నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమా రాబోతోంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పోటిగా దిగుతోంది. అయితే ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఏ చిన్న అప్డేట్ అయినా కూడా చిరంజీవి, బాలయ్యల మధ్య పోల్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.
అయితే ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఏ చిన్న అప్డేట్ అయినా కూడా చిరంజీవి, బాలయ్యల మధ్య పోల్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. వీర సింహా రెడ్డి చిత్రం నుంచి మాస్ ఆంథమ్ అంటూ జై బాలయ్య పాటను ఇది వరకే విడుదల చేశారు. ఈ పాట అచ్చం ఒసేయ్ రాములమ్మ పాటకు కాపీలా ఉండటంతో జనాలు ట్రోలింగ్ చేసి వదిలి పెట్టేశారు.
తమన్ ఇచ్చిన ఈ కాపీ ట్యూన్‌ను జనాలు తిరస్కరించినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు సుగుణ సుందరి అంటూ బాలయ్య దుమ్ములేపేశాడు.వీర సింహా రెడ్డి నుంచి సుగుణ సుందరి అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులు ఊహించని కిక్కిచ్చారు. ఈ వీడియోలో యంగ్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి బాలయ్య బాబు వేస్తున్న మాస్ స్టెప్స్ పిచ్చెక్కిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. తమన్ బాణీల్లో బాలయ్య దూకుడు కనిపించింది. దీంతో
విడుదలైన క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది.
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. బాలయ్య ఎనర్జీ లెవెల్ అదుర్స్..
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. బాలయ్య ఎనర్జీ లెవెల్ అదుర్స్.. శేఖర్ మాస్టర్ దుమ్ములేపేశాడు.. అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశారంటూ నందమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నాడు. ఇక ఇందులో బాలయ్య చిందులు ఎంతలా హైలెట్ అవుతున్నాయో.. శ్రుతి హాసన్ అందాలు కూడా అంతే హైలెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ పోటీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఈ సుగుణ సుందరికి పోటీగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మరో పాట రాబోతోంది.
నిన్నే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ చిరంజీవి ఇచ్చేశాడు. నువ్ శ్రీదేవీ అయితే.. నేను చిరంజీవిని అంటూ సాగే పాటను అద్భుతమైన లొకేషన్లో షూట్ చేసినట్టు చిరు చెప్పేశాడు. మరి ఈ రెంటిలో ఏ పాట క్లిక్ అవుతుందో చూడాలి.