తమిళ హీరోతో సినిమా అది కూడా భారీ బడ్జెట్ తో అనేసరికి ఆ ప్రాజెక్ట్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వారసుడు చేశారు. 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీని కోలీవుడ్ లోనే కాదు…టాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా విషయంలో థియేటర్ల గొడవ గురించే. వారసుడు సినిమాకు పోటీగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి
వస్తున్నాయి. అయితే ఇద్దరు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తుంటే… దిల్ రాజు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఇంతకీ వారసుడు పొంగల్ వస్తున్నట్లా…? లేనట్లా..?
మూడు సినిమాలు సంక్రాంతికి ముందుగానే కర్చీఫ్ వేశాయి. ముగ్గురిలో మాత్రం వారసుడే ముందుగా డేట్ అనౌన్స్ చేశాడు. టీజర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ అప్డేట్స్ విషయంలో కాస్త వెనుక పడ్డాడు. దీంతో అందరీ మదిలో డౌట్స్మొదలయ్యాయి. వారసుడు సంక్రాంతికి వస్తాడా లేదా…? అని. నిజానికి మూడు సినిమాలకు సమానంగా థియేటర్ లు కేటాయించాలని నిర్ణయించారు. అయితే తమిళ హీరో సినిమా తెలుగు సీనియర్ స్టార్స్ కి ఈక్వల్ గా థియేటర్స్
ఇవ్వడం పట్ల కొందరు అసంతృప్తి గా ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కాబట్టి ఏమి మాట్లాడలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తాను ఇంతగా ఫైట్ చేస్తుంటే..విజయ్ మాత్రం తెలుగు రిలీజ్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. విజయ్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ సక్సెస్ అందుకుంటున్నాయి. కెరీర్ లో మొదటిసారి తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీగా చేస్తున్న విజయ్..ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయినా హైదరాబాద్ రావాల్సిందే. ఇంతకుముందు అంటే డబ్బింగ్ సినిమాలు కాబట్టి తెలుగులో ప్రమోషన్స్ కి పెద్దగా ఆసక్తి చూపించలేదు విజయ్. కానీ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు రిలీజ్ అన్నట్టు చెబుతున్న వారసుడుకి కూడా విజయ్ రాకపోతే మాత్రం సినిమాపై పెద్ద దెబ్బ పడుతుంది. విజయ్ ని ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్ లో ఈవెంట్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు దిల్రాజు.
విజయ్ మాత్రం ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చి ఈవెంట్స్ కి డుమ్మా కొడదామని అనుకుంటున్నారు. వారసుడు సినిమా కోసం విజయ్ కి దిల్ రాజు 110 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చాడని టాక్. మరి అంత ఇచ్చి కూడా ప్రమోషన్స్ కివిజయ్ ని తీసుకు రాలేకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడే అవకాశం ఉంటుంది. వారసుడు సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. మరి విజయ్
ఇంతకీ ప్రమోషన్స్ కి హైదరాబాద్ వస్తాడా రాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పొచ్చు.