Homeఆంధ్ర ప్రదేశ్వెంకటగిరి నియోజకవర్గంలో రచ్చకెక్కుతున్న వర్గ పోరు

వెంకటగిరి నియోజకవర్గంలో రచ్చకెక్కుతున్న వర్గ పోరు

వెంకటగిరి నియోజకవర్గం ఆనంకు దాదాపు దూరం అయిపోయినట్టేనా..మరి ఆనం తిరిగి తన సొంత నియోజకవర్గం ఆత్మకూరు వైపు అడుగులేస్తున్నారా..ఆనం రాక కోసం ఆత్మకూరు ప్రజలు ఎదురు చూస్తున్నారా.. ఆనం ఆత్మకూరుకు వస్తాడన్న వార్త ఆత్మకూరు నేతలకు గుబులు పుట్టిస్తుందా.. మెదటి నుండి ఆనం కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గం ఆత్మకూరు. 1983లొ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావించినప్పుడు ఆత్మకూరు నుండి పోటీ చేసిన ఆనం వెంకురెడ్డిని అఖండ మెజార్టీతొ గెలిపించారు ఆత్మకూరు ప్రజలు.

26 ఏళ్ల తరువాత ఆత్మకూరుకు వచ్చిన ఆనం వెంకురెడ్డి వారసుడు ఆనం రామనారాయణ రెడ్డిని సైతం ఆదరించి, అక్కున చేర్చుకోని అఖండ మెజార్టీతొ గెలిపించి అసెంబ్లీకి పంపించి మంత్రిని సైతం చేసారు ఆత్మకూరు ప్రజలు. దీంతొ ఆత్మకూరంటె ఆనం అడ్డాగా మారిందట. అయితె 2019 ఎన్నికల్లో సైతం ఆనం ఆత్మకూరు నుండే పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి పార్టీ నిర్ణయానికి తలొగ్గి వెంకటగిరి నియోజకవర్గానికి పయనమయ్యారు ఆనం. అయితె ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలను సైతం ఆనం మార్కు పాలనతొ తన అభిమానులుగా మార్చుకోగలిగారు. తాజా పరిణామాలతో ఆనం ఇప్పుడు తిరిగి ఆత్మకూరు వైపు ప్రయాణం చేయవల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆనం అభిమానులు అంటున్నారు.

అటు ఆత్మకూరు ప్రజలు సైతం ఆనం రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని టాక్.2014లో ఆత్మకూరు ఎమ్మేల్యేగా గెలుపొందిన మాజీ దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. నియోజకవర్గం కనీస అభివృద్దిని పట్టించుకోకపోవడంతొ 2019లొ గెలుపు అసాద్యమనుకున్న తరుణంలొ.. 2019లో మేకపాటి గౌతంరెడ్డి గెలుపును తన భుజాల మీదకు ఎత్తుకోని గెలిపించిన వ్యక్తి ఆనం. అయితె ఆయన మరణానంతరం ఆత్మకూరు ఉపఎన్నికల్లో గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రంరెడ్డి ప్రస్తుతానికి ఎమ్మేల్యేగా ఉన్నప్పటికీ.. ఆత్మకూరుకు ఆనం వస్తే వైసీపి అభ్యర్థి తట్టుకోగలరా అన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆనం ఆదేశాలతొ నాడు మేకపాటి కుటుంబానికి అండగా నిలిచిన ఆనం ఫాలోవర్స్ ఇప్పుడు వైసీపీలోని ఎక్కువమంది క్యాడర్ ఆనం కోసం ఎదురుచూస్తున్నారట.

2024లో ఆత్మకూరులొ ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పటికే ఆత్మకూరులో మెదలైంది. దీంతో ఆత్మకూరులో నువ్వా నేనా అంటున్న ఆనం అనుచురులు, ఎమ్మల్యే విక్రంరెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతొ దద్దరిల్లిపోతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆనం ఆత్మకూరులో అడుగు పెడితే, వైసీపీకి తీరని నష్టమన్న అంచనాలు సైతం విశ్లేషకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన గనుక .. ఆత్మకూరులో పోటీకి దిగితే, పార్టీతో సంబంధం లేకుండా గెలుపు తథ్యమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారుతోంది.

2024 ఎన్నికల్లో వైసిపికి గెలుపు అంత సునాయాసం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఆ విధంగా ఉంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపికి 2024 ఎన్నికలు కత్తిమీద సాము వంటిదేనంటున్నారు ఆత్మకూరు ప్రజలు. ఆనం వెంకటగిరి నుండి ఆత్మకూరు వైపు అడుగులేస్తే మేకపాటి కోట బద్దలు కావడం ఖాయమంటున్నారు ఆత్మకూరు ఓటర్లు. ఆత్మకూరు నియోజకవర్గంలొ ద్వితీయ శ్రేణి క్యాడర్ను సైతం పేరుతో పిలిచే ఆనంకు అంత బలీయమైన తత్సంబందాలు ఆత్మకూరుతొ ఉన్నాయి.

ఆనం రామనారాయణరెడ్డి గతంలో ఐదేళ్లపాటు మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఆ స్థాయిలో ఈ నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు లేరంటున్నారు పార్టీలకు అతీతంగా ఆత్మకూరు రాజకియ నాయకులు. గత ఎన్నికల్లో వెంకటగిరిలో వైసీపి తరఫున పోటీ చేసి గెలుపొందిన ఆనంను వైసీపి అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతుంది. దీంతొ ఆయన తన అనుచర వర్గంతో, మేధావులతో చర్చించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గానికి ఆనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరో ఇన్చార్జిని నిర్మించారు. ఎమ్మెల్యే ఉండగా ఏ నియోజకవర్గానికి మరో ఇన్చార్జిని నియమించిన దాఖలాలు ఎక్కడా లేవు.

దీంతొ ఆగ్రహించిన ఆనం బహిరంగంగానే వైసీపిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో వైసీపి చులకనగా తయారైందని అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నది ఆయన ఆరోపణ. అయితే ముంచుకొస్తున్న ముప్పులా 2024 ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఈ కోణంలో ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిని వీడితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది జిల్లాలో విస్త్రుతంగా ప్రచారం జరుగుతోంది.

ఇదే ఇప్పుడు ఆత్మకూరు వైసీపి ఎమ్మేల్యేకు గుబులు పుట్టిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం ఏ పార్టీ నుండి పోటీ చేసినా అత్యధిక మెజార్టీతో గెలుపొందుతాడని ప్రతి ఒక్కరూ చెబుతుండడమే దీనికి కారణమని టాక్. ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి ఏ విదంగాను పోటీ ఇవ్వలేడన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. గత ఎన్నికల్లో సైతం ఆనం మద్ధతు పలకడం వల్లే గెలుపు సులువైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోండడం గమనార్హం. ఈ తరుణంలో ఆనంకు తిరుగులేదని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆనం నిర్ణయమే కీలకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు సైతం .. ఆయన ఏం చెబుతారోనని ఎదురుచూస్తున్నాయి.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మేకపాటి తన సొంత నిర్ణయాలతో రాజకీయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన అనుచరుడుగా ఉన్న ఓ ప్రత్యేక అధికారి కనుసన్నల్లో వారి ఇష్టానుసారంగా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నాయన్నది నిర్వివాద అంశం. ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని విక్రమ్ రెడ్డి నిర్ణయాలు లేవని చర్చించుకుంటున్నారు. ఈ కోణంలో నియోజకవర్గంలో అనేక పరిణామాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి.

మేకపాటి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట, మర్రిపాడు, సంగం తదితర మండలాల్లో తీవ్రమైన వ్యతిరేకత నాయకుల్లో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు దృష్టికి తీసుకువచ్చిన విషయం ఇటీవల నియోజకవర్గంలొ జరుగుతున్న చర్చనీయాంశంగా తెలుస్తోంది. దీంతొ వైసీపి నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని జగమెరిగిన సత్యం. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో అడుగుపెడితే బలమైన వర్గాలు ఆయన పంచకు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అదే జరిగితే వైసీపి గెలుపు ప్రశ్నార్ధకమేనని ఆనం గెలుపు సునాయాసంగా ఉంటుందని రచ్చబండల వద్ద చర్చించుకుంటున్నారట. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు. ఆనం ఆత్మకూరుకు వస్తే పూర్వ వైభవం వస్తుందనే నమ్మకంతో ఆత్మకూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.. ప్రజల అభిమానాన్ని గౌరవించి ఆత్మకూరులో అడుగు పెడుతారో లేక మరేదైన నిర్ణయం ప్రజల ముందు ఉంచుతారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన వైసీపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేదే.. ఇప్పుడు వంద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అయితే ఆయన నిర్ణయం ఏదైనా .. గెలుపు పక్కా అన్నది స్థానికంగా వినవస్తోన్న మాటగా అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన ఆత్మకూరులో ఎప్పుడు కాలు పెడతారోనని ఆయన అనుచరులు ఎదురుచూపులు చూస్తున్నారు. అసలే ముందస్తు టాక్ వేళ ఆనం నిర్ణయం ఏమై ఉంటుందన్న ఆసక్తి నియోజకవర్గంలోనే కాక .. యావత్ జిల్లావ్యాప్తంగాను నెలకొంది. దీంతో ఆనం దారెటు అన్నది అటు వెంకటగిరి.. ఇటు ఆత్మకూరు ఓటర్లలో ప్రశ్నగా మారింది. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో .. ఆనం అభిప్రాయంపైనే అందరికీ ఆసక్తి రేగుతోంది.

Must Read

spot_img