Homeసినిమావిక్టరీ వెంకటేష్ 75వ సినిమా పై స్పెషల్ ఫోకస్

విక్టరీ వెంకటేష్ 75వ సినిమా పై స్పెషల్ ఫోకస్

కలిసుందాం రా..నువ్వు నాకు నచ్చావ్, ఆడవారి మాటలకు అర్ధలే వేరులే వంటి కుటుంబ కథ చిత్రాల్లో నటించాడు వెంకటేష్. కానీ ఈ మధ్యలో వెంకీ నుంచి ఇలాంటి సినిమాలు రాలేదు. డిసెంబర్ 13న పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వెంకీ..తన75వ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి కిసీకీ భాయ్ కిసీకీ జాన్ మూవీలో నటిస్తున్నాడు వెంకటేష్. దీనితోపాటే.. నెట్ ఫ్లిక్స్ కోసం రానాతో కలిసి రానా నాయడు వెబ్ సిరీస్ లోనూ నటించాడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో తెలుగులో మరో సినిమాని అంగీకరించని వెంకటేష్ తాజాగా తన 75వ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంకటేష్… తన 75వ మూవీని హిట్ సిరీస్ లఫేమ్ శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా హిట్ 2 తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను హీరో విక్టరీ వెంకటేష్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ వుంటుందని, రీసెంట్ గా కథ విన్న వెంకటేష్ సురేష్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

రీసెంట్ గా నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ మూవీని నిర్మించిన నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత వెంకట్ బోయినపల్లి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలిసింది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీని కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ విక్రమ్స్టైల్లో సాగుతుందని సమాచారం. వెంకటేష్ పై చిత్రీకరించే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ మూవీకి ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభిం కానున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.

Must Read

spot_img