆహారం నీరు లేకుండా జీవిస్తున్నారని తేలిపోయింది.

తన నుంచి ఏ విసర్జకాలు కూడా బయటకు రావడం లేదు. మూత్రం బ్లాడర్ లో నిండుతోంది..కానీ అదే బ్లాడర్ నిండిపోయిన మూత్రాన్ని శరీరంలో కలిపేసుకుంటోంది. అదే విచిత్రం..ఇలా ఎలా జరుగుతోందో వైద్యులకు అర్థం కాలేదు..ఈ ఉదంతాన్ని పక్కన బెడితే.. ఆర్కిటిక్ గురించి మీకు తెలుసుకదా..ద్రువప్రాంతం..మైనస్ 90 డిగ్రీల పీక్ స్టేజ్ డిగ్రీల చలి ఉంటుంది. శరీరంలోని రక్తం కూడా ఆ చలికి గడ్డ కట్టుకుని పోతుంది. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయినా బతికే ఛాన్స్‌ లేనే లేదు.

కానీ జవశాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడు వారికి ఒక ఊహించని షాకింగ్‌ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయిన జీవిని గుర్తించారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే అది సమాది అయిన లోతును బట్టి ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా అలా ఉండిపోయిందని తెలిపారు. పైగా ఏమీ తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఓ ప్రాణి ఇన్ని వేల ఏళ్ల నుంచి సమాధిలో ఉండటం, బయటకు రావడంతోనే మళ్లీ కదలడం, ఇంకో జీవికి ప్రాణం పోయడం కూడా వెంట వెంటనే జరిగిపోయింది. అంటే ఏమీ తినకుండా ప్రహ్లాద్ జానీ 64 ఏళ్లుగా ఉన్నట్టే స్రుష్టిలో మరెన్నో జీవులు కూడా ఇలా ఆహారంతో పని లేకుండా జీవిస్తున్నాయన్నమాట.

అయితే ఈ తరహా జీవులను మైక్రో-జోంబీ జీవులు అంటారు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల​ క్రితం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఉంటాయని కనుగొన్నారు. ఈ జీవి చర్మంపై మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని వారి పరిశీలనలో తేలింది. వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా అంటారు.చూసే ఆసక్తి ఉండాలే కానీ ప్రక్రుతిలో ఇలాంటి వింతలెన్నో ఉన్నాయి. తరచి చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయేలా చేసే విచిత్రాలు కనిపిస్తాయి. కంటికి కనిపించని ఈ వండర్ వరల్డ్ లోకి ఎంటర్ అవాలంటే మామూలు కన్ను సరిపోదు. మైక్రోస్కోపు కన్నా అత్యాధునిక పరికరాలెన్నో ఉండాలి. ల్యాబుల్లో వీటిని పరిశీలించుకుంటూ పోతే మరో ప్రపంచంలోకి వెళ్లి తొంగి చూసిన భావన కలుగుతుంది.

మైక్రో వరల్డ్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్కిటిక్ లో సైంటిస్టులు కనిపెట్టిన మైక్రో జోంబీ జీవి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు. ఈ సూక్ష్మ జీవుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి అలైంగికమైనవి. అంటే తమలాంటి సూక్ష్మ జీవికి జన్మనివ్వడానికి వీరికి ఏ విధమైన భాగస్వామి అవసరం లేదు. అలాంటి ఈ జీవి తాజాగా అత్యంత శీతల ప్రదేశమైన ఆర్కిటిక్ లో బయటపడింది. ఇవే ఇంత చిన్నగా ఉన్నాయంటే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన ఇతర సూక్ష్మజీవులు కూడా కనిపించడం విచిత్రం. పైగా ఈ ప్రాణి నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు కూడా ఉన్నాయి.

ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల రోటిఫర్‌లను కనుగొన్నారు. పరిమాణంలో చిన్నగా ఉన్నంత మాత్రాన శరీరంలో ఏమీ లేవనుకునేరు..వాటి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు కూడా బేషుగ్గా పనిచేస్తున్నట్టు మైక్రోస్కోపుల ద్వారా స్పష్టంగా తెలిసింది. వీటిని మైక్రోస్కోప్ లేకుండా చూడటం అసాధ్యమని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా బయటపడిన రోటిఫర్ ఉదంతంతో ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎ‍న్నో వింత జీవులు ఉన్నాయని తెలిసిపోయింది. ప్రముఖ కెమెరా మేకింగ్ కంపెనీ క్యానన్ వారు నిర్వహించిన మైక్రో ఫోటోగ్రఫీలో అవార్డు విన్నింగ్ క్లిప్ చూస్తే ఔరా అనిపించేలా శరీర నిర్మాణంలో అనేక సూక్ష్మజీవులు కనిపిస్తాయి. వాటిన్నింటికీ ప్రత్యేకంగా శరీర నిర్మాణం వ్యవస్థలు ఉన్నాయి.

స్రుష్టి చాలా విచిత్రమైనది.. విశ్వాంతరాలలో అంతరిక్షానికవతల ఏముంటుందో మనకు తెలియదు. అలాగే ఈ సూక్ష్మ ప్రపంచానికి ఇంకా లోపల ఏముందో కూడా మనకు తెలియదు. సముద్రంలో అట్టడుగున కొనసాగుతున్న ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. అవి మానవమేధస్సుకు అందవు గాక అందవు. వీటినే ఏలియన్స్ అని కూడా పరిశోధకులు వ్యవహరిస్తూన్నారు. భూమి ఏర్పడిన తరువాత ఎక్కడి నుంచో వచ్చి చేరిన జీవులు. ఇవి నివసించే ప్రాంతాలను మైక్రో కాస్మోస్ అని కూడా అంటారు. అంతంత చిన్నవైన జీవులపై మరింత చిన్నజీవులు పరాన్నజీవులుగా ఉంటాయి. మరి వాటి సంగతేంటో ఇంకా కనిపెట్టాల్సి ఉంది. అంటే అది చాలా లోతైన పరిశోధనగానే ఉంటుంది.

తవ్వినకొద్దీ సరికొత్త సంగతులు బయట పడుతూనే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల యొక్క ఎన్ని జాతులు భూమిపై ఉన్నాయో చెప్పడం కష్టం..అయితే ఇప్పటి వరకు మనకు తెలిసి ఇలాంటి జవులు మిలియన్ కు పైగా జాతులుగా ఉన్నట్టు అంచనా. వాటిలో మంచి బాక్టీరియా, చెడు బాక్టీరియాలు ఉంటాయి. బాక్టీరియా అంటే చిన్న సూక్ష్మజీవులు, ఇవి వేల సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి. సూక్ష్మజీవులను కంటితో చూడటం అసాధ్యం, చూడలేనంత మాత్రాన వాటి ఉనికి గురించి అనుమానించలేము. సూక్ష్మజీవులు వాటి రకమైన చర్యలు మరియు విధులను బట్టి విభిన్నంగా పిలువబడతాయి. సూక్ష్మదర్శిని క్రింద వీటి జీవన విధానాన్ని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.

సూక్ష్మజీవులు చాలా ప్రాచీనమైనవి, స్రుష్టిలో వాటి ప్రాముఖ్యత వాటిదిగానే ఉంటుంది. వాటికి కూడా కాలనీలుంటాయి. నిత్యం జీవన సంఘర్షణ ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులలో జీవించడానికి అవి సంఘర్షణకు లోనవుతాయి. అంతెందుకు మన మొహంపై కనిపించే గ్లో..అంటే మెరుపుకు కారణం కూడా ఈ సూక్ష్మజీవులే అంటే నమ్మగలరా.. అయితే ఈ వీడియో చూడండి..ఇందులో కనిపించే ఈ మైక్రో జీవులు విడుదల చేసిన ఎంజైమ్ ద్వారా మన చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది. మనమేమో ఫేషియల్ చేసుకుని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాం..కానీ ఇవి జస్ట్ క్షణాలలో మొహాన్ని ప్రకాశవంతం చేస్తాయి. వీటి వల్ల మనకేమీ హాని ఉండదు. ఇవే కాదు మన శరీరంపై ఉండే సూక్ష్మక్రిముల విషయానికొస్తే..మామూలుగా ఉండదు..

ఈ అమ్మాయి వెంట్రుకలను చూడండి..వాటిని మైక్రోస్కోప్ ద్వారా విభజిస్తూ మరింత జూమ్ చేస్తూ పోతే ఏమౌతోందో గమనించండి.చివరన ఆ వెంట్రుక నిర్మాణం వరకు వెళ్లడం జరుగుతుంది. అది ఎంత దూరం వరకు వెళుతుందంటే తలపై లక్షలాదిగా ఉండే వెంట్రుకలలో ఒక వెంట్రుక ఎలాంటి ఖనిజాలు రసాయనాలతో ఏర్పడిందో తెలుస్తుంది. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాలతో తయారైన వెంట్రుక మనకు నిగనిగలాడుతూ కనిపించడం వెనుక మళ్లీ సూక్ష్మజీవులే కీలక పాత్ర పోశిస్తాయి. ఇందులో మరికాస్త లోపలిదాకా వెళితే న్యూక్లియస్, దాని చుట్టూ అణువులు కూడా ఉంటాయి. ఇక మరోసారి సముద్రపు చీకటి ప్రపంచంలో జీవించే జీవుల గురించి చూద్దాం..మీకు తెలుసా..

అక్కడ కనిపించే కొన్ని రాళ్లు నిగనిగా మెరిసేందుకు కూడా కొన్ని సూక్ష్మజీవులే కారణం..వీటని నాలుగు భాగాలుగా కోయగలిగితే తిరిగి నాలుగు జీవులుగా ఏర్పడటం ఆశ్చర్యం కలిగించింది. ఆ ముక్కలకు మళ్లీ రెండు కళ్లు,ఎనిమిది కాళ్లు, ఇతర శరీర నిర్మాణాలు కూడా యధావిధిగా ఏర్పడటం విచిత్రం.. నిజానికి సముద్రజీవుల గురించి చెప్పుకున్నప్పుడు అక్టోపస్ గురించి ప్రస్తావించనప్పుడు అది అసంపూర్ణంగానే ఉంటుంది. దాని టెంటకిల్స్ తో జీవుల్ని వేటాడుతుంది..తన సామ్రాజ్యాన్ని పరిరక్షించుకుంటూ సంతానాన్ని అభివ్రుద్ది పరచుకుంటుంది. కళ్లు లేకపోయినా ఎదుటి నుంచి వచ్చే ప్రమాదాన్ని గుర్తించి తనను తాను రక్షించుకుంటుంది. అంతరిక్షాన్ని హబుల్, వెబ్ టెలిస్కోపుల ద్వారా పరిశీలించి ఖగోళ రహస్యాలను పరిశీలించినట్టే..అత్యాధునిక మైక్రోస్కోపుల ద్వారా సూక్ష్మప్రపంచాన్నికూడా పరిశోధకులు నిత్యం పరిశోధిస్తుంటారు. ఇలాంటి వింతైన విషయాలను ప్రపంచానికి వెల్లడిస్తుంటారు. సైన్స్ నిజంగా అద్భుతం..అనంతం కూడా..

Must Read

spot_img