మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ధమ్కీ. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసారు. సీన్ కట్ చేస్తే.. ఈ సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్..
యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, హిట్స్ కొడుతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు స్వయంగా రెండో సారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా,డైరెక్టర్ గా చేసిన ఫలక్ నామా దాస్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు రెండో సారి డైరెక్టర్ గా మారి చేస్తున్న రెండో సినిమా ‘దాస్ కా ధమ్కీ.
ఇప్పటివరకు కేవలం తెలుగు వరకే సినిమాలు చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్ మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటికే బాలకృష్ణ చేత ఒక ట్రైలర్ సహా సాంగ్ ని కూడా విశ్వక్ సేన్ రిలీజ్ చేసి మంచి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.
అయితే సినిమా రిలీజ్ కు ఇంకా పది రోజులే ఉంది రిలీజ్ బజ్ మొదలు కాకపోవడంతో వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇంకా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నాం అంటూ విశ్వక్ సేన్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కొత్త రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తా అంటూ విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని వాయిదా వేస్తూ ప్రకటన చేశారు. అయితే విశ్వక్ సినిమా రిలీజ్ వాయిదా వేయడం వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు. అదేమంటే ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సి ఉండగా అదే రోజు సమంతా నటిస్తున్న శాకుంతలం సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా వేశారు.
అయితే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ, సితార బ్యానర్ లో ధనుష్ నటిస్తున్న సార్, సంతోష్ శోభన్ శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2, సితార ఎంటర్టైన్మెంట్స్, యువీ క్రియేషన్స్ లాంటి బ్యానర్లు సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వారిని దాటి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి రావడం అనేది కష్టమైన విషయం కావడంతో వాయిదా వేసుకున్నాడు అంటున్నారు.