Homeసినిమాతానే కావాలంటున్న దళపతి విజయ్ !!!

తానే కావాలంటున్న దళపతి విజయ్ !!!

విజయ్ దళపతి సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్‌తో సీనియర్ హీరోయిన్ త్రిష జతకట్టబోతోంది. ఈ మేరకు ఓ చిన్న వీడియోను కూడా చిత్ర యూనిట్ షేర్ చేసింది. 2004లో తొలిసారి స్క్రీన్‌ని షేర్ చేసుకున్న ఈ జంట…? మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించున్నారు.

సీనియర్ హీరోయిన్ త్రిష మరోసారి తమిళ్ స్టార్ హీరో విజయ్‌ తో రొమాన్స్ చేయబోతోంది. దళపతి విజయ్ 67వ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుండగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విజయ్, త్రిష ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్లో నటించగా.. ఆఖరిగా 2008లో వచ్చిన కురివి మూవీలో స్క్రీన్‌ని షేర్ చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌, త్రిషతో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మీనన్, ప్రియ ఆనంద్, అర్జున్ సర్జా తదితరులు కీలక పాత్రలు పోషించబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

విజయ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. సంక్రాంతికి అతను నటించిన వారీసు మూవీ రిలీజై రూ.250 కోట్లు వరకూ వసూళ్లని రాబట్టింది. తెలుగులో వారసుడు పేరుతో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. వరల్డ్‌వైడ్‌గా బాగానే కలెక్ట్ చేసింది. మరోవైపు త్రిష గత ఏడాది ‘పొన్నియన్ సెల్వన్-1’లో నటించి మళ్లీ జోరందుకుంది. ఆ సినిమాలో రాజకుమారి కుందవై పాత్రలో నటించిన త్రిష.. మునుపటి కంటే అందంగా తెరపై కనిపించింది. దాంతో ఈ అమ్మడికి మళ్లీ తమిళ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటి వరకూ విజయ్, త్రిష కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 2004లో వచ్చిన గిలి మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2008లో కురువి, 2005లో తిరుపాచి, 2006లో ఆది సినిమాల్లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఇప్పుడు ఐదో సారి ‘దళపతి67 మూవీ కోసం జతకట్టబోతున్నారు. ఇటీవలే వారిసు సినిమా తో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న విజయ్ మరో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు అంటూ ఆయన అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

Must Read

spot_img