రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు. అంతకు ముందు కూడా విజయ్ దేవరకొండ గొప్ప విజయాలను సొంతం చేసుకోలేదు. అర్జున్ రెడ్డి.. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడిందే లేదు. దాంతో వెంటనే విజయ్ దేవరకొండకు ఒక భారీ బ్లాక్ బస్టర్ కావాలి. అది ఖుషి రూపంలో వస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కూడా ఖుషి సినిమాపై కాస్త ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నారు. మినిమం గ్యారెంటీ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన శివ నిర్వాణ ఖుషి సినిమాను కూడా కచ్చితంగా సక్సెస్ అయ్యేలా తీస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఖుషి సినిమాపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు సమంత అనారోగ్య పరిస్థితులు పెద్ద షాక్ ఇచ్చాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఖుషి సినిమా ఇప్పటికే విడుదల అయ్యి ఉండేది.. లేదంటే ఈ ఫిబ్రవరిలో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఇప్పటి వరకు ఖుషి సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వలేదు. ఖుషి సినిమా షూటింగ్ కు సమంత ఈ నెలలో హజరు అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఆమె ఇంకా పూర్తిగా కోలుకున్నట్లుగా లేదు.. మీడియా సమావేశంలోనే సమంత కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. అలాంటిది షూటింగ్ లో పాల్గొనాలి అంటే కష్టమే. అందుకే వచ్చే నెల వరకు ఖుషి యూనిట్ సభ్యులు వెయిట్ చేయాల్సి రావచ్చు.
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాకు వెళ్లే పరిస్థితి లేదు. ఆ మధ్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను అనుకున్నా కూడా ఖుషి ఫలితాన్ని బట్టి ఆ సినిమాను చేద్దాం అన్నట్లుగా మేకర్స్ వెయిట్ చేస్తున్నారట. దాంతో ఖుషి సినిమా ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ రౌడీ స్టార్ వెయిట్ చేస్తున్నాడట. ఖుషి సినిమా షూటింగ్ ముగియకపోవడంతో అటు ఇటు కాకుండా విజయ్ దేవరకొండ ఊగిసలాటలో ఉన్నాడు.