వైసీపీ నేతలు ముఖ్యంగా జనసేన రథం వారాహి పై వ్యాఖ్యానించిన వారికి .. దిమ్మ తిరిగి, మైండ్ బ్లాంక్ అయిందన్న టాక్ ఇప్పుడు జనసైనికుల్లో వెల్లువెత్తుతోంది. మరి దీనికి కారణమేంటో.. నేతల వ్యాఖ్యల రచ్చ ఏమిటో చూద్దామా..
రాజకీయాల్లో హుందాతనం చూసి చాన్నళ్లయ్యింది. సైద్ధాంతిక పోరాటం కాదు.. ఇప్పుడంతా వ్యక్తిగతమే. అందునా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాన్ని రాజకీయంలా చూడడమే మానేశారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ అందరిదీ ఒకటే స్టైల్. ఒకరిద్దరు ఆలోచించే నాయకులు ఉన్నా వారి మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. మూర్ఖత్వంతో తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అని పట్టుపట్టి మరీ అదే మాటపై ఉండిపోవడం జగన్ అండ్ కోకు అలవాటుగా మారిపోయింది.

అధికారం ఉంది కదా అదే నిజమని భావించే వారూ ఏపీ సమాజంలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులతో ఏ విషయంలో పోరాడాలన్న కనీస ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. పవన్ విషయంలో ఆయన వినియోగించనున్న ప్రచార రథం ‘వారాహి’పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. నిషేధిత వాహనంగా చూపి అర్ధం పర్థం లేని యుద్ధాన్ని ప్రారంభించి తెలుగునాట నవ్వుల పాలయ్యారు. ఆ వాహనం కలర్ గురించి ఎంత రచ్చ చేయాలో అంత చేశారు. భారత త్రివిధ దళాల గురించి అవపోశన పట్టినట్టు.. వారాహి వాహనం ఆర్మీ నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని విష ప్రచారం మొదలు పెట్టారు. అలివ్ గ్రీన్ కలర్ వాడకూడదని దేశభక్తితో కూడిన మాటలు చెప్పారు.
వాహనం స్థాయికి మించి ఉందని.. లారీ చాసీతో తయారు చేశారని.. టైర్లు కూడా మైనింగ్ కు వినియోగించి టిప్పర్ల మాదిరిగా ఉన్నాయని లేనిపోని ప్రచారం చేశారు. అయితే మైనింగ్ అనే విషయానికి వచ్చేసరికి దానికి ఏ యంత్రాలు, ఏ పరికరాలు, ఏ వాహనాలు వినియోగిస్తారో వైసీపీ నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని సైటైర్లు సైతం పేలేందుకు అవకాశమిచ్చారు. రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారని కూడా ప్రచారం మొదలు పెట్టారు. కానీ రిజిస్ట్రేషన్ ను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సవ్యంగా పూర్తిచేశారు.
దీంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ది ఉత్త ప్రచారంగాతేలిపోయింది. అయితే వారాహి వాహనం ఎపిసోడ్ లో వైసీపీ నేతల వైపు ఏపీ ప్రజలు వింతగా చూస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. ఏంటి ఇది అంటూ కోపం, కామెడీతో కలగలిపిన చూపులు చూశారు. ఇటువంటి సీన్ లో ఎంటరయ్యే అలవాటు ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చేశారు. ఇంతటితో సినిమా అయిపోలేదు. ఇంకా ఉందంటూ సెలవిచ్చారు. ఈయన ఎంట్రీతో మరింత రచ్చ తప్పదన్న టాక్ సైతం వెల్లువెత్తింది.
ఆ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామంటూ హెచ్చరించేలా మాట్లాడారు మంత్రి గుడివాడ.
అది ఏపీ నిబంధనకు విరుద్ధమంటూ చెప్పుకొచ్చారు. రంగులు చూసే విధానం రాష్ట్రాలకు మారుతుందేమో కానీ.. నేషనల్ పర్మిట్ ఇచ్చే వాహనాలకు కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిన్న లేదు మొన్న పవన్ మార్షల్ ఆర్ట్స్ ఫొటోపై కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయిన అమర్నాథ్ ఇప్పుడు వారాహి వాహనంపై తనకు తెలిసీ తెలియని కామెంట్స్ చేసి మరోసారి దొరికిపోయారు. అన్ని నిబంధనలు చూసి తెలంగాణ రవాణా శాఖ అధికారులు వారాహి వాహనానికి నేషనల్ పర్మిట్ ఇష్యూ చేశారు. అంటే ఏ రాష్ట్రంలోనైనా ఆ వాహనం తిరిగేందుకు అనుమతులుంటాయి.

ఇది తెలియని మంత్రి అమర్నాథ్ నోరుజారారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి.. ఏపీ ప్రభుత్వం మీ వాహనాల రంగులు మార్చేస్తోంది జాగ్రత్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాటినే వైరల్ చేస్తున్నారు. కేవలం ఒక వాహనంపై రాజకీయ ప్రతీకారంతో వైసీపీనేతలు రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచార వాహనానికి అనుమతులు రావంటూ నేతలు చంకలు గుద్దుకున్నారు.
ప్రజలు ఇచ్చిన డబ్బుతో, ప్రజలు కట్టే టాక్స్ లతో ప్రభుత్వాన్ని నడుపుతు పథకాలన్నిటికీ మీ పేరు, మీ నాయకుడు పేరు, మీ నాయకుడు తండ్రి పేరు పెట్టుకొనంటున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని .. గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర నుంచి మొదలుపెడితే చెత్త కుండీలు, స్మశాన వాటిక వరకూ అన్నిటికీ మీ పార్టీ రంగులు వేయించుకున్నారు.. కోర్టులు కూడా మొట్టికాయలు పెట్టాయి ప్రజా ధనాన్ని కొన్ని వందల కోట్లు నష్ట పరిచారు మీరా మాకు నీతులు చెప్పేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొప్పతనమేంటో ముందు తెలుసుకోండి అంటూ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ ప్రచార రథానికి రిజిస్ట్రేషన్ పూర్తై, దానికి అన్ని అనుమతులు లభించాయి. ఇక దీంతో ఇప్పుడు వైసిపి నాయకులకు మొఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడిందని జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఎగిరి ఎగిరి పడ్డారు ఇప్పుడు పర్మిషన్స్ వచ్చేశాయి. దీంతో వైసిపి నాయకులకు భారీ స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి వాహనం రంగు మార్చకుండానే అనుమతులు వచ్చాయి. మా అధినాయకుడు ప్రతిదీ కూడా అన్ని అనుమతులకి లోబడి నడుచుకునే వ్యక్తని, ముఖ్యంగా దేశంపై, సైనికులకు పై అపారమైన ప్రేమను కురిపించే వ్యక్తని, సైనిక సంక్షేమ నిధి కి కూడా రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వ్యక్తి అలాంటివాడు నిబంధనలకు విరుద్ధంగా ఎలా నడుచుకుంటారు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
దీంతో ఇంకా ఏపీ రోడ్లపైకి రాకముందే వారాహి వెహికల్ మంత్రులు, సీనియర్ నేతలను బకరాలను చేసేసింది.
వారాహి అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలియని యాత్రల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనానికి పెట్టుకున్న పేరు. వారాహి వెహికల్ పరిచయాన్ని పవన్ సినిమా టీజర్ విడుదల రేంజ్‌లో ట్విట్టర్ వేదికగా రిలీజ్చే శారు. దాంతో మాజీమంత్రి పేర్నినాని గోల మొదలుపెట్టారు. వాహనానికి మిలిటరీ గ్రీన్ రంగు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజానికి వాహనం రిజిస్ట్రేషన్జ రిగేది తెలంగాణలో. ఏదన్నా అభ్యంతరాలుంటే తెలంగాణ రవాణా శాఖ చూసుకుంటుంది. మధ్యలో పేర్నినాని అభ్యంతరం ఏమిటి? ఒకవేళ రవాణా శాఖ ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ చేయటానికి అభ్యంతరాలు చెబితే అప్పుడు స్పందించినా బాగుండేది. పేర్నినాని అభ్యంతరాలు చెప్పగానే మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వెంటనే అందుకుని పవన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.
తీరా చూస్తే ఏమైంది? వారాహికి రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేసేసింది. కావాలని మంత్రులు, మాజీ మంత్రులను కెలికేందుకే పవన్ లేదా జనసేన నేతలు ఒక ఎర వేశారు. వీళ్ళు కూడా ముందు వెనకా చూసుకోకుండా గుడ్డెద్దుల్లాగ వారాహి మీద నోరు పారేసుకున్నారు. నాలుగు రోజులు నానా రచ్చ జరిగిన తర్వాత చివరకు జనసేన వెహికల్ రిజిస్ట్రేషన్ తాలూకు కాగితాలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. దాంతో ఏమి చేయాలో తెలీక మంత్రులు నోళ్ళు మూసుకున్నారు. కావాలనే వారాహిని ఎరగా వేసి మంత్రులను జనసేన బకరాలను చేసిందని. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు కనుక్కోవాలంటే తెలంగాణ రవాణా శాఖ అధికారులను అడిగి ఉంటే చెప్పుండేవారే. కానీ మంత్రులు చేతులకు పని చెప్పకుండా నోటికి పని చెప్పారు. ఇక్కడే జనాల ముందు అబాసుపాలయ్యారు.
పైగా మంత్రులు, మాజీ మంత్రుల్లో కొందరు ఇంకేమీ పనిలేనట్లుగా 24 గంటలూ పవన్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థంకావటం లేదు. చూడబోతే మంత్రులే పవన్‌కు బాగా ప్రచారం చేస్తున్నట్లుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఇకనైనా నేతలు .. వెనకా ముందు చూసుకుని మాట్లాడతారో లేదోనన్న కామెంట్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జనసేనకు డ్యామేజీ చేద్దామనుకుంటే, తిరిగి తమకే బూమరాంగ్ అయిందన్న వ్యాఖ్యలు సైతం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోందట.
మరి వారాహి దెబ్బకు నేతల నోళ్లకు మూత పడిందో లేదో అన్నదే చర్చనీయాంశంగా మారింది.