Homeసినిమాగాసిప్స్వీరయ్య డేట్ ఇచ్చేశాడు…!

వీరయ్య డేట్ ఇచ్చేశాడు…!

2023 సంక్రాంతి సమరం రసవత్తరంగా సాగబోతోంది. ఈ ఫెస్టివెల్ కు మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సై అంటే సై అంటూ పోటాపోటీగా పోటీకి దిగబోతున్నారు. దీంతో సంక్రాంతి సమరం ఆసక్తికరంగా మారబోతోంది. దీంతో చిరు సినిమా పై అప్డేట్ ఇచ్చాడు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరి సింహారెడ్డి’ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. జనవరి 12న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ రీసెంట్ గా ప్రకటించడంతో, అందరి దృష్టి మెగా స్టార్ చిరంజీ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’పై పడింది. బాలయ్య రిలీజ్ డేట్ ప్రకటించేసి వార్ డిక్లేర్ చేసేశాడు.

మరి మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’తో ఎప్పుడు బరిలోకి దిగనున్నాడనే ఆసక్తి మెగా అభిమానుల్లో మొదలైంది. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ కోసం అంతా ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చేసింది.

వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించేశారు. బాలయ్య 12న లాక్ చేసుకుంటే మెగస్టార్ ‘వాల్తురు వీరయ్య’ కోసం జనవరి 13న భోగి పండగ రోజుని లాక్ చేసుకున్నారు. ఒకే ఒక్క రోజు లేడాతో నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిరు ‘వాల్తేరు తీరయ్య’ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో నందమూరి మెగా అభిమానులు అప్పుడే సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు.

ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలతో మొదలు కావడంతో ఇక పై ఈ రెండు క్రేజీ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ లిరికల్ వీడియోలు హంగామా చేయబోతున్నాయని తెలుస్తోంది.

బాలకృష్ణ చాలా ఏళ్ల విరామం తరువాత ఫ్యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘వీర సింహారెడ్డి’తో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో బాలయ్య డ్యుయెల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ముఠామేస్త్రీ’ అందరివాడు

సినిమాల్లో గల్లు లుంగీతో కనిపించి ఊర మాసీవ్ అవతార్ లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత మరోసారి చిరంజీవి మాసీవ్ పాత్రలో జాలరిగా నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ మూవీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

Must Read

spot_img