కొంత కాలంగా విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. వైసీపీ అభ్యర్ధిగా విశాల్ బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని దెబ్బ తీసిన వైసీపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అక్కడ ఇప్పటికే భరత్ ను వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. గతంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని స్పష్టం చేసారు. అయినా, విశాల్ పోటీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇక, ఇప్పుడు విశాల్ తేల్చి చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది వాస్తవమే అయినా.. కుప్పంతో అనుబంధం ఉన్నదీ నిజమేనని..కానీ, తాను కుప్పం నుంచి పోటీ చేయటం లేదని విశాల్ తేల్చి చెప్పారు. జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. చంద్రబాబు వర్సస్ చంద్రమౌళి కుమారుడు కుప్పంలో 2014, 2019 ఎన్నికల్లో చంద్రమౌళి వైసీపీ నుంచి పోటీ చేసారు. ఇప్పుడు కుప్పంలో ఆయన కుమారుడు భరత్ వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. భరత్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవితో పాటుగా కుప్పం సీటు ఖరారు చేసారు. ఇప్పటికే భరత్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గడపగడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
కుప్పంలో ఈ సారి గెలుపు ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు గతం కంటే భిన్నంగా ప్రతీ ఆరు నెలలకోసారి కుప్పంలో మూడు రోజుల పాటు మకాం వేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ కుప్పం పైన ఈ సారి ఫోకస్ పెట్టటంతో చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. దీంతో, రానున్న ఎన్నికల్లో కుప్పం రాజకీయం ఆసక్తిగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా హీరో విశాల్ ఈ ప్రచారంపై మరోసారి స్పందించారు. కానీ తాను 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. కుప్పం, ఆ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉందని.. అన్నారు. ఆరు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పై కుప్పం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరిగింది. విశాల్‌తో వైసీపీ సంప్రదింపులు జరిపిందని ఊహాగానాలు వినిపించాయి.
హీరో విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంపై అప్పుడే వైసీపీ కూడా ఖండించింది. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ భరత్ నూటికి నూరుశాతం అభ్యర్థిగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు గెలుపు ఖాయమని ధీమాను చేశారు ఆ పార్టీ నేతలు. విశాల్ పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇప్పుడు మరోసారి విశాల్ నేరుగా స్పందించారు.. పోటీ చేయడం లేదన్నారు. ఇప్పటికే కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు.
ఆయనకు ఎమ్మెల్సీగా కూడా అధినేత వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా విజయం సాధిస్తామని.. భరత్‌ను గెలిపిస్తే మంత్రిగా కూడా అవకాశం ఇస్తామని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. అందులోనూ తెలుగు వాడే కాబట్టి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి.

మొదటి నుంచీ కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ కూడా అక్కడ పర్యటించారు. అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కుప్పంపై కేంద్రీకరించి పని చేస్తున్నారు. దీంతో కుప్పం నుంచి చంద్రబాబుపై హీరో విశాల్ ను బరిలోకి దింపుతున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే దీనిపై కుండబద్ధలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేశాడు విశాల్.
ఏపీ సీఎం వైయస్ జగన్ అంటే తనకు చాలా ఇష్టమని ఐ లవ్ జగన్ అని హీరో విశాల్ అన్నారు. విశాల్ తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ
చేస్తున్నానన్న ప్రచారాన్ని ఖండించారు. తన తండ్రి కుప్పంలో వ్యాపారం చేసే వారిని సినిమాల్లోకి రాక ముందు తండ్రికి సాయంగా కుప్పంలోనేఉండేవాడినని తెలిపారు.కుప్పంలో ప్రతి వీధి తనకు బాగా తెలుసని అన్నారు. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన, ఎక్కువ ప్రజాభిమానం ఉందని అన్నారు.
తాను ఏపీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. లాఠీ సినిమా ప్రతి టికెట్ ఆదాయంలో ఒక రూపాయి పక్కన పెట్టి రైతులకు సాయం చేస్తానని తెలిపారు. సోషల్ సర్వీస్ చేసే ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడేనని, అలా తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. పోటీ అంటే హీరోలతోనే అన్నారు. అందరూ మెచ్చుకునే సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంతటి అభిమానాన్ని నేను కోల్పోలేను. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అభిమానాన్ని నేను సంపాధించుకున్నానని అన్నారు.
విశాల్ కు కుప్పంతో ఉన్న సంబంధం ఏమిటి..?
తమిళంలో హీరోగా నిలదొక్కుకున్న తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారని, కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని విశాల్ గతంలో కూడా ఖండించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని,అయినా ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదన్నారు.
నెల్లూరుకు చెందిన విశాల్ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరతే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం నుంచి బీసీ వర్గానికి చెందిన చంద్రమోళిని ప్రోత్సాహించామని జగన్ తెలిపారు. ఆయన చనిపోవడంతో చంద్రమోళి కుమారుడు భరత్ ప్రోత్సహిస్తున్నానన్నారు. భరత్‌ను గెలుపించుకు వస్తే మంత్రిని
కుప్పానికి ఇస్తానన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజవర్గం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉంటోంది. వైసీపీ, టీడీపీ కుప్పంపై ప్రధాన దృష్టి సారించాయి. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించాలని పాచికలు వేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో
టీడీపీని చావుదెబ్బ తీసిన వైసీపీ అదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో టీడీపీని కుప్పంలో కనుమరుగు చేయాలని చూస్తోంది. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి సీట్లు రాకుండా చేయడంలో వైసీపీ పైచేయి సాధించింది. ఇప్పుడు కుప్పం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
కుప్పంలో విజయం సాధించాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. విశాల్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశాల్ ఎందుకు పోటీకి నిరాకరించాడనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.పోయిన పరువు నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా ఇక్కడ గెలవాలని చంద్రబాబు, బాబు ఇలాకాలో తమ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కుప్పంలో ద్విముఖ పోరు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోననే అనుమానాలు అందరిలో నెలకొనడం సహజమే.
గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పార్టీ పథకాలతో ప్రతిపక్ష పార్టీ హామీలతో ప్రజలను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించడం మామూలే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తేనే పరువు దక్కుతుందని టీడీపీ, స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం చేయాలని అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
మరి కుప్పంలో గెలుపెవరిది అన్నదే హాట్ టాపిక్ గా మారింది.