Homeసినిమామెగా ఫ్యామిలీలో అసలైన ఆరడుగుల బుల్లెట్ వరుణ్ తేజ్..

మెగా ఫ్యామిలీలో అసలైన ఆరడుగుల బుల్లెట్ వరుణ్ తేజ్..

మెగా ఫ్యామిలీలో అసలైన ఆరడుగుల బుల్లెట్ వరుణ్ తేజ్…ప్రస్తుతం బ్యాడ్ టైమ్ ఫేస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న వరుణ్‌కు ఈ సినిమాపై బోలెడు ఆశలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేశారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇటీవల ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రవీణ్ సత్తారు…ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ శరవేగంతో చేస్తున్నారు. వీటీ12 అనే వర్కింగ్ టైటిల్‌తో ముస్తాబు అవుతున్న ఈ సినిమా కు టైటిల్ ఏంటనేది బయిటకు వచ్చింది. ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తమంతా యూకేలో ఉంటుంది. యాక్షన్ అంతా కూడా అక్కడే అని తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. స్పై థ్రిల్లర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వరుణ్ తేజ్ సినిమాలో మెసేజ్ ఉంటుందని ప్రవీణ్ సత్తారు చెప్పారు. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ… అందులో మంచి మెసేజ్ ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలే సందేశంతో సినిమా తీస్తున్నామని ఆయన అంటున్నారు.

ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చేస్తారట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్. అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా ఆశించిన విజయం అందుకోనప్పటికీ.. ఈ సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

Must Read

spot_img