Homeసినిమావిజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్..!

విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్..!

టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ ‘లైగర్’ మూవీ ఫ్లాప్ తర్వాత కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి, గీతా గోవిందం’ చిత్రాలతో రౌడీ స్టార్‌గా యూత్‌లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. విజయ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో సందిగ్ధం నెలకొంది.

ప్రస్తుతం తన హోప్స్ అన్ని ‘ఖుషి’ మూవీపైనే పెట్టుకున్నప్పటికీ.. ఆ మూవీ షూటింగ్‌ కంప్లీట్ అయ్యేందుకు టైమ్ పట్టేలా ఉంది. మరోవైపు సుకుమార్ కూడా విజయ్‌‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపట్లేదనే టాక్ వినిపిస్తోంది.

గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఫాల్కన్ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమాని ప్రకటించారు. 2020లో ఈ సినిమాని ప్రకటించి 2022 లో రాబోతుందని తెలిపారు. కానీ ఇప్పటిదాక దీని మీద ఎలాంటి అప్డేట్ లేకపోవడం, విజయ్-సుకుమార్ ఇప్పటివరకు కలవకపోవడం, విజయ్ వరుసగా వేరే సినిమాలు ఒప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు కారణం ..2023 డిసెంబర్ దాకా సుకుమార్ పూర్తి స్దాయిలో పుష్ప 2 చిత్రం బిజీలో ఉంటారు. మరో ప్రక్క సుకుమార్ తో చేయాలని టాలీవుడ్ స్టార్స్ ఎదురుచూస్తున్నారు. స్క్రిప్టు వర్కులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండతో సినిమా అంటే కష్టమే అంటున్నారు.

వాస్తవానికి హిట్, ప్లాఫ్ లను బట్టే సినిమా వాళ్ల లెక్కలు ఉంటాయి. లెక్కలు మాస్టర్ ఏమీ దీనికి అతీతుడు కాదు. ‘లైగర్’ ఫ్లాప్ కావడంతో లెక్కలు మారిపోయాయి. ‘లైగర్’ హిట్ అయితే విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేది. కానీ ఆ సినిమా పోవడంతో సుకుమార్ వెనక్కి తగ్గినట్టుగా చెబుతున్నారు. ‘పుష్ప’తో తనకి వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.

ఈ విషయమై సుకుమార్ సైలెంట్ గా ఉన్నారు. ఉందని, లేదని చెప్పటం లేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు..తన శిష్యుడు ఒకరితో విజయ్ దేవరకొండ దర్శకత్వం చేయిస్తూ… తన కథ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

దానికి తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..లైగర్ తో పూర్తిగా వెనకపడ్డారు. ఆ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు . చేతి నిండా ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు విజయ్. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ఖుషి సినిమా చేస్తున్నాడు.

దాంతో పాటు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగణమన సినిమా కూడా షూటింగ్ మొదలుపెట్టేశాడు. కానీ అది ఆగింది. ఆ ప్లేస్ లో జెర్శీ దర్శకుడు గౌతమ్ తో చేయబోతున్నారు. మరికొందరు దర్శకులతో సినిమాలు చేయటం కోసం కథలు వింటున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ..సుకుమార్ తో సినిమా ఉందనే చెప్తున్నారు.

Must Read

spot_img