గీతగోవిందం కోసం ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్లాన్ చేస్తున్నారట. 2018లో వచ్చిన ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. మరీ ముఖ్యంగా.. సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. దాంతో సీక్వెల్‌లోనూ ఈ జోడినే రిపీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన కెరీర్ రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ..బాక్సాఫీస్ వద్ద మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా దేవరకొండ రేంజ్ కాస్త కూడా తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వణ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాలో సమంత కథనాయకగా నటిస్తోంది. ఆ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల కానుంది. ఇక ఆ సినిమా అనంతరం విజయ్ వెంటనే మరొక సినిమాను కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ గీతగోవిందం సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పరశురాం దర్శకత్వంలో 2018 లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు మళ్లీ ఆ దర్శకుడు అదే కథకు సీక్వెల్ రెడీ చేస్తూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండకు నిర్మాత అల్లు అరవింద్ కు ఆ కథకు సంబంధించిన స్టోరీ లైన్ గురించి కూడా చెప్పారట. అది నచ్చడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిస్థాయిలో కథ సిద్ధమైన తర్వాత ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఒక క్లారిటీ రానుంది. ఇక విజయ్ దేవరకొండ మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ కరణ్ జోహార్ ప్రొడక్షన్లో కూడా రెండు సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.